గుప్తులు:
గుప్తులు వైశ్య వర్ణానికి చెందినవారు.
శాసనాలు, నాణేలు, సాహిత్యం గుప్తుల గురించి తెలుపుతాయి.
గుప్తులు కుషాణుల సామంతులుగా ఉండేవారు.
కె.పి.జైస్వాల్ ప్రకారం గుప్తులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారు.
శ్రీగుప్తుడు:
ఇతను గుప్త వంశ స్థాపకుడు.
ఇతని బిరుదులు -మహారాజు, ఆదిరాజు
ఇతను చైనా బౌద్ధ సన్యాసుల కొరకు 'మృగశిఖ నగరము వద్ద ఒక మఠాన్ని నిర్మించాడు. దీనికి 24 గ్రామాలు దానమిచ్చినట్లు ఇత్సింగ్ తన రచనల్లో పేర్కొన్నాడు.
ఇత్సింగ్ శ్రీగుప్తున్ని చలికిత మహారాజు (చ-లికి-ట్) అని పేర్కొన్నాడు.
ఇతని తర్వాత పాలకుడు ఘటోత్కచుడు
ఘటోత్కచుని కుమారుడు- మొదటి చంద్రగుప్తుడు
క్రీ.శ. 319-20 లో 1వ చంద్రగుప్తుడు గుప్త పాలకుడు అయ్యాడు.
1వ చంద్రగుప్తుడు (క్రీ.శ. 320-885):
ఇతను క్రీ.శ.319/320లో గువ్త శకమును ప్రారంభించాడు.
ఇతను నిజమైన గుప్త రాజ్య స్థాపకుడు. ఇతను సర్వ స్వతంత్ర పరిపాలన చేపట్టిన తొలి గుప్త రాజు.
ఇతని బిరుదులు -మహారాజాధిరాజు, రారాజు
ఇతను లిచ్చివీ రాకుమార్తె కుమారదేవిని వివాహమాడి నేపాల్, బీహార్‌లను కట్నంగా పొందాడు.
ఇతను రెండు రకాల బంగారు నాణెములను ముద్రించాడు( తన రూపం, తన భార్య రూపంతో)
కామాంధకుడు ఇతని ఆస్థానంలో ఉండేవాడని పేర్కొంటారు.
సముద్రగుప్తుడు (క్రీ.శ. 885-380):
ఇతని బిరుదులు -
1) ఇండియన్ నెపోలియన్ (1862లో వి.ఎ.స్మిత్ పేర్కోన్నాడు)
2) వ్యాగ్రహ పరాక్రమ
3) కవిరాజు
4) కుండలహీన
ఇతను ఒక గొప్ప సంగీతకారుడు (వీణ వాయిస్తాడు)
ఇతని భార్య దత్తాదేవి
ఇతను గుప్త రాజులలో అతి గొప్పవాడు.
ఇతని సేనాని హరిసేనుడు అలహాబాద్ శాసనమును చెక్కించాడు(ఈ శాసనం-సంస్కృత భాష, దేవనాగరి లిపి). ఈ అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుని ఈ క్రింది దండయాత్ర గురించి పేర్కొనబడింది.
1) మొదటి ఉత్తర భారతదేశ దండయాత్ర
2) దక్షిణ భారతదేశ దండయాత్ర
3) రెండవ ఉత్తర భారతదేశ దండయాత్ర
4) ఐదు సరిహద్దు రాజ్యాలు, 9 గణ రాజ్యాలు