భక్తి సూపీ ఉద్యమాలు Sufi and Bhakti Movement-5

TSStudies
ఆళ్వార్లు, నాయనార్లు:
ఆళ్వార్లు;
వీరి సాహిత్యాన్ని ప్రబంధాలు అంటారు. వైష్ణవ్రులను ఆళ్వార్లు అంటారు
12 మంది ఆళ్వార్ల గురువులు ఉన్నారు. ముఖ్యమైనవారు: రామానుజాచార్య, నింబార్మర్‌, తిరువళ్ళువర్‌ మొదలగువారు.
నింబార్కర్‌ ద్వైత అద్వైతం బోధించాడు. ఇతను 'వేదాంత పారిజాతసౌరభి పుస్తకాన్ని రచించాడు
ఇతను కృష్ణ భగవానుడి పరమ భక్తుడు.

నాయనార్లు:
శైవులను నాయనార్లు అంటారు. వీరి సాహిత్యాన్ని 'తేవరమ్‌” అంటారు.
63 మంది నాయనార్ల గురువులు ఉన్నారు
ముఖ్యమైన గురువు -మెకాండర్‌. ఇతను శివజ్ఞాన బోధి పుస్తకాన్ని రచించాడు. ఇతను అగామిక్‌ శైవ తెగను స్థాపించాడు.

ఇతర భక్తి సన్యాసులు:
శంకర్‌దేవ  - అస్సాం
లల్లా - కాశ్మీర్ 
మీరాబాయి - చితోర్‌. 
ఈమె రాణా సంగ్రామ్‌ సింగ్‌ పెద్ద కుమారుడైన భోజ్‌ రాజ్‌ భార్య. ఈమె తన మరిది విక్రమ్‌సింగ్‌ నుండి అనేక కష్టాలు ఎదుర్కొంది.
భోజ్‌ రాజ్‌ మరణానంతరం ఈమె శ్రీకృష్ణుని భక్తురాలిగా మారి శ్రీకృష్ణుని పై అనేక కీర్తనలు ఆలపించింది. 
ఈమె సంగీత వాయిద్యం ఏకతార. ఈమె కీర్తనలు పదావళి అనే పుస్తకంలో సేకరించబడ్డాయి
ఈమె కృష్ణుని భక్తురాలు. 
సూరదాస్‌ - ఆగ్రాలో బోధించాడు
ఇతనిని ఆగ్రా అందకవి అంటారు.
ఇతను సూర్‌సాగర్‌, సూర్‌సరవాళి, సాహిత్యరత్సు సుందర విలాసం అనే గ్రంథాలు రచించాడు.
సూర్‌ సాగర్‌లో శ్రీకృష్ణుని జన్మ నుంచి అతను మధురకు బయులుదేనే వరకు గల కథ పేర్కొనబడింది.
గోరఖ్‌నాథ్‌  - ఉత్తరప్రదేశ్‌లో బోధించాడు. ఇతని శిష్యులను నాథ్‌పాంతీలు అంటారు.
నరసింహం  - గుజరాత్‌లో బోధించాడు.
నాభాజీ - భక్తమాల అనే పుస్తకం రచించాడు. ఇది మధ్యయుగ సన్యాసుల గూర్చి వివరిస్తుంది.
తులసీదాస్‌  - రామచరిత మానస్‌ రచించాడు. (అక్బర్‌ సమకాలీకుడు)

సూఫీ ఉద్యమం:
'సూఫీ' అంటే “ఉన్ని అని అర్థం. ప్రేమతో మానవుడు భగవంతునిలో లీనం కాగలడన్నదే సూఫీ మత ముఖ్య సిద్ధాంతం.
దైవసాన్నిధ్య భావనను సృష్టించడానికి సంగీత ప్రాముఖ్యం గల పాటలను 'సమాస్‌/ నమాజ్ను అనుసరించడం ద్వారా వీరు ప్రజాదరణ పొందారు.
సూఫి అనే పేరు మొదటిసారిగా అబుహషీంకు ఉపయోగించారు.
ఇతను కుఫా(ఇరాక్‌)కి చెందినవాడు. 
మొట్టమొదటి మహిళా సూఫీ సన్యాసిని -రబియా(ఇరాక్‌)
ఇ భారతదేశంలో సూఫీ ఉద్యమ వ్యాప్తి చేసినవారు - మొయినోద్దీన్‌ చిస్టీ

చిస్థీ తెగ:
ప్రధాన కేంద్రం -అజ్మీర్‌
స్థాపకుడు... - మొయినోద్దీన్‌ చిస్థీ(1143-1236)
బిరుదు - ఖ్వాజా గరీబుద్దీన్‌ / ఖ్వాజాగరిబ్‌ ఉన్‌ నవాబ్‌
మొయినోద్దీన్‌ చిస్ట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ కాలంలో ఇండియా వచ్చాడు.
ఇతను అజ్మీర్‌లో స్థిరపడ్డాడు.
ప్రసిద్ధ చరిత్రకారుడు జియావుద్దీన్‌ బరౌని, సుప్రసిద్ధ కవి అమీర్‌ఖుప్రోలతో సహా అనేకమంది మొయినోద్దీన్‌ చిస్థీ  అనుచరులైనారు.

ఇతర చిస్థీ సన్యాసులు:
1) కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి
2) హమీద్‌ ఉద్దీన్‌ నగౌరీ
3) బాబా ఫరీద్‌ (గంజ్‌-ఇ-షికర్‌) -1175-1265 (ఇతని బోధనలు ఆదిగ్రంథ్‌లో చేర్చబడ్డాయి)
4) నిజాముద్దీన్‌ బెలియా (ఏడుగురి ఢిల్లీ సుల్తానుల పాలనను చూశాడు, ఇతను యోగాసనాలను పాటించాడు). ఇతను ఢిల్లీ సుల్తానుల నుండి బహుమానాలు స్వీకరించాడు. యోగీలు ఇతన్ని సిద్‌ అని పిలిచేవారు.
3‌) నసీరుద్దీన్‌ -చిరాగ్‌-ఇ-దెహ్లవీ (లైట్‌ ఆఫ్‌ ఢిల్లీ)

సుహ్రవాదీ తెగ:
ప్రధాన కేంద్రం -ముల్తాన్‌
స్థాపకుడు. - బహావద్దీన్‌ జకారియా (బాబా ఫరీద్‌కు సమకాలికుడు)
ఇతను వైభవంగా, విలాసవంతంగా జీవించాలని చెప్పాడు. 
సుహ్రావాది తెగ అనేక శాఖలుగా చీలిపోయింది. అవి
1. ముల్తాన్‌ శాఖ
2.ఉచ్చా శాఖ-మొహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ దీన్ని అత్యధికంగా గౌరవించాడు.
3. ఫిరదౌసియా

కాద్రీ తెగ:
స్థాపకులు - షానయామ తుల్లా ,ముక్దుం మహ్మద్‌ జిలానీ
నక్షా బందీ : బాకీ బిల్లా
సూఫీ తెగలను సిల్‌సిలాలు అంటారు.
ఇ అబుల్‌ ఫజల్‌ తన ఐనీ అక్బరీలో 16 సిల్‌సిలాలు గురించి పేర్కొన్నాడు.

వహాబీ ఉద్యమం:
వహాభీ ఉద్యమాన్ని సయ్యద్‌ వాహీద్‌ రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్‌)లో స్థాపించాడు.
మొదట్లో ఇది మతపర ఉద్యమం. తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంగా మారింది.
ఇది బ్రిటీష్‌కి వ్యతిరేక ఉద్యమంగా మారింది.