Bethala Kathalu-అనంతుడి ఆంతర్యం

TSStudies

అనంతుడి ఆంతర్యం

Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
పట్టువదలనివిక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు  పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకునిఎప్పటిలాగానే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోనిబేతాళుడురాజా! నువ్వు ఎవరిమేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైనకార్యానికి పూనుకున్నావో నాకు బోధపడడం లేదు. కొందరు వ్యక్తులు మొదట మేలు తలపెట్టినాచివరికి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. నువ్వు అటువంటివాడివేమో ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలుగా నీకు అనంతుడి కథచెబుతాను శ్రమ తెలియకుండా విను, అంటూఇలా చెప్పసాగాడు
వింధ్యవర్దని రాజ్యానికి రాజు అశోకవర్దనుడు. అతనిరాజ్యానికి దక్షిణ దిశగా నైమిశారణ్యం ఉండేది. అందులో సిద్ధయోగి అనే మునీశ్వరుడు గురుకులం నడిపేవాడు. సిద్దయోగికితెలియని ధర్మశాస్త్రాలు గాని, వీరవిద్యలు గాని లేవు. అందుకే ఎందరో రాజులుతమ బిడ్డలను సిద్దయోగి వద్ద శిష్యులుగా చేర్పించడానికిఇష్టపడేవారు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
అశోకవర్హనుడుకూడా తన కుమారుడైన హర్షవర్దనుడిని, సిద్ధ్దయోగి సమక్షానికి తీసుకుపోయి 'మునీశ్వరా! నా కుమారుడిని శిష్యుడిగాస్వీకరించి భావి మహారాజుగా తీర్చిదిద్దండి, అని కోరాడు. సిద్ద యోగి అందుకుసమ్మతించాడు
అదే సమయానికి పురుషోత్తముడుఅనే రైతు తన కుమారుడైనఅనంతుడిని, సిద్దయోగి వద్దకు తెచ్చి 'మహానుభావా! నా కుమారుడికి వేదవిద్యల పట్ల, వీరవిద్యలపట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే తమ వద్దకు తీసుకువచ్చాను. శిష్యుడిగా స్వీకరించి మంచి భవిష్యత్తును ప్రసాదించండి,' అని కోరాడు. సిద్దయోగి, అనంతుడిని కూడా శిష్యుడిగా స్వీకరించాడు
హర్టవర్దనుడు, అనంతుడు గురువు చెప్పే విద్య పట్ల అమితమైన శ్రద్ద చూపేవారు. సిద్దయోగి వారిరువురూ సమ ఉజ్జీలని గ్రహించాడు. అయితే హర్షవర్దనుడు ప్రతిసారీ అనంతుడిని మించి ప్రతిభ కనబరచాలనిఆరాట పడేవాడు.

అనంతుడు మాత్రం హర్షవర్దనుడుని రాజకుమారుడిగా గౌరవించేవారు. అభిమానంచూపేవాడే గానీ అసూయ, పడేవాడుకాదు. పోవాలని తాపత్రయ పడేవాడు కాదు
ఒక రోజుయాగానికి అవసరమైన సమిధలు ఎరడానికి విద్యార్దులందరూ కలసి అరణ్యంలోకి వెళ్ళారు. అప్పుడు ఒక భల్లూకం వారిమీద దాడి చేసింది. విద్యార్దులు భల్లూకాన్ని చూసి పారిపోయారు. హర్షవర్ధనుడుధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. కాని దాని బలంముందు నిలువలేకపోయాడు. అంతలో అనంతుడు, హర్షవర్ధనుడినిప్రక్కకు నెట్టి, భల్లూకంతో కలబడ్డాడు. భల్లూకంతో పోరులో తీవ్ర గాయాలైనా అనంతుడువెరవ లేదు. 
శిష్యుల ద్వారాభల్లూకం విషయ౦ తెలుసుకున్న సిద్దయోగిఅక్కడకు వచ్చి భల్లూకం మీద మంత్రజలం జల్లాడు. అంతటితో భల్లూకం స్పృహ తప్పి పడిపోయింది.
సిద్ధయోగి, తీవ్ర గాయాలైన అనంతుడినిఆశ్రమానికి తీసుకుపోయి మూలికా వైద్యంచేసాడు. అనంతుడు వారం రోజులకు గానీ కోలుకోలేక పోయాడు.
ఒక రోజు హర్దవర్దనుడు దూరంగాఉన్న సమయానసిద్దయోగి "అనంతా! హర్షవర్ధనుడిని ప్రాణాలకు తెగించి కాపాడావునీకుప్రాణంమీద తీపి లేదా?' అనిఅడిగాడు.
అందుకుఅనంతుడు 'గురువర్యాహర్టవర్ధనుడుభావి మహారాజు. ఒక సామాన్యుడినైననాప్రాణం కంటే అతడి ప్రాణం విలువైనది. అందుకే అలా చేసాను' అని చెప్పాడు.
సిద్దయోగి, అనంతుడి వంక ప్రశంసాపూర్వకంగాచూసాడు
హర్షవర్ధనుడు, అనంతుడు వీరవిద్య లన్నింటిలోసమంగా ఉన్నా విలువిద్యలో మాత్రంఅనంతుడిది పై చేయిగా ఉండేది విషయంలో హర్షవర్దనుడికి తీవ్రమైన అసంతృప్తిఉండేది. అందుకే అనంతుడ్ని మించిప్రతిభ కనబరచడానికి తీవ్రమైన కృషిచేసేవాడు
ఒక పర్యాయం సిద్దయోగి విద్యార్డులను రెండు జట్టులుగా విడగొట్టివిలు విద్యపోటీ పెట్టాడు. చివరిగా హర్షవర్ధనుడు, అనంతుల మధ్య పోటీ జరిగింది
సిద్దయోగిఒక పూలదండను చెట్టు కొమ్మకుతగిలించి బాణంతో పూలదండనుకాసింత దూరంలో ఉన్న దేవతా విగ్రహంమెడలో పడేలా చేయమని పరీక్ష పెట్టాడు. అంతేకాదు... పూలదండలోని ఒక పువ్వు కూడా నేలరాలరాదని షరతు పెట్టాడు. క్లిష్టమైన పరీక్షలో ఎవరు నెగ్గుతారోననిశిష్యులందరూ ఆసక్తి కనబరిచారు
తొలుతహర్షవర్హనుడు వేసిన బాణం సూటిగాపోయి పూలదండను తాకిందిమరుక్షణంపూలదండ వెళ్ళి దేవతా విగ్రహంమెడలో పడింది. ఒక్క పూవు కూడానేల రాలలేదు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
తరువాతఅనంతుడు వేసిన బాణం పూలదండనుసరిగ్గా దేవతా విగ్రహం మెడలోపడేసింది గాని.. కొన్ని పూలు నేలరాలాయి. సిద్ధయోగి హర్షవర్దనుడిని విజేతగా ప్రకటించాడు
రాత్రి ఎద్యార్ధులందరూ నిద్రించాక సిద్దయోగిఅనంతుడితో "అనంతా! నీవు పోటీలోకావాలనే ఓడిపోయావని నేను గ్రహించాను. ఎందుకలా చేసావు?” అని ప్రశ్నించాడు.
అందుకుఅనంతుడుగురుదేవాహర్షవర్దనుడువిలు విద్యలో నా కంటే తక్కువగాభావించి ఆత్మన్యూనతా భావం పెంచుకుంటున్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసంనింపడానికే నేను కావాలని ఓడిపోయాను,” అని చెప్పాడు. సిద్దయోగి అనంతుడివంకమెచ్చుకోలుగా చూసాడు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
విలువిద్యపోటీలో తను గెలుపొందాక హర్షవర్ధనుడు, అనంతుడిని చిన్నచూపు చూడసాగాడు. తోటి విద్యార్ధుల దగ్గర తనంతటిగొప్పవాడు లేడని, అనంతుడిలాంటిపదిమందిని ఎక కాలంలో ఓడించగలననిగొప్పలు చెప్పుకోసాగాడు
అందుకుఅనంతుడు బాధ పడేవాడు కాదుగాని, నిజం తెలిసిన సిద్ధయోగి మాత్రంబాధపడేవాడు.
ఒక పర్యాయం సిద్దయోగి, అనంతుడినిచేరబిలిచి, “నాయనా! నా దగ్గరున్న శిష్యులందరిలోనీవు ఉత్తముడివి. నాకు ప్రియతముడివి. గురువు ఎప్పుడూ మరెవరికీనేర్చని కొన్ని మెళకువలను తన ప్రియతమ శిష్యుడికి, నేర్చ్పుతాడు. అందుకే ఖడ్గ చాలనంలోనికొన్ని రహస్య మెళకువలు నీకునేర్పుతాను' అన్నాడుఅందుకుఅనంతుడుగురుదేవామీరునాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుడిని. అయితే నా అభ్యర్థన ఏమంటే  మెళకువలు హర్షవర్ధనుడికి నేర్పండిఎందుకంటేనాకంటే అతడికి శతృభయం ఎక్కువ. ఖడ్గచాలనంలోని మెళకువలు అతడికిమరింత ఉపయోగపడగలవుఅని కోరాడు
అప్పుడుసిద్దయోగిఅనంతా! నీవంటి స్నేహితుడినిపొందిన రాజకుమారుడు అదృష్టవంతుడు, అన్నాడు
కొద్దిసంవత్సరాలకు వారి విద్యాభ్యాసం ముగిసింది.
చివరిసారిగావిద్యార్దుల మధ్య సిద్ధయోగిపోటీలు పెట్టదలిచాడు పోటీలకు హాజరుకమ్మని మహా రాజుతోపాటు అందరి తల్లిదండ్రులకు వర్తమానంపంవాడు.
మహరాజుతోపాటు అందరూ ఎంతో ఆసక్తితో పోటీలకు హాజరు అయ్యారు.
అన్నిపోటీల్లో హర్షవర్దనుడు, అనంతుడుప్రధములుగా నిలిచారు. చివరిగా సిద్దయోగివారిరువురి మధ్య కత్తియుద్ధం పోటీపెట్టాడు.
వారిరువురుపోటాపోటీగా చాలాసేపు కత్తియుద్దం చేసారు. వారి చేతుల్లోని ఖడ్గాలు మెరుపు వేగంతో కదలాడాయికొంతసేపటికిఅనంతుడు ఒక అసాధారణ ప్రక్రియతోహర్షవర్ధనుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టాడు. సిద్దయోగి అనంతుడ్ని విజేతగాప్రకటించాడు.
అనంతుడుతన తండ్రితో కలసి గ్రామానికిబయలుదేరే సమయాన సిద్దయోగి అనంతుడినిచేరబిలిచినాయనా! నీవు వీరుడివేకాదు. వివేకవంతుడివి కూడాఅంతకుమించి నిజమైన స్నేహితుడివిఆని అభినందించాడు.
అనంతుడుగురువు పాదాలకు భక్తితో నమస్కరించిబయలుదేరిపోయాడు.
అంతవరకూకథ చెప్పిన బేతాళుడు రాజా! ఒకపర్యాయం అనంతుడు ప్రాణాలకు తెగించి భల్టూకం బారినుంచి రాజకుమారుడినికాపాడాడు. మరో సందర్భంలోరాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికికావాలని విలువిద్య పోటీలో ఓడిపోయాడు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
అటువంటిఅనంతుడు విద్యాభాసం ముగిసినసమయంలో అందరిముందు హర్షవర్ధుణ్ణి చిత్తుగా ఓడించాడు
అతడుఎందుకలా ప్రవర్తించాడుఅందరిముందుతన గొప్పతనం ప్రదర్శించడానికా? లేక ఓడిపోయి తన తండ్రి మనసునొప్పించడం ఇష్టం లేకనా?
అలా కాని పక్ష్తాన మహారాజు ముందు తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే తనకు మంచి పదవిదొరకగలదన్న ఆశతోనా? అలాగే సిద్ధయోగి, అనంతుడిని వివేకవంతుడనినిజమైనస్నేహితుడని అభినందించడం ఈ సందర్భంగాఎంతవరకు సమంజసంఅని ప్రశ్నించాడు.
అప్పుడువిక్రమార్కుడు 'బేతాళా! అనంతుడు, రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికిచేసిన ప్రయత్నం అతడిలో అహంకారాన్ని నింపింది
అందుకేరాజకుమారుడు, గతంలో అనంతుడుతన ప్రాణం కాపాడిన వైనం కూడామరచి అతన్ని పదేపదే చిన్నచూపు చూసాడు. తోటి విద్యార్దుల దగ్గర తూల నాడాడు. కాబోయే రాజుకు అసలు ఉండ కూడనిదిఅహంకారం. రాజు అహంకారం అతనికేకాదు... రాజ్యానికి కూడా చేటు తెస్తుంది.
అది గ్రహించబట్టె అనంతుడు, హర్ష వర్ధనుడిలోనితనను మించిన వాడు లేడన్న అహంకారంపారద్రోలడానికి, అతన్ని ఓడించాడు. అంతేగాని.. తండ్రిని సంతోష పెట్టడానికిగాని... రాజు మెప్పు పొంది పదవిసంపాదించడానికి గాని ఎంతమాత్రంకాదు.
నిజమైనస్నేహితుడు, తన మిత్రుడి ఉన్నతికోరుకుంటాడే గాని.. పతనాన్నికాదు. విషయం అవగతం చేసుకోబట్టేసిద్దయోగి, అనంతుడిని వివేకవంతుడని... నిజమైన స్నేహితుడని ప్రశంసించాడు, అని చెప్పాడు.
రాజుకి విధంగా మౌనభంగం కలగగానేబేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీచెట్టెక్కాడు. - కల్పితం