Monkey and Old Lady Story కోతికి అరటి పండు దొరికితే

TSStudies

Moral Story-కోతికి అరటి పండు దొరికితే 

కోతికి కొబ్బరి చిప్ప ఇస్తేనే దాన్ని పీకి వదిలి పెడుతుంది అలాంటిది పండ్లతోట వాటికి చిక్కితే ఇక చెప్పేదేముంది. చాలా కాలం కిందట ఒక ముసలావిడకి పెద్ద అరటి తోట ఉండేది. కోతుల గుంపు ఒకటి ఆ తోటలో పడి పండ్లలన్నింటిని తినేసేవి. అంత పెద్ద తోటని చూసుకోవడం ముసలావిడకి చాలా కష్టంగా తోచింది. పైగా ఈ కోతులొకటి! అందుకని కోతుల గుంపులోని పెద్ద కోతితో ఒక ఒప్పందానికి వచ్చింది. ఈ తోటని పెంచడానికి నాకు మీ సహాయం కావాలి బదులుగా సగం పండ్లను మీకు ఇస్తాను అంది. 
monkey and old lady story in telugu,balamitra stories in telugu,bala baratam stories in telugu,old lady and monkey stories in telugu,Bala Mitra Stories in Telugu, Balamitra Kathalu,janapada kathalu in telugu,telugu janapada kathalu,
పెద్ద కోతి ఈ ఒప్పందానికి అంగీకరించింది. అయితే పంట చేతికి వచ్చే సరికి మంచి కాయలను తాను ఉంచుకొని పాడైపోయిన చిన్నచిన్న కాయలను ముసలావిడకి ఇచ్చేది. పెద్ద కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది ముసలావిడ. ముసలావిడ ఒక పిల్లవాడి బొమ్మని మైనంతో తయారుచేసి దానికి జిగురు పూసింది. ఆ బొమ్మ తలపై అరటి పండ్ల బుట్టని ఉంచింది. మర్నాడు ఉదయం షికారుకి బయల్దేరిన పెద్ద కోతి కంట్లో ఇది పడింది. అది మైనపు బొమ్మని తెలియక దాని దగ్గరికి వెళ్లి రేయ్ ఈ తోట నాది మర్యాదగా నీ బుట్టలోని అరటి పండ్లు అన్నీ నాకు ఇచ్చేయ్ అని బెదిరించింది. మైనపు బొమ్మలో ఉలుకు పలుకు లేకపోయేసరికి పెద్ద కోతికి పౌరుషం వచ్చింది. 
అడిగేది నిన్నే, నీ పండ్లన్నీ నాకు ఇచ్చేసి పో అని అబ్బాయి బొమ్మ పై చేయి వేసింది. అంతే బొమ్మకి ఉన్న జిగురు వల్ల కోతి చెయ్యి దానికి అంటుకు పోయింది. ఎంత ధైర్యం నన్ను పెట్టుకుంటావా అని కోపంగా కోతి తన రెండో చేతితో బొమ్మని గుద్దింది. దాని రెండో చేయి కూడా ఆ బొమ్మకి అంటుకుపోయింది. అలా కొంచెం కొంచెంగా దాని శరీరం మొత్తం మైనం బొమ్మకి అంటుకుపోయింది, దాంతో లబోదిబోమని అరవటం మొదలు పెట్టింది. పెద్ద కోతి అరుపులకి తోటలో ఉన్న కోతులన్నీ వచ్చాయి. వచ్చి చూసే సరికి ఏముంది పెద్ద కోతి గారు బొమ్మకి అంటుకుపోయి కనిపించారు. కోతులన్నీ కలిసి పెద్ద కోతిని విడిపించడానికి ఎంత ప్రయత్నించినా అది ఊడి రాలేదు. ఇదంతా గమనిస్తున్న ఒక పిల్ల కోతికి మెరుపులాంటి ఉపాయం తట్టింది. మీరంతా ఉత్త అమాయకుల్లా ఉన్నారు . అది మైనపు బొమ్మ కదా! దాన్ని కరిగిస్తే మన నాయకుడు తేలిగ్గా బయటపడతాడు అని ఇలా చెప్పింది.  
మనం ఒక పెద్ద చెట్టుక్కుదాం, అక్కడ ఒకరిపై ఒకరు నిల్చొని సూర్యుడికి వీలైనంత దగ్గరగా నిల్చుని మనలో అందరికంటే పెద్ద గొంతున్న కోతి పైనుండి మైనపు బొమ్మని కరిగించమని సూర్యుడిని బతిమాలుతుంది అంది. పిల్లకోతి సలహా అందరికీ నచ్చింది. మనందరిలోకి పెద్ద గొంతు నీదే నువ్వే మాట్లాడు అని చెప్పి అన్ని ఒక పెద్ద చెట్టు పైకి చేరుకున్నాయి. పిల్లకోతి అందరికంటే పైన నిల్చుని సూర్యుడా! సూర్యుడా! మమ్మల్ని కరుణించి నీ వేడి కిరణాలను ఆ మైనపు బొమ్మ పైకి ప్రసరించు అని బతిమిలాడింది. పోన్లే పాపం అనుకొని సూర్యుడు తన వేడి కిరణాలను ఆ మైనపు బొమ్మ పైకి మళ్ళించాడు. సూర్యుని వేడికి మైనపు బొమ్మ కాస్త కరిగింది. పెద్ద కోతి దాని పట్టు నుంచి బయటపడింది. గండం గట్టెక్కడంతో కోతుల సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోయింది.
monkey and old lady story in telugu,balamitra stories in telugu,bala baratam stories in telugu,old lady and monkey stories in telugu,Bala Mitra Stories in Telugu, Balamitra Kathalu,janapada kathalu in telugu,telugu janapada kathalu,
ముసలావిడపై పగ తీర్చుకోవడం కోసం తోట మొత్తం చిందరవందర చేసేశాయి. ఇదంతా చూసిన ముసలావిడకి చాలా బాధ కలిగింది. ఈ కోతులతో వేగటం తనవల్ల కాదు అనుకొని వేరే చోటికి వెళ్ళి పోయింది. అప్పటి నుంచి ఎక్కడ అరటి తోట కనిపించిన కోతులు దాన్ని వదిలిపెట్టవు అన్నమాట.