2) రామానుజాచార్య:
ఇతను తమిళనాడులోని శ్రీపెరంబూర్ లో జన్మించాడు.
ఇతను భక్తి ఉద్యమ నిజమైన స్థాపకుడు
చోళ రాజులతో వివాదం ఏర్పడి రామానుజులు చోళరాజ్యం వదిలి మహారాష్ట్ర చేరుకున్నాడు.
మహారాష్టలోని వండరీవూర్‌లో గల విరోభా దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని భక్తి ఉద్యమ వ్యాప్తి చేశాడు
ఇతను విశిష్ట అద్వైతంను బోధించాడు
ఇతను శ్రీ వైష్ణవ తెగను స్థాపించాడు
3) మద్వాచార్య:
ఇతను కర్ణాటకలోని కెనరాలో జన్మించాడు
ఇతను ద్వైత తత్వంను బోధించాడు
4) రామానంద:
ఇతను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జన్మించాడు
ఇతని గురువు రాఘవానంద
ఇతను శ్రీరాముని భక్తుడు
ఇతను మొదటిసారిగాహిందీ భాషలో బోధించిన భక్తి ఉద్యమకారుడు.
ఇతని శిష్యులు
1) కబీర్ (నేతపనివాడు)
2) రాయదాస (చెప్పులు కుట్టేవాడు)
3) సేనదాస (మంగలివాడు)
4) పీప (రాజపుత్రుడు)
5) వల్లభాచార్యుడు:
ఇతను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించాడు
ఇతను శుద్దాద్వైతంను బోధించాడు
ఇతని బిరుదు - ఎపిక్యురియన్ ఆఫ్ ద ఈస్ట్
6) బసవ:
ఇతను కర్ణాటకలో బిజ్జల రాజ్యానికి ప్రధాని
ఇతను వీర శైవిజమ్‌ను స్థాపించాడు
ఈ మతాన్ని పాటించేవారిని లింగాయతులు అంటారు.
వీరి గురువులను జంగములు అంటారు
వీరి మత పుస్తకాలను అగములు అంటారు
ఈ మతం సాంఘిక సంస్కరణలు బోధించింది.
ఉదా! 1) వితంతు వివాహం జరగాలి 2) బాల్య వివాహాలు నిషేధం మొదలగునవి