విమర్శ
త్రిపర్ణసామాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడుసహృదయుడు, సమర్దుడునూ. రాజ్యవ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడువిచక్షణను పాటించగలడని పేరుపొందాడు.
ఒకసారి సర్వసేనాని శూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, ప్రభూ! మన సామంత రాజ్యాలలోఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఎలినవారిశాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పంకట్టడానికి కూడా సవాలక్ష ప్రశ్నలువేస్తున్నాడు. తమ ఆజ్ఞ అయితేతక్షణమే వెళ్లి అతనికి బుద్ది చెప్పి వస్తాను, ' అన్నాడు.
సేనాని మాటలు విన్న విష్ణువర్ధనుడు, 'అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేం ఆలోచిస్తాం,' అనిఅప్పటికి అతడిని పంపేశాడు.
చక్రవర్తి ఆదేశాలకు ఎదురుచూస్తూ, రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలనుచేసుకోసాగాడు శూరసేనుడు. అంతలో ఓ రోజునఅతనికి చక్రవర్తి నుండి పిలుపు రానేవచ్చింది. ఉత్సాహంగా వెళ్లాడు అతను.
విష్ణువర్ధనుడు, శూరసేనుడితోరామాపురం గురించి గాని, అనంతవర్మ గురించిగానిప్రస్తావించలేదు. 'శూరసేనా! ఉమ్మడి కరుటు౦బపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాము మేము. ఆ సందర్భంలోనీ సహకారం కోరి పిలిపించాము, ' అన్నాడు.
సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి విష్ణువర్దనుడు తరచుగా అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తుండటం కద్దు. అందుకే, “అవశ్యం సెలవీయండి, ప్రభూ! అన్నాడు'శూరసేనుడు.
“ఆఅధ్యయనంలో ఓ భాగమైన కుటుంబంలోసామరస్యతను గూర్చి, పరిశీలించేందుకుని వివిధ తరగతులకు చెందినకొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి,' చెప్పాడు విష్ణువర్దనుడు.
“నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెల్లి ప్రశాంతంగా ఆలోచించి.. గత మూడు మాసాల్లోనూనీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు, వాటిని నీ కుటుంబంలోని సభ్యులంతాఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలూ వగైరా వివరాలన్నీ రాసుకునివచ్చి మాకు చూపించాలి.
“ఓస్, అదెంత భాగ్యం!' అనుకున్న శూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకునివెళ్ళిపోయాడు.
మర్నాడు తల వేలాడేసుకుని వచ్చినసేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్దనుడు.
“మహాప్రభూ! తరచి చూస్తే గతమూడు మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కాని, నా ఇద్దరు కుమారులు కాని ఎకగ్రీవంగా అంగీకరించినసందర్భాలు ఒకటీ ఆరా తప్పితేఎవీలేవు,” అని విన్నవించుకున్నాడు శూరసేనుడు.
విష్ణువర్ధనుడువిస్తుపోతూ, “ఆశ్చర్యంగా ఉన్నదే! మరి కుటుంబ పెద్దగానువ్వేం చేసావ్? వారిని దండించి నీ దారికి తిప్పుకున్నావాలేదా?' అనడిగాడు.
అందుకు శూరసేనుడు నవ్వి, "ఓ పక్క నేనుతాళికట్టిన భార్య, మరోపక్క పిల్లలు పసివాళ్లూ, అనుభవ.శూన్యులూనూ. నా నిర్ణయాలలోని లోతుపాతులు వారికి ఎలా అర్థమవుతాయి? అందుకేవారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలోవారి ఆలోచనా సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగానా నిర్ణయాలను మార్చుకున్నాను,' అని జవాబిచ్చాడు.
అప్పుడువిష్ణువర్దనుడు మందహాసం చేసి, 'రామపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానంకూడా ఇదే, శూరసేనా! అనంతవర్మసామంతుడైనంత మాత్రాన అతడు మనకు బానిసఅని అర్ధం కాదు. మనసామాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒక భాగస్వామిగాఉంటున్నాడు.
చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉంది. వారు మనకు చెల్లిస్తున్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమేనన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసంకాదు, అన్నాడు శాంతంగా.
“ప్రభూ! అన్నాడు శూరసేనుడు తెల్లబోయి.
“శూరసేనా! ఓ క్షణం అధికారమదంఅనే పొరని తొలగించి శాంతంగాఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైననీ స్వంత కుటుంబంలోనే ఏకాభిప్రాయంకుదరడం అరుదు. భార్యకూ, భర్త్వకూ కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు.
అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయపరమైన శాసనాల విషయంలో. ఏలికల మధ్య అభిప్రాయభేదాలుతలెత్తడంలో వింత ఎమున్నది? మనశాసనాలపట్ల అనుమానాలు రేగాయంటే ఆ లోపం మనదే అవుతుంది. ఆ సందేహాలను తీర్చవలసినబాధ్యత మనపైన ఉంది.
ఓక్షణం ఆగి సాభిప్రాయంగా సేనానివంక చూశాడు విష్ణువర్దనుడు. “మనకు అధికారం ఉందికదాఅని.. విమర్శించిన వారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటేమన చర్యలలోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసివస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే.
విష్ణువర్దనుడి నిశిత దృష్టికి, విశాలదృక్చధానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు శూరసేనుడు.
“నా అజ్ఞానానికి మన్నించండి, మహా ప్రభూ! స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలనూ, శంకలనూ నివృత్తి చేసి పని సాధించుకునివస్తాను, అని చక్రవర్తి వద్దఅనుమతి తీసుకుని నిష్క్రమించాడు.