Moral Story in Telugu-కిట్టీకీ తెలిసొచ్చింది
మామిడిపల్లి అనే ఊరిలో కిట్టీ అనే పిల్లి పిల్ల ఉండేది. దానికి ఆడుకోవడం అంటే చాలా సరదా, రోజంతా అటు గంతులేసి ఇటు గంతులేసి ఆకలి వేసేసరికి తల్లి దగ్గరకు చేరుకునేది. తల్లి ఇచ్చే పాలు తాగి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయేది. చుట్టుపక్కల ఇళ్ళ వారంతా కిట్టీ అంటే భయపడి పోయే వారు. ఎందుకంటే అది వాళ్ళ ఇళ్ళలోకి దూరి వస్తువులన్నీ చెల్లాచెదురుగా చేసేది.
ఒకరోజు కిట్టీ తల్లి కట్టీ అంది కదా! నువ్వు పెద్ద పిల్లవి అవుతున్నావు ఇక నుంచి కష్టపడటం నేర్చుకోవాలి. కష్టపడితే ఈ లోకంలో తిండి దొరకదు తెలుసా!
'ఎందుకు దొరకదు! ఈ లోకంలో ప్రతి జీవి హాయిగా ఆడుకుంటూ ఉన్నాయి కదా' అంది కిట్టీ చిరాకుగా. 'అలా ఏం కాదు కావాలంటే నువ్వే వెళ్లి వాటితో మాట్లాడు నిజం తెలుస్తుంది' కిట్టీ వాళ్ళమ్మ. సరేనని బయలుదేరింది కిట్టీ. కొంతదూరం వెళ్ళేసరికి దానికి ఒక తేనెటీగ కనిపించింది అది పూల చుట్టూ తిరుగుతుంది.
ఓయ్తే తేనెటీగ నువ్వు హాయిగా పూల వాసన చూస్తూ ఆడుకుంటున్నావు కదు! అని అడిగింది కిట్టీ దాన్ని. అదేం కాదు! నేను మైళ్ళ కొద్దీ తిరుగుతూ పూలలో ఉండే తేనెను సేకరించాలి అదే మాకు, మా పిల్లలకి ఆహారం అనేసి మరో ముక్క దగ్గరికి వెళ్లి పోయింది.
'పడుకోవడమా పాడా! నేను ఇందాకనే పెద్ద కప్పని మింగాను దాన్ని జీర్ణం చేసుకోవటం కోసం ఇలా ఆపసోపాలు పడుతూ ఉన్నాను' అంది పాము నీరసంగా.
అమ్మ మాటలు నిజమే అనుకుంది కిట్టీ.
అయినా దాని సందేహం తీరలేదు. ఖాళీగా ఉండే జంతువులని వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్ళింది. ఇంతలో దానికి ఒక కుక్క కనిపించింది అది తోక ఆడిస్తూ ఖాళీగా కూర్చుని ఉంది. దాని దగ్గరికి వెళ్లి' ఏం కుక్క మామ హుషారుగా ఉన్నావే! నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు కదూ' అని అడిగింది కిట్టీ. అప్పుడు కుక్క ''భలేదానివే ఖాళీగా ఉంటే తిండి ఎలా దొరుకుతుంది ఆ ఎదురుగా ఉన్న మాంసం కొట్టు చూసావు కదా అందులో నుంచి ఎప్పుడూ మాంసం ముక్క కింద పడుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను' అంది.
అయినా దాని సందేహం తీరలేదు. ఖాళీగా ఉండే జంతువులని వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్ళింది. ఇంతలో దానికి ఒక కుక్క కనిపించింది అది తోక ఆడిస్తూ ఖాళీగా కూర్చుని ఉంది. దాని దగ్గరికి వెళ్లి' ఏం కుక్క మామ హుషారుగా ఉన్నావే! నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు కదూ' అని అడిగింది కిట్టీ. అప్పుడు కుక్క ''భలేదానివే ఖాళీగా ఉంటే తిండి ఎలా దొరుకుతుంది ఆ ఎదురుగా ఉన్న మాంసం కొట్టు చూసావు కదా అందులో నుంచి ఎప్పుడూ మాంసం ముక్క కింద పడుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను' అంది.
అమ్మ చెప్పింది నిజమేనని అర్థమైపోయింది కిట్టీకి. ఇంటికి వెళ్లి అమ్మకి విషయం చెప్పాలి అనుకుంటూ ఇంటికి వెళుతుండగా దానికి ఒక పాట వినిపించింది. "హాయిగా తింటాము, నవ్వుతూ ఉంటాము అందరం కలిసి-మెలిసి ఆడుకుంటాము" ఆ పాట విన్న కిట్టీకి అది వినిపిస్తున్న చీమలపుట్ట దగ్గరికి వెళ్ళింది. అక్కడ కొన్ని చీమలు ఆడుతూపాడుతూ కనిపించాయి.
'అరె మీరు బలే ఆడుకుంటున్నారు వేరే పని చేయక్కర్లేదు' అని అడిగింది. 'ఎందుకు చేయము అసలు శ్రమ పడటంలో మా తర్వాతే ఎవరైనా' అన్నాయి చీమలు. మరయితే ఇలా ఆడుతూ-పాడుతూ ఉన్నారు అని ప్రశ్నించింది కిట్టీ. ఓ అదా నీ సందేహం అంది. ఓ పెద్ద చీమ ముందుకు వచ్చి నువ్వు మా పాటని మొదటి నుంచి వినలేదు అన్నమాట! పిల్లలు మళ్లీ పాడండి అని తోటి చీమలకి సూచించింది. 'ఓ ఎందుకు పాడం అని చీమలన్నీ తమ పాటని మొదలుపెట్టాయి. "దూరమెంతో వెళతాము, బరువులెన్నో మోస్తాం, ఆహారం కోసం-ఎంతో శ్రమిస్తాము, హాయిగా తింటాము-నవ్వుతూ ఉంటాము, అందరం కలిసి-మెలిసి ఆడుకుంటాము" అది విషయం అన్నది పెద్ద చీమ. కష్టపడేటప్పుడు కష్టపడాలి భవిష్యత్తుకు తగినంతగా దాచుకోవాలి. మిగతా సమయాల్లో చక్కగా నవ్వుతూ ఆడుతూ-పాడుతూ ఉండాలి. ఏం తెలిసిందా! అని అడిగింది కిట్టీని. 'ఓ తెలిసింది అంది' కిట్టీ సంతోషంగా వెంటనే తన ఇంటి వైపు పరుగులు తీసింది.