Baba Story in Telugu-దక్షిణ
బాబాభక్తులకు నద్చోవన బోదిస్తుండగా భక్తుల మద్య కలకలం ఏర్పడడంతోబాబా అటు వైపు చూసాడు. ఎవరో ధనవంతురాలులా వుంది. ఖరీదైన కారులో నుండి దిగి బాబావద్దకు వస్తుంది. ఆమె వెనుక ఇద్దరునౌకర్లు రెండు బిందలు మోసుకుని వస్తున్నారు.
ఆమె వస్తాధారణ, నగలు చూసి భక్తులు భయంతో ప్రక్కకి తొలగడంతో, ఆమె తిన్నగా బాబా వద్దకు వచ్చి నమస్కారం చేసి, “బాబా! నేను ఈ నగరంలో గొప్ప, పారిశ్రామిక వేత్తను. మీ బోదనలు నాకుబాగా నచ్చింది. అందువలన మీకు మంచి కానుక ఇవ్వాలనుకునివచ్చాను. అదీ ఇంతవరకు మీరుకని విని ఎరుగని విధంగా, ఏ భక్తుడు ఇవ్వనంత దక్షిణ తెచ్చాను. దయచేని స్వీకరించండి” అంటూ నౌకర్లని పిలిచింది.
వెంటనేభక్తులు తాము మోసుకొన్తున్న బిందెలు క్రిందికి దించి, దానిపై మూతలను తీసారు. ఆ బిందెల నిండాబంగారునాణాలు వుంది.
వెంటనే బాబా అతని వంకచూసి, “అదా బంగారం? లేక ఇదా” అంటూతనపై బట్ట తీసి గుండెల్ని చూపాడు. అపుడు బాబా దేహం బంగారంకన్నా మిన్నగావేయి రెట్లకాంతిలో మెరుస్తుంది.
మరుక్షణం ఆ భక్తులు, “క్షమించండిబాబా! మీ హృదయమే మేలిమిబంగారం. నా అజ్ఞానానికి మన్నించండి” అంటూ బాబా కాళ్ళ మీధపడ్డాడు.
ఆ తరువాత బాబాఆ యువతి వైపు చూసి, “ఇలా రామ్మా” అన్నారు. బాబా ఆమె చేతిలో మూడు తమలపాకులు, కాస్తా బిబూధి, రెండు రూపాయలు పెట్టి, “అమ్మా! నువ్వు మాకు ఏం బాకీలేవు. నువ్వు తెచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళు” అన్నారు.
ఆమె ఏమీ మాట్లాడలేకవింత కాంతిలో మెరుస్తున్న బాబాకి నమస్కరించి, తెల్లబోయిన వదనంతో బాబాకు నమస్కరించి తాను తెచ్చిన కానుకలతోవెళ్ళిపోయింది.
కాని బాబా ముందుకూర్చున్న భక్తులకు మాత్రం బాబా ఆ బంగారంఎందుకు తీసుకోలేదో తెలుసుకోవాలని. “బాబా! మీకు నిజంగాధనం అక్కరలేదా. నేను మీ వద్దకువస్తున్న కొందరి భక్తుల వద్ద మీరు కావాలనిఅడిగి మరీ రెండు రూపాయలు, ఒక రూపాయి తీసుకుని సాయంత్రం అందరికీ పంచి పెడతారు కదా. మీకు ఏ శ్రమ లేకుండాఇంత విలువైన కానుక మీ వద్దకువచ్చినపుడు, దాన్ని తీనుకుని మిగతావారికి పంచవచ్చు కదా” అన్నాడు.
బాబానవ్వి, “నేను ఏదీ ఉచితంగాతీసుకోను. పూర్వ జన్మలలోనూ లేకఈ జన్మలోనూ దేవతలకు ఆపదలో మొక్కలు పెట్టి, ఆపద తీరగానే. మరిచిన వారి నుండి ధక్షిణతీసుకుని దేవతలకు అర్చించి, వారి దోషాన్ని పోగొడుతున్నాను. అలాగే శని దోషాలు కలవారినుండి దక్షిణ తీసుకుని, ఆ సొమ్ముతో నూనెకొని, దీపారాధన చేసి, వారి దోషాలుపోగొడుతున్నాను. ఇపుడు వచ్చిన ధనికురాలకుఏ విధమైన మొక్కలు లేవు.
ఇంతకు జన్మలోఎవ్వరికి బాకీ లేదు. అందువలనఆమె వద్ద ఏమీ తీసుకోక, ఆమె సద్భుద్దికి మెచ్చి. నేను కానుకగా. రెండు రూపాయలు ఇచ్చాను. మీరు జాగ్రత్తగా వుండండి. ఏదైనా మొక్కలు వుంటేవెంటనే చెల్లించండి”అన్నారు. అపుడు అందరికి బాబాదక్షిణలోని ఆంతర్యం అర్ధమైంది.