భక్తి సూపీ ఉద్యమాలు Sufi and Bhakti Movement-3

TSStudies
మధ్య యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలిపోయింది.
1) నిర్గుణ
2) సుగుణ

1) నిర్గుణ:
దేవునికి రూపం లేదు, విగ్రహారాధన చేయరాదు, తీర్థయాత్రలు చేయరాదు అని వీరు చెప్పేవారు
నిర్గుణ సన్యాసులలో ముఖ్యులు -
1. కబీర్
2. గురునానక్‌
3. దాదుదయాల్‌

1) కబీర్‌ :
ఇతనిని మధ్యయుగ కారల్‌మార్క్స్ అంటారు
ఇతను హిందూ, ముస్లిం కలయికను ప్రోత్సహించాడు
లౌకికవాదంను బోధించాడు
రామ్‌ రహీం ఒకే నాణెం యొక్క రెండు రూపాలని చెప్పాడు.
హిందువులు, మహమ్మదీయులు ఒకే మట్టితో తయారైన కుండలు అని కబీర్‌ వ్యాఖ్యానించాడు.
'హృదయం నిష్కల్మషంగా లేనపుడు, రాతిని పూజించడం వల్ల, గంగానదిలో స్నానం చేయడం వల్ల లాభమేమి? మోసబుద్ధితో, అపవిత్రమైన హృదయంతో కాబా వైపు నడిస్తే మక్కసందర్శించడం వల్ల ప్రయోజనమేమి? అని కబీర్‌ ప్రశ్నించాడు.
ఇతను సికిందర్‌ లోడికి సమకాలీనుడు.
ఇతను వమధ్యవదేళ్‌లో వీరనింవా బాగేల్‌ (బుందేల్‌ఖాండ్‌)కు సమకాలీకుడు.
ఇతను అత్యధికంగా విగ్రహారాధనను ఖండించాడు
ఇతని బోధనలు దోవాస్‌ అనే గ్రంథంలో సేకరించబడ్డాయి. దీనిలో సిఖిస్‌, బిజాంటి అనే భాగాలున్నాయి.
మరణానంతరం అతని మృతదేహంపై ఉన్న పూలను హిందువులు వారణాసి వద్ధ, ముస్లింలు మగర్‌ (గోరఖ్‌పూర్‌)లో పూడ్చారు.

2) గురునానక్‌:
ఇతను 1469లో పంజాబ్‌(పాక్‌)లోని తాల్వండి (నంకానాసాహెబ్)‌లో ఖత్రి కుటుంబంలో జన్మించాడు. 
ఇతను సిక్కు మత స్థాపకుడు
లౌకికత్వంను బోధించాడు
ఇతను అనేకసార్లు మక్కాను సందర్శించాడు.
పద్య రూపంలో ఉన్న అతని బోధనలు ఆదిగ్రంథ్‌గా సంకలనం చేశారు. ఆదిగ్రంథ్‌ సిక్కుల పవిత్ర గ్రంథం.
హిందూ-మహమ్మదీయ సమైక్యత నానక్‌ జీవితాశయం. భగవంతుడొక్కడే అని ప్రకటించి, హిందువులు, మహమ్మదీయుల మధ్య భేదాలు తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. తనకు తాను గురువుగా ప్రకటించుకున్న వెంటనే హిందువు లేడు, మహమ్మదీయుడు లేడు అని నానక్‌ ప్రకటించాడు. అలా ప్రకటించడానికి అతని ఉద్దేశం వారి మధ్య విభేదాలు లేకుండా చేయాలని.
తన అనుచరులందరూ కుల విభేదాలను విస్మరించి, అందరూ కలసి ఉమ్మడి భోజనశాలలో (అంగర్‌) భోజనం చేయాలని ఆదేశించాడు.
సిక్కు మతస్తులందరు 'ఖిల్సా'గా వ్యవస్థీకరించబడ్డారు. “ఖల్సా” అంటే 'పవిత్రమైన' అని అర్ధం.
ఇతని అనుచరులు సిక్కులు” అని పిలవబడ్డారు. సిక్కులు అనగా శిష్యులు”.
ఇతని సంగీత వాయిద్యం -రబాబ్‌
ఇతని ప్రధాన శిష్యుడు -మదనా
ఇతని తర్వాత 9 మంది సిక్కు గురువులున్నారు.

3) దాదుదయాళ్‌:
ఇతను గుజరాత్‌లో బోధించాడు
ఇతని శిష్యులను నిపక్‌పాంథీలు అంటారు/ దాదుపాంథీలు అంటారు. /
ఇతని బోధనలు పన్నీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.

4) రాయదాస:
ఇతను వారణాసిలో చెప్పులు కుట్టుకునేవాడు
ఇతని ప్రధాన శిష్యురాలు - రాణీ షాలి