Balamitra Stories in Telugu-అల్లుడి అదృష్టం

TSStudies

అల్లుడి అదృష్టం

భద్రయ్యకూతురు సీత పెళ్ళి కుదిరింది. ఊళ్ళోనేవున్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్ళి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తనువుంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు.
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ఇంటి పక్కనే వున్నశాంతయ్య తనకి కలిసి వస్తుందనికొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బుబయానాగా ఇచ్చాడు.
కాని భద్రయ్యంటే పడనిగోపయ్య ఇంటికి వాస్తుసరిగ్గా లేదనీ, కొంటే అరిష్టమనీ భయపెట్టాడు. శాంతయ్య భయపడి తను ఇల్లు కొనలేనని బయానాగా ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు.
భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్ళి వాయిదా వెయ్యమని కోరాడు. ఇల్లు అమ్ముడైతే తప్పకట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు.
అప్పుడు వరుడు శివయ్య ముందుకువచ్చి, “నాన్నా! కట్నం బదులు ఇల్లు నేను తీసుకుంటాను. పెళ్ళయినతర్వాత అన్నయ్య మీ దగ్గర వుంటాడు. నేను ఇంట్లో కాపురంవుంటానుఅన్నాడు.
ఇల్లు చాలాపాతబడింది గదా?” అని సందేహంవెలిబుచ్చాడు ధర్మయ్య,
ఇల్లు వున్నస్థలం మంచి కూడలిలో గ్రామంమధ్యలో వుంది నాన్నా! నేనుదాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను. వ్యాపారానికి అనుకూలంగా వుంటుందిఅని తండ్రికి నచ్చజెప్పాడుశివయ్య.
ధర్మయ్య కొడుకుఅభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్ళియిన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో వున్నకొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు.
తర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు.. కొత్త ఇల్లు, దుకాణంకట్టించడానికి. పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. దొన్నిండా బంగారు కాసులున్నాయి.
శివయ్య పట్నం వెళ్ళి మామగారినికలుసుకుని ఇంటి పునాదుల్లో లంకెబిందె దొరికిందనే సంగతి చెప్పాడు.
మావయ్యా! లంకెబిందె మీ పూర్వీకులదై వుంటుంది. అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండిఅన్నాడు శివయ్య,
భద్రయ్య నవ్విఅదంతా నీ అదృష్టంఅల్లూడూ, అదే నేనా ఇల్లుశాంతయ్యకు అమ్మివుంటే లంకె బిందె బైట. పడినా, నాకు చెప్పేవాడా? తిరిగిఇచ్చేవాదా? ఇల్లు కొనడానికి బయానాగా డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే, మా పెద్దల ఆస్తి బైటకు పోకుండావుండటానికే అనుకుంటాను.
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ఇదంతా దేవునిదయ. నీ అదృష్టము కాబట్టి బంగారం నీదేఅని లంకెబిందెతీసుకోవడానికి తిరస్క రించాడు. శివయ్య సంతోషించాడు.