Moral Story-బంద్
రాజు! ఈ రోజు మన వూరిలోబంద్ చేయమని నాయకుడు చెప్పాడు” అని శ్రీనివాస్ చెప్పడంతో, రాజు, “బంద్ ఎందుకు చేయమన్నారు” అని అడిగాడు.
“ఆ సంగతి మనకెందుకు. సాయంత్రానికి మన నాయకుడు మనకిడబ్బు ఇస్తాడు” అని చెప్పి రాజుకొందిరి మిత్రులతో బయట తిరుగుతూ తెరిచివున్న దుకాణాలను బలవంత౦గా మూయించసాగాడు. ఆ సమయంలో ఒకవ్యక్తి స్కూటర్పై అటూ రాసాగాడు. అది గమనించిన రాజు స్నేహితులతో కలసి, ఆ వ్యక్తిని ఆపి, “ఈ రోజుబంద్ వెనక్కి తిరిగి వెళ్ళండి” అన్నాడు.
ఆ వ్యక్తి తానుఅవసరంగా వెళ్ళాలని వారిని ఎంతోబ్రతిమాలినా, వాళ్ళు వినలేదు. రాజు కోపంతో ఆస్కూటర్ టైర్లకున్న గాలిని తీసి, “మంచిగా చెబితో విననంటున్నావ్. ఇవుడు స్మూటర్నితోసుకుంటూ ఇంటికి వెళ్ళు” అనడంతో, ఆ వ్యక్తి బాదతోవెళ్ళాడు.
మధ్యాహ్నమైంది. అందరు భోజనాలకని ఇళ్ళకువెళ్ళుచున్నారు. రాజు తాను గొప్పపని చేసినవాడిలా సంతోషంగా గెంతుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట కంగారుగావున్న చెల్లి, “అన్నయ్యా! అమ్మకి జ్వరం ఎక్కువగా వుంది. హాస్పిటల్కు వెళ్ళాలంటే బంద్ వలన ఏ వాహనం లేదు. నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఆలస్యమైతేకష్టం” అనడంతో, రాజా అలాగే వెనక్కితిరిగి పరిగెత్తాడు.
రాజూ వూరంతా తిరిగాడు. డాక్టర్లు వున్నారు, కాని బంద్ వలనబయటకి రావడానికి భయపడ్డారు. ఆఖరికి చిన్న ఇంటి ముందుడాక్టర్ ప్రకాష్ అన్న బోర్డు కనిపించడంతో, ఆయన తప్పకతన ఇంటికి వస్తాడన్న ఆశతో ఆ ఇంటితలుపులు తట్టాడు. ఒక ముసలాడు తలుపుతెరిచి, రాజా ద్వారా సంగతితెలుసుకుని, “భయపడకు, మా వాడు చాలామంచివాడు. అర్ధరాత్రి అయిన రోగి ఇంటికివెళతాడు. వుండు పిలుస్తాను” అంటూలోపలికి వెళ్ళాడు.
లోపల నుండి డాక్టర్ బయటికి వచ్చారు. ఆయన్ని చూడడంతో రాజు నిర్జాంతపోయాడు. ఆయనఎవరో కాదు ఉదయం స్కూటర్ మీద వస్తుంటే, తాను అడ్డుపడి టైరుగాలి పీకి పంపిన వ్యక్తి. “ఆయన ఎందుకు తనకి సహాయం చేస్తాడు” అని బాదపడతూ రాజు వెనుతిరిగాడు. అంతలో డాక్టర్, రాజుని పిలిచి విషయం అడగడంతో రాజుఏడుస్తూ ఆయన కాళ్లపైపడి తల్లిసంగతి చెప్పాడు.
వెంటనే డాక్టర్ తన మందుల పెట్టెతీసుకుని కాలి నడక మీదరాజు ఇంటికి వచ్చి, అతని తల్లిని పరీక్షించి, తగిన మందులు ఇచ్చాడు. కొంతసేపటికి ఆమెకు జ్వరం తగ్గింది.
రాజు, డాక్టర్ చేతులు పట్టుకుని, “నన్ను క్షమించండి. ఉదయంమిమ్మల్ని అంత అల్లరి చేసినామనసులో పెట్టుకోకుండా మా అమ్మకు వైద్యంచేసారు. నిజంగా మీరు దేవుడు” అన్నాడు.
డాక్టర్ అతని భుజంపై తట్టుతూ, “బంద్ అన్నది ఎందుకు చేయాలి. ఆ నాయకులు వారిస్వార్థం కొరకు మీలాంటి వారితోఇలా చేపిస్తుంటారు. కాని దాని వలనఎందరు నష్టపోతారో అన్నది ఎవ్వరు ఆలోచించరు, ఈ రోజు నీకువచ్చిన కష్టం ఇంకా ఎందరికివచ్చిందో, మరి వారి పరిస్థితిఆలోచించావా. ఇకపై ఎవరి మాటలువిని ఇలా బంద్లుచేయకు. చక్కగా చదువుకో. నలుగురికి ఉపయోగవడు. నువ్వే కాదు నీ స్నేహితులుమారాలి. అపుడు మన దేశంబాగా అభివృద్ధి చెందుతుంది” అని వెళ్ళిపోయాడు.