వేట
అతడికి వేటంటే ప్రాణం. వీలు చూసుకుని తరచుగాఅరణ్యానికి వెళ్ళి జంతువుఅను వేటాడేవాడు.
ఎప్పటిలాగే ఒక పర్యాయం విక్రమధీరుడుమెరికల్లాంటి కొంతవముంది సైనికులను వెంట తీసుకుని అరణ్యానికి వేటాడటానికి వెళ్లాడు. ఒక జింక పిల్లనుచూసి బాణం గురిపెట్టాడు. అదేసమయానికి దూరం నుంచి ఒకబాణం వచ్చి జింక పిల్లనుతాకింది. అది నేలకు ఒరిగింది.
తను గురిపెట్టిన జింక పిల్లను వేటాడినదిఎవరా అని విక్రమధీరుడు బాణందూసుకొచ్చిన దిశగా చూశాడు. ఒకపొదమాటునుంచి ఒక వ్యక్తి బయటకువచ్చాడు. అతని వేష ధారణచూసిన విక్రమధీరుడు అతడు తప్పక వేటగాడుఅయి ఉంటాడని భావించాడు. ఆ వేటగాడు మహారాజునుసమీపించినంతనే నవమస్కరించి, 'మహారాజా! క్షమించండి. మీరు జింక పిల్లకుబాణం గురిపెట్టిన విషయం తెలియక నేను బాణంవదిలాను, అన్నాడు.
విక్రవుధీరుడు కన్నెరజేసి, ఎవరు నువ్వు “అనిప్రశ్నించాడు. “నా పేరు రణమల్లు. పొట్టపోసుకోవడానికి జంతువులను వేటాడుతుంటాను,” అని చెప్పాడతను.
“నేనువేటాడ దలిచిన జింకపిల్లను నీవు వేటాడి పెద్దతప్పు చేశావు. అందుకు శిక్షగా నీ కుడిచేతి బొటనవేలును నరికిస్తాను.' అన్నాడు విక్రమధీరుడు. “మహారాజా! తెలియక చేసిన తప్పుకు అంతశిక్ష తగదు. విలుకాడికి కుడిచేతిబొటన వేలు ప్రాణంతో సమానమనిమీకు తెలియనిది కాదు, అన్నాడు రణమల్లు.
“నీవు నన్ను మించిన విలుకాడివా?' అని పరిహసించాడు విక్రమధీరుడు.
“మీరు యుద్ద భూమిలోఎంత వీరులో, ఈ అరణ్యంలో నేనంతవీరుణ్ణీ, బదులు పలికాడు రణమల్లు.
విక్రమధీరుడు ఆగ్రహంతో “తక్షణం విడిప్రాణం తీయండి.” అని భటులను ఆదేశించాడు.
భటులు రణమల్లు మీద కత్తులు దూస్తుండగాహఠాత్తుగా ఒక మహా వృక్షంమీదనుంచి భయంకరమైన కొండ చిలువ మహారాజుమీదపడి అతణ్ణి చుట్టేసింది.
మహారాజు, సైనికులు బిత్తరపోయారు. కొండ చిలువ బారినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు గాని, అతని శక్తిచాలలేదు. సైనికులు, కత్తులు దూసి కూడా కొండచిలువ వమీద దాడి వసేస్త మహారాజుకు మరింత ప్రమాదమని శంకించారు.
ఆ దృశ్యం చూసిన రణిమల్లు తక్షణమేవిల్లు సంధించి రాజుకు చిన్న గాయమైనా తగులకుండా, కొండ చిలువ మీదకు వదిలాడు. దాంతో కొండ చిలువపట్టు సడలించింది. అదే అదునుగా వికముధీరుడు కొండచిలువ బారి నుంచి బయటపడిపరుగున ఇవతలికి వచ్చాడు. రణమల్లు కొండచిలువను సమీపించి తన మొలనున్న చురకత్తితీసి దాని ప్రాణం తీశాడు.
విక్రమధీరుడు, రణమల్లును కౌగలించుకుని, “అహంకారంతో నిన్ను చులకన చేసి మాట్లాడాను. నీ ప్రాణం తీయించబోయాను. అయినా నీవు నన్నుకాపాడావు. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నాశత్రురాజుకు వస్తే నేను అతనిచావునే కోరతాను. నీలా దయచూపను. నీవునా కంటే గొప్పవాడివి. నన్నుమన్నించు, అని కోరాడు.
అందుకు రణమల్లు, “మహారాజా! విలుకాడికి చేతి బొటనవేలు ఎంతముఖ్యమో, మనిషి అనేవాడికి మానవత్వంఅంత ముఖ్యం. ఒక మనిషిగా నాధర్మం నేను నిర్వర్తించాను. అంతేగాని ఇందులో నా గొప్పదనం ఏమీలేదు,” అని వినయంగా బదులు పలికాడు.
విక్రమధీరుడుతన మెడలోని ముత్యాలహారం తీసి, రణమల్లు మెడలోవేసి అతనికి కృతజ్ఞతలు చెప్పి, వెనుదిరిగాడు.