మొఘలులు:
మొఘల్ సామ్రాజ్యం స్థాపించింది -బాబర్
ఇతని అసలు పేరు -జహీరుద్దీన్ మొహ్మద్ బాబర్
టర్కీ అమిర్‌ల ప్రకారం బాబర్ అనగా సింహం
ఇతని తండ్రి - మీర్జా ఉమర్
మీర్జా ఉమర్ ఆఫ్ఘనిస్థాన్ -ఉబ్జెకిస్తాన్‌లో ఫర్ఘాన పాలకుడు.
ఫర్ఘాన రాజధాని - ఆండీజన్
బాబర్ తండ్రి తరపున తైమూర్ ఇలాంగ్ వంశానికి చెందినవాడు.
బాబర్ తల్లి తరపున చెంఘీజ్‌ఖాన్ వంశానికి చెందినవాడు.
బాబర్ చాగ్‌తాయి తెగకు చెందినవాడు
బాబర్ 11 సం॥ల వయస్సులో ఉమర్ మీర్బా మరణానంతరం పర్ఘాన పాలకుడయ్యాడు.
బాబర్ తన మామ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనిచివరకు కాబూల్‌లో స్థిరపడ్డాడు.
బాబర్ మొట్టమొదటిసారిగా 1519లో ఇండియాపై దాడి చేశాడు.
బాబర్ ఈ మొదటి దాడిలో వాయువ్య భారత్‌లో భీరా ప్రాంతంపై దాడి చేశాడు.
బాబర్ భీరా వద్ద మొట్టమొదటిసారిగా గన్‌పౌడర్ ఉపయోగించాడు.
బాబర్ యొక్క 5వ దాడిలో పానిపట్టు యుద్ధం జరిగింది.
బాబర్ భారతదేశంపై దాడి చేస్తున్నప్పుడు భారతదేశంలో పాలకులు
పంజాబ్ - దౌలత్‌ఖాన్ లోడీ
ఢిల్లీ - ఇబ్రహీం లోడీ (పినతండ్రి ఆలంఖాన్ లోడి)
మాళ్వా - మొహమ్మద్-2 (ప్రధాని-మేథినీరాయ్-2)
మేవార్ - రాణా సంగా
గుజరాత్ - మజఫర్‌షా
బెంగాల్ - నుస్రత్ షా
దక్షిణ భారతదేశం- శ్రీకృష్ణ దేవరాయలు
బాబర్ (1526-30):
రాణాసంగ్రామ్‌సింగ్, ఆలంఖాన్ లోడి అభ్యర్థన మేరకు 5వ సారి దాడి చేశాడు.
1526(ఏప్రిల్ 21) - మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీంభాన్ లోడీని ఓడించి ఢిల్లీలో మొఘలుల పాలనను స్థాపించాడు.
ఈ యుద్ధంలో ఇబ్రహీంకు సహకరించింది-రాజా విక్రమ్‌జిత్ (గ్వాలియర్ పాలకుడు)
ఈ యుధ్ధంలో బాబర్ రూమి(గొయ్యి), తులుగుమ(అశ్వక దళం) అనే యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు.
1527 - కాణ్వా యుద్ధంలో మేవార్ పాలకుడు రాణా సంగ్రామ్‌సింగ్‌ను ఓడించాడు. ఈ యుద్ధంలో బాబర్ రాణా సంగాపై జిహాద్ ప్రకటించాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ గాజీ బిరుదు పొందాడు. ముస్లింలపై “టంగా'(స్టాంప్ డ్యూటీ) అనే పన్ను రద్దు చేశాడు. ఈ యుద్ధ విజయం భారత్‌లో బాబర్ స్థానం సుస్థిరం చేసింది. ఈ యుద్ధం మొదటి పానిపట్ యుద్ధం కన్నా ముఖ్యమైనది.
రాణా సంగా బిరుదులు : 1) మాన్ ఆఫ్ హండ్రెడ్ బ్యాటిల్స్ 2) ఫ్రాంగ్మెంటెడ్ సోల్డర్
రాణా సంగా యొక్క తాత రాణా కుంభా(1433-68). చిత్తోడ్‌లో కీర్తిస్తంభాను
నిర్మించాడు.
1528 - చందేరీ యుద్ధంలో మాళ్వా పాలకుడు మేధినీరాయ్‌ను ఓడించి, చందేరీ కోటను, మాళ్వాను ఆక్రమించాడు.
1529 - గోగ్రా యుద్ధంలో నుస్రత్ షా, మొహ్మద్ షా అనే ఆష్టనులను ఓడించి బెంగాల్‌ను ఆక్రమించాడు.
1530 - బాబర్ మరణించాడు. (ఇతను మరణం గురించి గుల్‌బదన్ బేగం తన హుమయూన్ నామా పుస్తకంలో పేర్కొంది)
బాబర్ తన ఆత్మకథ బాబర్‌నామాను టర్కీ భాషలో రచించాడు. దీన్నే తజుక్-ఇ-బాబరి అని కూడా అంటారు
అందువల్లనే బాబర్‌ను స్వీయ చరిత్రల రారాజు అంటారు.
అతని యొక్క అమీరులు అతనికి, బాబర్(సింహం లేక పులి) అనే బిరుదు ఇచ్చారు. బాబర్ తన స్వీయగ్రంథమైన తజుక్-ఇ-బాబరిలో హిందుస్థాన్ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైన దేశం అని “అద్భుత దేశంగా వర్ణించాడు.
ఇతను మస్నవీ అనే పుస్తకం కూడా రచించాడు.
బాబర్ కాలంలో కాశ్మీర్ పాలకుడైన మీర్జా హైదర్ తారిక్-ఇ-రషీదీ అనే పుస్తకాన్ని రచించాడు.
ముల్లా షరఫ్ జాఫర్‌నామాను రచించాడు.