Panchatantra Stories-మిత్రభేదం 1

TSStudies

పంచతంత్ర కథలు - మిత్రభేదం

 దక్షిణభారతదేశంలో మహిళారూప్యమనే నగరాన్నిఅమరశక్తి అనే రాజు పాలించేవాడుఆయన గొప్ప శక్తివంతుడు, ధీమంతుడుదయావంతుడు; లలిత కళాకౌశలమూరాజకీయచతురతా కలవాడు. ఆయనకు వసుశక్తిఉగ్రశక్తీ అనేకశక్తీ అని ముగ్గురు కుమారులు. వారికి చదువు అబ్బలేదు, లోకజ్ఞానంలేదు. వారికి రాజనీతీ, రాజతంత్రమూసాధారణజ్ఞానమూ సైతం లేకపోవటం చూసి రాజుకుఎంతో విచారం కలిగింది.
ఆయన ఒకనాడు తన మంత్రులను పిలిచి, నా కొడుకులు మూఢులన్న సంగతి మీరెరుగుదురు. జ్ఞానమూ, సద్బుద్దీ లేని కొడుకుగొడ్డుమోతు ఆవులాగా నిరర్ధకంఅలాంటికొడుకులను కనేకన్నా సంతానం లేకుండాఉండడమే మేలు; సన్యసించటం మేలు. అందుచేత నా కొడుకులలో జ్ఞానాన్ని వికసింపచేసి, వారిలో రాజనీతీ, పరిపాలనా దక్షతాకలిగించేమార్గం ఐదో చెప్పండి,” అన్నాడు.
“' నగరంలోనే విష్ణుశర్మ అనే గురువు ఉన్నాడు. ఆయన సమస్త కళలను కాచి వడబోసినవాడు. అంతే కాదు; ఆయన చాలా సులువుగావిద్యాబోధ చెయ్యగలడు. ఆయనకు మహారాజుగారు తమ కుమారులను అప్పగించినట్టయితేఅతి శీఘ్రకాలంలో ఆయన వారిని రాజనీతిలోనూ, ప్రపంచ జ్ఞానంలోను  ఆరితేరేటట్టు చేయగలడుఅని ఒక మంత్రి చెవ్పాడు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,
రాజువిష్ణుశర్మను పిలిపించి, తన కొడుకులకురాజనితీ, వివేకమూ నేర్పినట్టయిళతే నూరుగ్రామాలు ఇస్తానన్నాడు.
మహారాజా, నేను విద్యను విక్రయించను. ఎనభై ఎళ్ళవాళణ్ణి, నాకు ధనం ఎందుకుఅడిగినవారికి విద్యాదానం చెయ్యటం నా రాజనీతీ, వివేకమూ కలిగిస్తాను, అన్నాడు విష్ణుశర్మ,
రాజుసంతోషించి, తనపిల్లలను ఆయనకు అప్పగించాడు. ఆయన వారికి పంచతంత్రం అనేదిఅయిదు భాగాలుగా చెప్పాడు. ఆ భాగాలేవంటే-మిత్రభేదం, మిత్రసంప్రాప్తి, కాకోలూకీయం, లబ్బప్రణాశం, అపరీక్షిత కారకం. విష్ణుశర్మ చెప్పిన పంచతంత్రం ద్వారారాజకుమారులు అయిదు మాసాలలో రాజనీతిలోనూ, లోకజ్ఞానంలోనూ ఆరిలేరిన వారైనారు.
1. సింహము-ఎద్దు
దక్షిణదేశంలోమహిళారూప్యమనే నగరంలో వర్హమానుడనేవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్పధనికుడు, నీతిపరుడూ, దాతకూడానూఆయన, ధనాన్ని ధర్మబద్ధమైన వ్యాపారం ద్వారాతేలికగా సంపాదించి, వివేకంతో ఖర్చు చేసేవాడు.
ఒకనాడుఆయన రెండెడ్లబళ్ళ మీద ఖరీదైనవర్తకపు సరుకులు వేసుకునియమునాతీరానగల మధురానగరానికి బయలుదేరాడు. ఒక బండికి కట్టిన నందికంసంజీవకంఅనేవి మేలైన ఎద్దులు.
కొన్నాళ్ళకుబిడారు యమునా తీరానగల అడవినిచేరుకున్నది. అడవిలో అనేక రకాలచెట్లూ, అడవి జంతువులూ ఉండేవిఇక్కడసంజీవకం అనే ఎద్దు బురదనేల మీద కాలుజారి, మడమ విరిగి, పడిపోయి కదలలేకపోయింది. బండివాడు వర్ణమానుడికి తానసంగతిచెవ్పాడు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,
వర్ధమానుడుఎంతో చింతించి, అయిదు రోజులపాటుప్రయాణం నిలిపి, సంజీవకానికిచికిత్సలు చేయించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ఆయన శీఘ్రంగా మధురచేరుకుని, పని చూసుకోవలసి ఉండటంచేత, సంజీవకానికి బండివాణ్ణోమరొకసేవకుణ్లీ తోడు ఉంచి, తగినంత మేతా, డబ్బూ వారికి ఇచ్చి, “ఎద్దును శ్రద్ధగా సంరక్షించి, బాగుకాగానే నా వద్దకు తీసుకు రండి. ఒకవేళ అది చావటం జరిగితే, దానికి శ్రద్దగాదహన సంస్కారాలు జరిపి మీరు వచ్చెయ్యండి, '' అన్నాడు.
ఇలా చెప్పి ఆయన తన బళ్ళనూ, సరుకునూమధురకు తరలించుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు మనుషులూ ఒంటరిగా అడవిలోఉండటానికి భయపడి, ఎద్దును దానిమానాన అక్కడే వదిలేసి, మర్నాడే తమ యజమానినిచేరుకుని, ఎద్దు చచ్చిపోయిందని చెప్పారు.
అయితే, అదృష్టవశాన సంజీవకం కోలుకున్నది. అది క్రమంగా లేచి, కుంటుతూ తిరగసాగింది. అది నింపాదిగా నడుచుకుంటూ, అరణ్యంగుండా యమునానది ప్రవహించేచోటుకు చేరుకున్నది. అది నది ఒడ్డునగల పుష్టికరమైన గడ్డిమేసి, స్వచమైన నదీ జలం తాగి త్వరలోనేబలాన్నీ, ఆరోగ్యాన్నీ పొంది, శివుడి వాహనమైన నందికి సమానంగా తయారైంది
అరణ్యంలోనే పింగళకం అనే సింహంనక్కలనూ, ఇతర జంతువులనూ పరివారంగా పెట్టుకునినివసిస్తున్నది. సింహం ఒకనాడు యమునలోనీరు తాగబోయి, సంజీవకం పెట్టినపెద్ద రంక విని, అలాంటిభయంకర ధ్వనిచేసేప్రాణి ఎమై ఉంటుందో తెలియక బెదిరిపోయింది. అది తన భయాన్ని పైకి తెలియనివ్వక, నీరు తాగే ప్రయత్నం మానిమర్రిచెట్టుకింద తన నివాసానికి తిరిగివచ్చిజరిగినదాన్ని గురించి ఆలోచించసాగిందిఇతర మృగాలు దాన్ని పరివెష్టించి ఉన్నాయిభయపడినప్పటికి దాని గాంభీర్యం తగ్గలేదు. మృగరాజుకు మనిషి రాజులలాగా అభిషేకమూ, దుస్తులూ, చదువులూ, అవసరం లేదు. ప్రకృతే దానినిరాజుగా సృష్టించింది.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,
సింహంవెంట ఉన్న జంతువులలో కరటకమూ, దమనకమూ అనే రెండు నక్కలున్నాయి. అవి పూర్వం సింహం కింద కొలువు చేసినజంతువు బిడ్డలు. ప్రస్తుతం వాటికి పదవిలేదు. సింహం నది దాకావెళ్ళికూడా నీరుతాగకుండా తిరిగి రావటం దమనకం గమనించింది. అది తన తోబుట్టువైన కరటకాన్నిఎడంగా తీసుకుపోయి, “మన ఎలిక అయినపింగళకాన్ని చూశావా? నీరు తాగటానికియమున వద్దకు వెళ్ళింది. నీరు తాగకుండాఆకస్మాకంగా ఎ౦దుకు తిరిగి వచ్చిందీ? దాని ముఖం మరీ దీనంగానూవిహ్వాలంగానూఎందుకు ఉన్నదీ?” అని అడిగింది.
దానికికరటకం, “'తమ్ముడూ, ఎప్పుడు గానిరాజుకు సంబంధించిన విషయాలలో అనవసరంగాజోక్యం కలిగించుకోకు. అలా చపలచిత్తంతోలేనిపోని విషయాలలో జోక్యం కలిగించుకునేవాళ్ళు, సీల పెరికిన కోతిలాగా వెంటనే నశించిపోతారు ,”” అన్నది. “అదెలాగ?” అని అడిగింది దమనకం ఆశ్చర్యంతో.
కరటకంచిలిపికోతి కథ ఇలా చెప్పిందిఒక నగరం వెలుపల ఒకవర్తకుడు ఆలయం కట్టిస్తున్నాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ పనివాళ్ళుతిండి తినటానికి నగరానికి వెళతారు.  ప్రదేశమంతటా పెద్ద పెద్ద దుంగలను రంపాలతో కోస్తారు. 
ఒకనాడు, కట్టుతూ ఉన్న దేవాలయం దగ్గిరికికోతుల మంద వచ్చింది. ఒకబ్రహ్మాండమైనమాను సగం కోసి ఉన్నది. పసవాళ్ళు కోతఆగిన చోట దుంగలో బిగువుగాఒకసీల గుచ్చారు.
కోతులన్నీగెంతుతూ ఆడుతూ ఉంటే ఒక చిలిపి కోతి సీలనుచూసి, “ఇది ఇక్కడఎందుకున్నదీ? ' అనుకుని, సీలను రెండుచేతులా పట్టి బలం కొద్దీపెరికిందిసీల లాగగానే, ఎడంగా ఉన్న దుంగభాగాలు కలుసుకున్నాయి. కోతి వాటి సందున నలిగి చచ్చిపోయింది.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,
కరటకం కథ చెప్పి, “అందుకేనువ్వు లేనిపోనివిషయాల జోలికి పోవద్దన్నానుపిచ్చివాడా, మనకు కొలువు లేక పోయినాప్రభువువదిలిన ఆహారం తిని బాగానేబతుకుతున్నాం. కాస్తా పోగొట్టుకోవటందేనికి?”' అన్నదికరటకం కోతి కథ చెప్పగానే దమనకం ఇలా అన్నది (ఇంకావుంది)