సగుణ సన్యాసులు:
దేవునికి రూపం ఉంది, విగ్రహారాధన, తీర్థయాత్రలు చేయాలని చెప్పారు.
ముఖ్యమైనవాడు -సూర్‌దాస్
వీరు ప్రధానంగా 3 ప్రాంతాలలో ఉండేవారు.
1) మరాఠా వైష్ణవిజమ్ (మహారాష్ట్ర)
2) గౌడ వైష్ణవిజమ్ (బెంగాల్)
3) ఆళ్వారులు నాయనార్లు (దక్షిణ భారతదేశం)
1) మరాఠా వైష్ణవిజమ్:
మహారాష్ట్రలో భక్తి ఉద్యమంవ్యాప్తి చేసింది -రామానుజాచార్యుడు.
పండరీపూర్‌లో విఠోభా దేవాలయం ఆధారంగా భక్తి ఉద్యమం వ్యాప్తి చెందింది.
మహారాష్ట్రలో భక్తి ఉద్యమకారులు రెండుగా చీలిపోయారు
1) ధారకారీ తెగ
2) వారకారీ తెగ
ధారకారీ తెగ:
వీరు పండరీపూర్‌కి సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్ర చేసేవారు.
ముఖ్యమైన భక్తి సన్యాసి -రామదాసు
ఇతను శివాజీ మత గురువు
రామదాసు యొక్క కాషాయ వస్త్రాన్ని తన అధికారిక పతాకమని శివాజీ ప్రకటించాడు.
రామదాసు దశబోధ అనే పుస్తకాన్ని రచించాడు.
వారకారీ తెగ:
వీరు సంవత్సరానికి రెండు సార్లు పండరీపూర్‌కి తీర్థయాత్రకి వెళ్లేవారు.
జ్ఞానేశ్వర్: ఇతను జ్ఞానేశ్వరి/అమృత అనుభవ్ పుస్తకాన్ని రచించాడు.
నామదేవుడు:
ఇతను దర్జీ కుటుంబంలో జన్మించాడు.
మహామ్మదీయ మతంచే ప్రభావితుడయ్యాడు.
ప్రేమ సందేశాన్ని ప్రబోధించాడు. కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు.
మహమ్మదీయ మతంచే ప్రభావితుడయ్యాడు. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతానికి ప్రాముఖ్యతనిచ్చి విగ్రహారాధన, కుల వ్యవస్థను తీవ్రంగా ఖండించారు.
ఇతను అనేక 'అభంగాలు” రాశాడు
ఏక్‌నాముడు/ఏక్‌నాథ్: ఇతను భగవద్గీతపై అనేక వ్యాఖ్యానాలు రచించాడు.
తుకారాం:
ఇతను మొదట్లో సూఫి సన్యాసి తరువాత భక్తి సన్యాసిగా మారి మొత్తం మహారాష్ట్ర భక్తి సన్యాసులలో అతి గొప్పవాడుగా పేరుపొందాడు. ఇతను శివాజీ, జవాంగీర్, షాజహాన్‌కు సమకాలీకుడు.
ఇతన్ని మరాఠ కబీర్ అంటారు. మరాఠ భక్తి ఉద్యమాలపై వాఖ్యలు రాశాడు.
గౌడ వైష్ణవిజమ్:
చైతన్యుడు:
ఇతని అసలు పేరు విశ్వాంబర మిశ్రా.
ఇతని గురువు కేశవ భారతి
భక్తి ఉద్యమకారులలో ఇతనికి అత్యధికంగా శిష్యులు ఉన్నారు
ఇతని ఆత్మకథ “చైతన్య చరితామృతం”ను కృష్ణదాస కవిరాజా రచించాడు.
ఇతను బెంగాలీ, అస్సామీ, ఒరియా భాషలలో బోధించాడు.
ఇతను 'హరేరామ హరేకృష్ణ నినాదం ఇచ్చాడు ఇతను తనకు తాను కృష్ణుని అవతారమని ప్రకటించుకున్నాడు.
ఇతను “అచ్చింత బేదవాద' సిద్ధాంతమును బోధించాడు.
చైతన్యుడు 'రాగమార్గం' మోక్షానికి ఉత్తమ మార్గమనే సందేశాన్ని ప్రచారం చేశాడు.
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాడు.
బెంగాల్, ఒరిస్సాల్లో చైతన్యుని అనుచరులు వేల సంఖ్యలో ఉన్నారు.
చండిదాస:
ఇతను జయదేవుని గీత గోవిందంతో, బౌద్ధ మతానికి చెందిన సహాజియా తెగతో ప్రభావితమై భక్తి సన్యాసిగా మారాడు.
ఇతను చిరుతలకు / చెక్క భజనకు ప్రసిద్ధి.