Panchatantra Stories-పంచతంత్ర కథలు

TSStudies

పంచతంత్ర కథలు

Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,
అనగనగా రాజు, రాజుపేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే ... నలుగురు కొడుకులున్నారతనికి. కొడుకులికి ఆటలంటేఇష్టం. పాటలంటే ఇష్టం. చదువంటేనే ఇష్టం లేదు. బాగాచదువుకుని, శాస్త్రాలని ఒంటబట్టించుకుంటేనే కదా, గొప్పవారూ, రేపటిరాజులవుతారు. కాని చదువంటేనే ఇష్టంలేదు వాళ్ళకి. అలా అని శుద్ధమొద్దులా అంటే కాదు, బుద్ధిమంతులేరాజుగారు బాధలోనే కొలువుతీరారు
పండితులతోనూ, విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. సందర్భంలో పండితుడు ఇలా అన్నాడు. “మనిషిడబ్బుతోనూ, అధికారంతోనూ, యవ్వనంతోనూ, అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో నాలుగింట దేనితోనయినా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి నాలుగూఉన్న వాడూ ఇట్టె చెడిపోతాడు. అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటేతెలివితేటలూ. వివేకజ్ఞానం అలవడి, చెడిపోకుండా ఉంటాడు
మనిషికి విద్య కన్నులాంటిది. కన్ను లేకపోతే కష్టం. బతుకంతా చీకటేపండితుని మాటలతో రాజు బాధ రెట్టింపయిందికొలువు చాలిస్తున్నామని చెప్పి, చరచరా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు, కొలువుని ఇలా మధ్యలో ముగించినసందర్భాలు లేవు.ఉత్సాహంగా కొలువుతీరే రాజు, ఇటీవల నిరుత్సాహంగాకొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగాకనిపించడం పండితుల్నీ, విద్వాంసుల్నే కాదు, మంత్రి రాజదత్తుణ్ణికూడా కలచి వేసింది.
పిల్లలఅరుపులూ కేకలూ వినవస్తోంటే అంతఃపురంకిటికీలో నుండి కిందకి చూశాడురాజు. ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులూఅల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చాయతనికి. ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కాని, వీళ్ళేం పిల్లలు? వీళ్ళ వల్ల తల్లిదండ్రుకు పేరుప్రఖ్యాతులు రావు సరికదా, దుఃఖంముంచుకొస్తుంది. తళుకు బెళుకు రాళ్ళుతట్టెడు ఉండడం కన్నా, ఒక్కరత్నం చాలంటారు. అలాగే కౌరవ సంతానంలావందమంది మూర్చులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడు... ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు, ధర్మరాజులాంటి వాడు ఉంటే చాలనుకున్నాడురాజు, దేనికయినా ప్రాప్తం ఉండాలి
గుణవంతులూ, విద్యావంతులూ అయిన పిల్లలుండాలంటే గతజన్మలోఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకుని, దీరంగాఆలోచించసాగాడు. బాధపడి లాభం లేదు. పరిష్కారమార్గాన్నికనుక్కోవాలనుకున్నాడు. మంచి గురువుల దగ్గరచదివిస్తే పిల్లలెందుకు చదవరు? చదవనని వారనలేదే! చదివించడం లేదు కాబట్టే వారాడుతున్నారు. తప్పు తనదే! గారాబం చేసి, అప్పుడే పిల్లలకు చదువులెందుకనుకుంటూ నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు బాధపడడంలోఅర్థం లేదనుకున్నాడు
పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రులబాధ్యత. సరయిన గురువు దగ్గరవారిని చదివించాలి. చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు. విద్వాంసులు అంతకన్నా కారు. బాగా చదువుకునిపండితులవుతారు. తర్వాత్తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఏదయినా ఫలిస్తుందనుకున్నాడు. వూరికే దిగులుపడి ప్రయోజనం లేదు. అడవికి రాజయినాసింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. రాజుననినోరు తెరచి కూర్చుంటే పనిమాలా జంతువూ వచ్చి నోట్లో పడదనుకున్నాడు. పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెదకాలనుకున్నాడు
మర్నాడు కొలువు తీరాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు. అతనలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకీ, విద్వాంసులకీ సంతోషమనిపించింది. అందరికీ నమస్కరించాడు రాజు. ఇలా అడిగాడు. “ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకోని నా పిల్లలకి, రేపటితరంరాజులకి నీతిశాస్త్రాన్ని బోధించాలి. వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా?” ఉన్నారనిచెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. రాజు భయపడసాగాడు
అంతలో పండితుడు లేచి నిల్చున్నాడు. అతనిపేరు విష్ణుశర్మ. “రాకుమారులకు నీతిశాస్ట్రాన్ని నేను బోధిస్తాను మహారాజాఅన్నాడతను. ఆనందంగా చూశాడు రాజు.“కొంగకు మాటలునేర్పడం కష్టంకాని, చిలుకకు మాటలు నేర్పడం కష్టంకాదు మహారాజా! రాకుమారులు చిలుకలవంటివారు. అలాగే వజ్రాల గనిలోగాజుపెంకులుండవు. అంటే...మీ రాజవంశంలో గుణహీనులుఉండే అవకాశం లేదు. "పొంగిపోయాడు రాజు.“వజ్రాన్నయినా సానపెడితేనే ప్రకాశిస్తుంది. అలాగే ఎంత రాకుమారులయినావారికీ తగిన గురువు అవసరం. గురువుని నేనేనని నాకనిపిస్తోంది. అన్యధా భావించక రాకుమారులను ఆరు నెలలపాటునాకు అప్పగిస్తే నేను వారిని మంచిమార్గంలో పెడతాను. విద్యాబుద్ధులు నేర్పుతాను.” అన్నాడు విష్ణుశర్మ
సింహాసనం మీద నుంచి లేచినిల్దున్నాడు రాజు. గబగబా నాలుగడుగుల్లోవిష్ణుశర్మను సమీపించాడు. అతని చేతులందుకున్నాడు. ఇలాఅన్నాడు. “తిరుగులేదు. మీ వంటి పండితులదగ్గర విద్య నేర్చుకుంటే నాకుమారులకు తిరుగులేదు. యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికీపూల సుగంధం అబ్బినట్టు, సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగానా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళవుతారు. అనుమానం లేదు. క్షణంనుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యతమీదే.” “తప్పకుండాఅన్నాడు విష్ణుశర్మ
మంచి ముహూర్తానరాకుమారుల్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వారిలో ఒకడిగా ఆడి పాడి, తర్వాతవారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ.““ఆదాడి బాగా అలసిపోయాంకదా! ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచికథలు, నీతికథలు చెప్పకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూరకరకాల కథలు చెప్పుకుందాం. మీకిష్టమేనా” “ఇష్టమేఅన్నారు రాకుమారులు.విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు




Click Here to View All పంచతంత్ర కథలు