జీవనాదారం
వెంకటాపురంలోరామశాస్త్రి మంచి పేరుగల పౌరోహిత్యపుబ్రాహ్మణుడు. ఆ వూరే కాదు. చుట్టు ప్రక్కల వున్న అన్ని గ్రామాలకుకూడా ఆయనొక్కరే పురోహితుడు.
గృహ ప్రవేశం, పెళ్ళి, వ్రతాలు లాంటివాటికి, ముహూర్తాలు పెట్టించుకోడానికి, ఎవరు వచ్చిన రామశాస్త్రివారి బలహీనతను కనిపెట్టి వారి చేత దానాలుశాంతిపూజలు లాంటివి చెప్పి, అన్నీ చేయించి భారీగాసంభావనలు పుచ్చుకునేవారు.
ఒక రోజున రామశాస్త్రిఏదో పనిమీద బజారు వైపు వెళుతూచంద్రన్న ఇంటి ముందు కట్టివున్నతెల్లని పాడి ఆవును చూసాడు. ఆ ఆవు పుష్టిగా వుంది. బాగా పాలు ఇచ్చేలా వుంది. రామశాస్త్రి కన్ను ఆవు మీదపడింది. సరిగ్గా ఆ సమయంలో ఇంట్లోనుండి చంద్రన్న బయటికి వచ్చి, 'దండాలు బాబయ్యా" అని పలకరించాడు. “ఏమోయ్! చంద్రన్నా ఎలా వున్నావు. ఇంట్లోఅందరూ బాగున్నారు కదా!” అంటూ శాస్త్రిఆప్యాయంగా పలకరించాడు.
“ఏదో తమరి దయవలనబాగానే వున్నాం. కానీ...” అంటూ ఆపాడు చంద్రన్న,
“ఏమైందీ చంద్రన్న! ఏదైనా వుంటే అడుగు. నీకు నా చేతనైన సహాయంచేస్తాను” అంటూ శాస్తి ఆవునుచూడసాగాడు.
“మరేం లేదండీ. ఈమద్య మా ఇంటి దానికిఏదో పీడకలలు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. రోజు మా ఆవిడ మిమ్మల్నికలిసి, ఇది చెప్పమంటుంది. మిమ్మల్నికలవాలని బయటికి వచ్చాను. ఎదురుగా మీరు వున్నారు” అన్నాడుచంద్రన్న.
“అన్నిటికి పరిష్కార మార్గాలు వున్నాయి. ఇంతకీ ఎలాంటి కలలువస్తున్నాయి?” అడిగాడు శాస్త్రిగారు.
“ఓ రోజుతను తను నూతిలోపడి చచ్చిపోయినట్లు, ఇంకో రోజు దయ్యాలతోతిరుగుతున్నట్లు, ఒకసారి బంగారం, డబ్బు మోసుకొస్తున్నట్లు కలలువచ్చాయి. కలలో బంగారం డబ్బుకనిపిస్తే అమ్మవారికి బలి ఇవ్వాలని ఓపెద్ద మనిషి చెప్పాడు. మీరుదీనికి మంచి మార్గం చెప్పండి. మీరు ఏం చెబితే అదిచేస్తాను” అన్నాడు చంద్రన్న.
“నువ్వన్నది నిజం. బంగారం కలలోవస్తే ఇంట్లో ఎవరికో ఆయువు మూడిందని అర్ధం” అని శాస్త్రి అతని భయాన్ని ఎక్కువచేసాడు.
“మీరు ఏదో పూజలుచేసి మమ్మల్ని కాపాడు తారని మీ, వద్దకువస్తే మీరు అదే చెబుతున్నారు. మాకు దారి చూపండి” అన్నాడు.
“నువ్వన్నట్లు ఇంకా చాలా పరిష్కారాలువున్నాయి. మీ ఇద్దరి ప్రాణాలుకాపాడుకోవాలంటే, భూదానం, సువర్ణ దానం, గోదానం ఇలాఏదైనా ఒకటి చేయవచ్చు. ఒక్కొక్కపీడకలకి ఒక్కోదానం చేస్తారు. నువ్వ పేదవాడివి భూదానంచేయలేవు. సువర్ణదానం చేయాలన్నా ఎక్కువ డబ్బు కావాలి. నీవద్ద లేదు. పోనీ గోదానంచేస్తావా” అన్నాడు .
“గోదానం అంటే మా ఆవునుఎవరికైనా దానం చేయాలి కదా!” అనుమానంగా అడిగాడు.
“అవును నువ్వు నీభార్య ఆరోగ్యంగా వుండాలంటే నీ ఆవును దానంగాఇస్తే మీ కష్టాలు అన్నీపోయి నువ్వ సంతోషంగా వుండగలుగుతావు”అన్నాడు శాస్త్రి,
“అది చాలా కష్టం. ఆవు మా జీవనాధారం. నాకుదున్నుకోడానికి పొలాలు లేవు. ఆవుపాలు అమ్మిమా ఇద్దరి కడుపులు నింపుకుంటున్నాము. ఇపుడు ఆవును దానంఇస్తే మేము ఎలా బ్రతకాలి” అన్నాడు చంద్రన్న.
“అవును దానం చేయాలంటేబోలెడంత తతంగం. వుంది. నాకు ఆవును దానంగాఇస్తే పూజలకు నీ వద్ద ఒక్కరూపాయి తీసుకోను. అన్ని ఖర్చులు నేనేభరిస్తాను. వేరే వారైతే కొన్నివేల రూపాయలు ఖర్చు అవుతుంది”అన్నాడుశాస్త్రి.
చంద్రన్న ఆలోచిస్తుండగా లోపల నుండి అతనిభార్య వచ్చి, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు. పంతులు గారు చెప్పినట్లు గోదానంచేస్తాం. మన ఆరోగ్యంముఖ్యం” అనగానే చంద్రన్న సమ్మతించాడు.
వారం తిరక్కుండానే గోదానంపేరుతో చంద్రన్న ఆవు శాస్త్రి ఇల్లుచేరింది. ఆ నెలంతా శాస్త్రిగారికిపెళ్ళిళ్ళు హడావిడి. వూపిరి సలపలేదు. అందరివద్దా డబ్బు, బంగారం శాస్త్రి బాగా సంపాదించాడు.
ఆరోజు రాత్రి తాను సంపాదించిన బంగారం, డబ్బు అంతా లెక్కపెట్టి, పెద్దగోనె సంచిలో మూట కడుతుండగా ఎవరోతలుపు కొడుతున్న శబ్దం విని, తలుపులుతెరిచాడు. బయట నుండి నలుగురుదొంగలు కత్తులతో లోపలికి వచ్చి, “మీ వద్ద వున్న డబ్బు అంతా ఇవ్వండి” అని అరిచారు.
“అయ్యో! నేను పేద బ్రాహ్మణుడిని నావద్ద ఏం దబ్బు వుంటుంది. మీరు వేరే ఇల్లు చూసుకోండి” అన్నాడు శాస్త్రి.
"అయితే ఆ మూటలో ఏముంది?" అంటూ ఒకడు మూట వద్దకువెళుతుండగా శాస్త్రి అడ్డుపడి “ఇది బియ్యంమూటమీకు డబ్బు కావాలంటే ఇస్తాను” అంటూ తన బొడ్లో దోపివున్న వెయ్యి రూపాయలు ఇచ్చాడు.
అంతలో మరొకడు, “మనంకష్టపడి వచ్చింది ఈ వెయ్యి రూపాయలకొరకా. ఆ బియ్యం మూట తీసుకు వెళితే నెల రోజులు మన కడుపులు నిండుతాయి” అంటూ మూటను పట్టుకున్నాడు. శాస్త్రి భయంతో అడ్డుపడడంతో, మూటజారి క్రిందపడి లోపల వున్న బంగారం, డబ్బు బయటపడింది. శాస్త్రిని బాగా తన్ని ఆమూటను తీసుకుని పారిపోయారు.
ఆ తరువాత శాస్త్రిఏడుస్తూ, “నేను గ్రామ ప్రజలనుఅంతా మోసం చేసి సంపాదించినది. దొంగలు సులభంగా దోచుకున్నారు. నాకు దేవుడు తగినబుద్ది చెప్పాడు” అని పశ్చాత్తాపం పడ్డాడు.
శాస్త్రి ఇంట బంగారం డబ్బుమూటతో పరిగెత్తుకుపోతున్న దొంగలు చంద్రన్న ఇంటి ముందు వెళుతుంఢగా, వారి మూటలో వున్న యాబైవేల రూపాయల కట్ట ఎగిరి, ఆవుపోయిందన్న దిగులుతో కూర్చున్న చంద్రనపై పడింది. ఉలిక్కిపడిన చంద్రన్న నోట్ల కట్ట చూసిఆనందంతో ఆవు ద్వారా తనఇంటీపీడని లాక్కుని, తన జీవనాధారం కొరకుఈ డబ్బు దేవుడు ఇచ్చాడని సంతోషపడ్డాడు.