ఆర్ధిక వ్యవస్థ :
ప్రధాన ఆదాయం భూమి శిస్తు 1/9వ వంతు నుంచి 1/6వ వంతు శిస్తు వసూలు చేసేవారు.
ఖనిజ సంపదలో సగభాగం రాజ్యానికి చెందుతుంది.
గుప్తుల కాలంలో ఈ క్రింది రకాల భూములు ఉండేవి
1) క్షేత్రం -అన్ని రకాల పంటలు పండేవి
2) ఖిల -3 సం॥లుగా పంట పండనిది.
3) వస్తి -నివాసయోగ్యమైన భూమి
4) అప్రహత -అటవీ భూములు
5) గోపథ సరాహీ -పచ్చిక బయళ్లు
వివిధ రకాల పన్నులు
1) భాగ -భూమిపన్ను (1/6వ వంతు)
2) భోగ -గ్రామస్తులు పండ్లు, వంట చెరుకు రూపంలో చెల్లించే పన్ను
3) కర -న్యాయ బుద్ధి గల రాజులు చెల్లించే ప్రత్యేక పన్ను
4) ఉదయాంగ -పోలీస్ పన్ను
5) హిరణ్య -బంగారు నాణేల రూపంలో చెల్లించే భూమి శిస్తు
6) హాలీగర -నాగలి పన్ను
7) శుల్క -వర్తకుని పన్ను/రేవు పట్టణాలపై పన్ను
గుప్తుల కాలం నాటి నాణేలు
1 దీనార్ (సువర్ణ-బంగారు నాణెం)
2 రూపిక (వెండి నాణం)
3 కౌరీలు (గవ్వలు)
(నాణేల కొరత కారణంగా మారక ద్రవ్యంగా గవ్వలను ఉపయోగించారు. ఈ గవ్వలనే కౌరీలు అంటారు)
ఈ కాలంలో అప్పుపై వడ్డీ 25% ఉండేది. గుప్తులు అధికసంఖ్యలో బంగారు నాణేలు చెలామణి చేసినా, రాగి, వెండి నాణేలను రోజువారీ మారకంగా వాడేవారు.
వీరికాలంలో శకులు, యవనులను “మ్లేచ్భులుగా పేర్కోనేవారు.
అరగట్ట మరియు గటీయంత్రం/ఉద్గటగట - ఉత్తర భారతదేశంలో నీటిపారుదల వసతి.
తడగ -దక్షిణ భారతదేశంలో చెరువు ద్వారా నీటిపారుదల
కుల్యవాప -భూమి కొలత (3 ఎకరాలు)
ద్రౌనవాప -భూమీ కొలత (కుల్యవాపకు 1/8వ వంతు)
గుప్తుల సాహిత్యం:
సంస్కృతం, రాజస్థానీ ఉన్నత కులాలవారి భాషగా ఉంది. రాజశాసనాలు. చక్కని సంస్కృతంలో లిఖించబడ్దాయి. అలహాబాద్ స్తంభ శాసనాన్ని సంకలనం చేసిన హరిసేనుడు, ఒకటో కుమారగుప్తని కాలంనాటి సిల్క్ నేత పనివారి దశపురి శాసనాన్ని సంకలనం చేసిన వత్సభట్టి గుప్త యుగంలో పేరొందిన శాసన రచయితలు.
ప్రాకృతం సామాన్య ప్రజల భాషగా ఉంది. బౌద్ద, జైనం ఈ భాషను వాడారు.
కాళిదాసు:
ఇతని బిరుదు-ఇండియన్ షేక్స్‌పియర్
ఇతని రచనలు ప్రాకృతంలో ఉంటాయి
ఇతని రచనల్లో ప్రకృతి ఆరాధన, ప్రేమ కన్పిస్తుంది
ఇతను రచించిన నాటకాలు :
1) అభిజ్ఞాన శాకుంతలం : శకుంతల, దుష్యంత చక్రవర్తుల సమాగమ వృత్తాంతం
2) మాళవికాగ్నిమిత్రం : అగ్నిమిత్రుడు, మాళవికల ప్రణయ వృత్తాంతం
3) విక్రమోర్వశీయం _ : ఊర్వశి, పరూరవనికి మధ్య గల ప్రేమ వృత్తాంతం
ఇతను రచించిన కావ్యాలు
1) రఘువంశం : సూర్యవంశానికి చెందిన 30 మంది రాజులు-వారి కాలంలోని సంఘటనలు
2) కుమార సంభవం : శివ పార్వతుల ప్రణయ వృత్తాంతం
3) మేఘదూతం : యక్షుడు తన విరహవేదనను రామగిరి నుండి ప్రియురాలు ఉండే అలకా నగరానికి చేరవేయమని
మేఘాన్ని కోరుతున్న సంఘటన
విశాఖదత్తుడు:
'ముద్రారాక్షసం'-మౌర్యచంద్రగుప్పడు నందులను పదవీచ్యుతులని గావించిన విధము వర్ణించబడింది.
దేవీ చంద్రగుప్తం రామగుప్తుని కాలంలో జరిగిన సంఘటనలు పునశ్చరణ చేసింది.
శూద్రకుడు:
మరొక ప్రసిద్ధ నాటకకర్త. అతను రచించిన “మృచ్చకటికం”లో చారుదత్తుడు, ఆస్థాన నాట్యగత్తె వసంతసేనల ప్రేమ వృత్తాంతం.
తాలి యుగాల్లో బుషుల చేత రాయబడిన పురాణాలు, గుప్త యుగంలో సంస్కరించబడ్డాయి. మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణుపురాణం, మత్స్య పురాణం వీరి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు.
మహాభారతం కూడా సంస్కరించబడి మొదట్లో 24000 శ్లోకాలు ఉండగా క్రమేణా అవి 10,00,000 శ్లోకాల వరకు పెరిగాయి.
విష్ణుశర్మ “పంచతంత్రం” కూడా సేకరించబడిన కథలతో రాయబడిన గ్రంథం.
అమరసింహుడు అమరకోశాని, చంద్రగోమియా చంద్ర వ్యాకరణం రచించారు.
కళలు:
దేవాలయాలు
దేవాలయాల నిర్మాణం కొండ ప్రాంతాల నుండి మైదానాలకు మారాయి.
దేవతలకు ఆలయాలు నిర్మించడం వీరితో ప్రారంభమయింది.
వీరి కాలంలో నిర్మించిన దేవాలయాలు
1 నాబ్నా పార్వతీ దేవాలయం
2 భూమ శివాలయంలు (క్రీ.శ. 5వ శతాబ్ధికి చెందినవి)
3 భిటార్గం ఇటుకలతో నిర్మించిన దేవాలయం (క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందింది.)
4 బుద్ద గయ లోని మహాబోధి దేవాలయం భిటార్గం దేవాలయాన్ని పోలి ఉంది.
5 దియోగడ్ దశావతార దేవాలయం
విగ్రహాలు
వీరి కాలంలోని విగ్రహాలు
1 రాజషాహి కృష్ణుడు, అతని అనుచరుల ప్రతిమలు
2 సారనాథ్ పద్మాసీనుడై ధర్మచక్ర ప్రవర్తన చేసున్న బుద్ధ విగ్రహం
3 మధుర గుండు కల్చ్టి నిల్చుని ఉన్న బుద్ధ విగ్రహం
4 పావయా (గ్వాలియర్) స్త్రీ వాద్యకారులతో పరివేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ
బితోర్గం మరియు దియోగడ్ దేవాలయాలు చతురస్రాకారంలో నిర్మించబడ్డాయి.
గుప్తుల కళ పువ్వులు, తీగలతో కూడిన అలంకరణను, రేఖా గణిత ప్రామాణికతకు ఎంతో పేరు పొందింది.
లోహకారకళ
వీరి కాలంలో లోహకారకళ గుప్తుల కాలంలో లోహాలను వెలికితీసి కరిగించి పోతపోసిన కళ -లోహకారకళ (మహాకారకళ)
గుప్తులు లోహకారకళలో ఉపయోగించిన లోహాలు -వెండి, బంగారం, రాగి, ఉక్కు కంచు
బృహత్తర విగ్రహాలకు ఉపయోగించిన లోహం -కంచు
గుప్తులు విగ్రహాలను పోత పోయడానికి ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి -సైర్
లోహకారకళకు ఉదాహరణలు-
1) బుద్దుని తామ్ర విగ్రహం -నలంద (దీని ఎత్తు 81 అడుగులు, హుయాన్‌త్సాంగ్ చూసినట్టు వ్రాశారు)
2) బుద్ధుని తామ్ర విగ్రహం -సుల్తాన్‌గంజ్ (దీని ఎత్తు 71/2 అడుగులు, 1 టన్ను బరువు)
మనోహర చిత్రకళ
వీరి కాలంలో మనోహర చిత్రకళ ముఖ్యంగా 4 ప్రదేశాల్లో జరిగింది.
1 అజంతా
2 ఎల్లోరా
3 బాగ్
4 బాదామి
వాస్తును బట్టి అజంతా శిల్చ్పకళను 3విధాలుగా విభజించవచ్చు
1) గరుడు, యక్ష, గంధర్వ, అప్సరసల చిత్రాలు
2) పద్మపాణి, అవలోకితేశ్వర, బోధిసత్వ విగ్రహాలు
3) జాతక కథల చిత్రాలు