సర్పముఖి
పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని మౌనంగాస్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోనిబేతాళుడు “రాజా, నువుఈ అర్దరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకుబోధపడటం లేదు. బహశా నీవు ఏ దేవతనయినా సంతృప్తి పరిచి నీ సమస్యలనుపరిష్కరించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్లయితేఆ మేరకునీ నిర్ణయం మంచిదే అవుతుంది. సర్పముఖంతోపుట్టిన తన కూతురుకు మానవరూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించినఒక రాజు కథను ఈసందర్భంగానీకు చెబుతాను. తన ప్రార్ధనలకు మెచ్చినాగదేవత తనముందు ప్రత్యక్షమైనప్పుడుఈ రాజు మరొక సమస్యను కూడా పరిష్కరించుకోడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ విశేషమేమిటో చెబుతాను, శ్రమతెలియకుండా విను, అని కథ చెప్పసాగాడు.
జ్ఞానదీపికరాజ్యం రాజు జీమూత వాహనుడుధార్మికుడు. ప్రజాసంక్షమ పథకాలు ప్రవెశపెట్టడంలోనూ, ప్రజల బాగోగులు చూడడంలోనూఅతనిది అందెవేసిన చెయ్యి. జీమూతవాహనుడి పట్టమపిషి చూడామణిదేవి భర్తకు తగిన ఇల్లాలు. రాజదంపతులకుసందీపుడు ఒక్కడే కొడుకు. వయసు అయిదేళ్లు మించదు.
రాజదంపతులుఒకసారి వనవిహారానికివెళ్లారు. మధ్యాహ్నం భోజనానంతరం యువరాజుతోకలిసి తమ కోసం నిర్మించిన గుడారంలోవిశ్రాంతి తీసుకోసాగారు. విశ్రాంతిసమయంలో వారికి చిన్నపాటి కునుకుపట్టింది.
ఆ సమయంలో నిద్రిస్తున్న యువరాజుమీద ఎండ పడసాగింది. అదేసమయానికిగుడారంలోకి ఒక నాగసర్పం వచ్చింది. బాలుడి మీద ఎండ పడడం చూసిననాగసర్పం పడగ విప్పి యువరాజు శిరస్సుమీదఎండ పడకుండా గొడుగు పట్టింది.
అదే సమయానికి కళ్ళు తెరిచిన మహా రాజుకుఆ దృశ్యం భయం గొలిపింది. అతను, నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదంశంకించి ప్రక్కనున్న కత్తి అందుకునిపైకి లేచి తటాలున నాగసర్పంశిరసు ఖండించాడు. నాగసర్పం గిలగిలా కొట్టుకునిమరణించింది.
ఆ సవ్వడికి మేల్కొన్న మహారాణి జరిగిన సంఘటన తెలుసుకుని భీతిల్లియువరాజునుఅక్కున చేర్చుకుంది. మరికొంచెంసేపటికి రాజదంపతులు, యువరాజుతోకలిసి అంతఃపురం చేరుకున్నారు.
ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి మహారాణిచూడామణి దేవి గర్భం ధరించింది. ఆ శుభవార్త తెలుసుకుని మహారాజుతోపాటు, రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు. నెలలు నిండిన మహారాణి ఒక ఆడశిశువును ప్రసవించింది. ప్రసవించిన బిడ్డను చూసి మంత్రసానులు భీతి చెందారు. ఎందుకంటె జన్మించిన బిడ్డకు దేహమంతామానవదేహమే కాని శిరస్సు స్థానంలోపాము తల ఉంది.
క్షణాల్లోఆ వార్త మహారాజు చెవిన పడింది. అతను హటాహటిన అక్కడికి వచ్చిజన్మించిన బిడ్డను చూసి బాధతో విల విల్లాడాడు. అతనా విషయం బయటకు పొక్కకుండాజాగ్రత్తలు తీసుకున్నాడు.
రాజ్యవాసులకుమహారాణి, ఆడ శిశువునుప్రసవించిందన్న వార్త మాత్రమే తెలిసిందిగాని ఆ బిడ్డ సర్పముఖముతోజన్మించిన విషయం తెలియలేదు.
అటువంటిబిడ్డ పుట్టడానికి కారణం మహారాజునాగసర్పం శిరస్సు ఖండించడమేననిమహారాణి భావించి మహారాజుతో మనవిచేసింది. మహారాజు సర్పదోష నివారణకుపూజలు జరిపించాడు. అయితే ఫలితంకానరాలేదు.
జ్యోతిష్కులుయువరాణి జాతకం చూసివిషయం చెప్పడానికి తటపటాయించారు. మహారాజు పదే పదే అడగ్గా“రాజా! యువరాణిజన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికిఆపద రానున్నది అని మనవి చేశారు. యువరాణికి రాగచంద్రిక అని నామకరణంచేశారు. రాజదంపతులు మాత్రంయువరాణిని సర్పముఖి అని పిలుచుకోసాగారు. జీమూత వాహనుడు ఎందరోరుషులను, మునీశ్వరులను కలిసి తనకుజన్మించిన బిడ్డకి మామూలు రూపు వచ్చేలాచూడమని ప్రార్ధించాడు. అయితే వాళ్లుఅదంత తేలికయిన విషయం కాదని తేల్చిచెప్పారు.
సర్పముఖికిఅయిదేళ్ల ప్రాయంవచ్చింది. అంతలో రాజ్యంలో క్షామం అలుముకుంది. వర్హాలు పడలేదు. పచ్చటి పంట పొలాలు బీళ్లుగా మారాయి. త్రాగు నీటికి కట కట అయింది. పచ్చిక లేక పశువులుమరణించసాగాయి.
ఆ పరిస్థితికి కారణం యువరాణి జననమేననిఅర్ధం చేసుకున్నాడు జీమూతవాహనుడు. అతను ప్రజాక్షేమం గురించి విచారిస్తుండగా, అతని దగ్గరకు దివ్యచరితుడుఅనే సన్యాసి వచ్చి కలిశాడు. “రాజా, నీ మనోవ్యాధి నాకు తెలుసు. సర్ప్వముఖి జననం. రాజ్యంలోని క్షామం నీ మనసును కలిచివేస్తున్నాయి. అవునా,” అని అడిగాడు.
తను చెప్పకుండానే యువరాణి జన్మ రహస్యంతెలుసుకున్న సన్యాసి సామాన్యుడుకాదని గ్రహించిన మహారాజు; “అవును మహాత్మా! తరుణోపాయం సెలవీయండి,' అని ప్రార్థించాడు.
“రాజా! దీనికంతటికీ కారణం నీవు చంపిననాగసర్పమే! నీడనిచ్చిన సర్పాన్ని తొందరపాటుతోచంపావు. ఆ దోషమే నిన్ను వెంటాడుతున్నది. నేను చెప్పినట్లు చేస్తే పరిస్థతిచక్కబడుతుంది. ఈ రాజ్యానికి దక్షిణదిశననాగభైరవ కోన అనే ప్రదేశం ఉంది.
అక్కడఅతి పురాతనమైన నాగదేవత విగ్రహం ఉంది. నీవా ప్రాంతానికి వెళ్లి నాగదేవతనుక్షమాబిక్ష కోరి, పూజలు జరిపిస్తేమంచి ఫలితం ఉంటుంది, అని చెప్పాడు.
జీమూతవాహనుడు, దివ్య చరితుడికి పాదాభివందనంచేసి 'మహానుభావా మీరుచేసిన సహాయం ఎనలేనిది. అందుకు కృతజ్ఞతలు, ' అని చెప్పాడు.
శుభముహూార్తంచూసి జీమూతవాహనుడు, ఒంటరిగా అశ్వారూఢుడై నాగభైరవ కోననువెదుక్కుంటూ వెళ్లాడు. వారం రోజులప్రయాణం తర్వాత అతడా కోన చేరాడు. అక్కడ నాగదేవత విగ్రహం కనిపించింది. జీమూతవాహనుడు అక్కడున్న కొలనులోశుచిగా స్నానం చేసి, చెట్లకున్న పరిమళభరితపుష్పాలను కోసి వాటితో నాగదేవతకుపూజ చేశాడు.
“మాతా! కన్న తండ్రినైనందున మమ కారంతో, బిడ్డను రక్షించుకోవాలన్న తొందరలోనాగసర్పాన్ని చంపాను. అది తప్పే! అందుకు నన్ను శిక్షించు. అంతేకాని నా బిడ్డను గాని, రాజ్యప్రజలను గాని శిక్షించకు, అని ప్రార్ధించాడు.
కొద్దిక్షణాలకు ఆకాశంలో మెరుపు వెంరిసింది. బలమైన గాలి వీచింది. అంతలోనాగదేవత విగ్రహం నుంచి“రాజా! పశ్చాతాపహృదయంతో నన్ను వెదుక్కుంటూఇంత దూరం వచ్చావు. నిన్నుక్షమిస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకో! అన్న స్వరం వినవచ్చింది.
అప్పుడుజీమూతవాహనుడు, 'నాగదేవతా, నేను చేసిన తప్పిదంవలన జన్మించిన బిడ్డ సర్పముఖంతో జన్మించింది. ఆ బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు. అలాగేరాజ్యంలో ఎన్నడూ లేని క్షామం అలుముకుంది. ఆకలితో ప్రజలు అలవుటిస్తున్నారు. వర్హాలుకురిసి క్షామం తొలిగేలా చూడు,' అని కోరాడు.
అప్పుడునాగదేవత “రాజా! నీ రెండు కోరికల్లోఒక్క కోరికను మాత్రమే తీర్చగలను. ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పాన్నిచంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు. ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించకనిదానంగా ఆలోచించి వరం కోరుకో! అని చెప్పింది.
క్షణంఆలోచించిన జీమూత వాహనుడు“తల్లీ! రాజ్యంలోని క్షామం తొలిగేలా అనుగ్రహించు,” అని కోరాడు. “తథాస్తు అని దీవించింది నాగదేవత. జీమూత వాహనుడుసగం తృప్తితో, సగం అసంతృప్తితో అక్కడున్ననాగదేవత విగ్రహానికి నమస్కరించివెనుదిరిగాడు.
అతనురాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమయింది. ఆ తరువాత కూడావిస్తారంగా వర్షాలు కురిశాయి. బీళ్ళుగామారిన పంట పొలాలు చిగురించాయి. మెల్లగా రాజ్యంలో క్షామపరిస్థితులువైదొలిగి ప్రజల కష్టాలు తీరాయి.
ఆ పరిస్టితులలో దివ్యచరితుడు మరలారాజును కలిసి, “రాజా! నేనొక శాంతియజ్ఞంజరిపిస్తాను. అందువలన అంతఃపురపరిస్థితులు చక్కబడతాయి, అని చెప్పి రాజదంపతుల చేత శాంతి యజ్ఞంజరిపించాడు.
కొద్దిరోజులు గడిచేసరికి యువరాణి రాగచంద్రికకుసర్ప్వముఖం మాయమై మానవశిరము ప్రత్యక్షమయింది.
రాజదంపతులసంతోషానికి అవధుల్లేవు. సంతుష్టి చెందిన జీమూత వాహనుడు, దివ్యచరితుడిని ఘనంగా సత్కరించబోయాడు. అప్పుడు దివ్యచరితుడు “రాజా! నీముందు నేనెంత? నాకెందుకు సత్కారం?” అని నిష్కమించాడు. మహారాజు, నాగదేవతకు రాజ్యంలో ఆలయంకట్టించి తన భక్తిని చాటుకున్నాడు.
అంతవరకూకథ చెప్పిన బేతాళుడు, “రాజా! ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పంశిరసు ఖండించిన జీమూత వాహనుడు, నాగదేవత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ తన కుమార్తెబాగు కోరకుండా, క్షామం తొలగాలనిప్రార్దించడం అవివేకం కదా! ఎలాగూకొడుకు ఉన్నాడు కాబట్టి ఆడపిల్లఎమైనా ఫర్వాలేదన్న చులకన భావంతో అలా ప్రవర్తించాడా? ఒక్క కోరికను మాత్రమేనెరవేర్చిన నాగదేవత కంటె, శాంతియజ్ఞంజరిపించి యువరాణికి మామూలురూపు తెప్పించిన దివ్య చరితుడుమహిమాన్వితుడు కాదా? ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవతను అశక్తురాలిగాభావించి చిన్నచూపు చూడవలసినజీమూతవాహనుడు, దేవాలయం కట్టంచిఎ౦దుకు కృతజ్ఞత చాటుకున్నాడు? కాగా, దివ్యచరితుడు మహారాజునుతనకంటే గొప్పవాడిగా ఎందుకు స్తుతించాడు?' అని ప్రశ్నించాడు.
అందుకువిక్రమార్కుడు, 'బేతాళా! రాజ్యంలోనిక్షామం తొలగాలని నాగదేవతను ప్రార్ధించడం ద్వారా జీమూతవాహనుడురాజుగా తన ప్రథమ కర్తవ్యంనిర్వర్తించాడం. రాజుకు భార్య అయినా, బిడ్డలైనాప్రజల తర్వాతే. అతనికా పరీక్ష పెట్టడానికేనాగదేవత ఒక్క కోరికను మాత్రమేనెరవేర్చగలను అన్నది. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడుకావడం ద్వారా మహారాజు నాగదేవతఅనుగ్రహం పొందగలిగాడు. కాబట్టిఅతనా కోరిక కోరడంలో తొందరపాటుప్రదర్శించాడు తప్ప అవివేక నిర్ణయంఅనడానికి వీలులేదు. నాగదేవతఅనుగ్రహాన్ని అర్ధం చేసుకోబట్టేదివ్యచరితుడు శాంతి యజ్ఞం జరిపించికాగల కార్యం త్వరగా సానుకూలం అయ్యేలాచేశాడే గాని అందులో అతని దివ్యశక్తులేం లేవు. నాగదేవత ఒకకోరిక నెరవేరుస్తాననిచెప్పిరెండో కోరికను కూడా నెరవేర్చడంఅర్ధం చేసుకోబట్టె జీమూతవాహనుడుదేవాలయ నిర్మాణం గావించాడు.
దివ్యచరితుండు, మహారాజును స్తుతించడానికికారణం, తనవారిని త్యజించడంఅన్నది సన్యాసులకే కష్టమైన విషయం, అటువంటిది మహారాజు ప్రజలక్షేమం కోసం కన్నబిడ్డ క్షేమాన్నే పక్కనపెట్టడం చాలా అరుదైన విషయం. అందుకే అతను రాజును స్తుతించాడు, అని చెప్పాడు.
బేతాళుడికిసరైన సమాధానం లభించడంతోశవంతో సహా మాయమై తిరిగిచెట్టెక్కాడు.