తేడా
ఆ రోజు ఎదురింటి రోజీ పుట్టినరోజు వేడుకకి వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఇంట్లో ఎవరితోను మాట్లాడకుండా రెండు బుగ్గలమీదా చేతులుంచుకుని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది ఆరేళ్ల దీపిక.
దీపిక తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కగానొక్క కూతురయిన దీపికను వాళ్లు ఎంతో అపురూపంగా చూసుకుంటారు మరి.
“నువ్వేమయినా దీపూని కోప్పడ్డావా?”' అని అడిగాడు భార్య మైత్రేయిని.
“లేదే... ఎందుకలా అడుగుతున్నారు” అంది మైత్రేయి భర్తతో.
“మరయితే రోజూ గలగలా నవ్వుతూ ఇల్లుపీకి పందిరివేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది?”
‘నేను వంటింటి పనిలోపడి గమనించనేలేదు సుమండీ! ఎదురింటి డాక్టరు గారమ్మాయి రోజీ పుట్టినరోజుకి వెళ్లేటప్పుడు బాగానే ఉందే! పదండి కనుక్కుందాం’ అంది మైత్రేయి.
“ఏమ్మా దీపూ! అలా ఉన్నావేం?”' లాలనగా అడిగిన తండ్రికేసి చూసిన దీపిక కళల్లో ఏదో బాధ కదలాడింది.
“మరేమో రోజీకి ఎన్ని బహుమతులొచ్చాయో నాన్నగారూ! కార్లు, బొమ్మలు, బట్టలు ' అంది రోజీ.
'వెంకటరాజుకి విషయం అర్థమయింది.
“అన్నట్టు దీపూ! రేపు బడిలో పాటల పోటిలున్నాయన్నావు. బాగా సాధన చేసావా? ఎదీ ఓసారి పాడి వినిపించుమరి! అన్నారాయన దీపిక దృష్టిని మళ్లిస్తూ...
తను అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది దీపిక. తల్లి ఆ పాటలో ఒకటిరెండు చోట్ల ఎలా చక్కని భావాన్నిపలికించాలో చెప్పి సరిదిద్దింది.
మరునాడు సాయంత్రం వెంకటరాజు వచ్చేసరికి దీపిక గుమ్మందగ్గరే ఎదురయింది. పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చిన“త్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్నితండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది.
“ఎంతో ఖరీదు చెయ్యనిఈ పుస్తకం చూసి ఎందుకంత సంతోషంతల్లీ!” అని అడిగారు వెంకటరాజునవ్వుతూ.
“మరేమో నాకు బహుమతిఇస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్దయ్యాకఎంతో గొప్ప గాయనివి అవుతాననిమెచ్చుకున్నారుగా.
“అంటే ఇది నీప్రతిభకి గుర్తింపుగా వచ్చిన పుస్తకం అన్నమాట ' అన్నాడు తండ్రి.
“దీనిని భద్రంగా దాచుకుంటాను. ఎంత పెద్దయినా దీనినినేను మర్చిపోలేను నాన్నగారూ! ” అంది దీపిక మెరుస్తున్న కళ్లతో.
చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం, వారి ప్రతిభను మెచ్చుకోవడంఅనేవి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళాయని తెలిసిన వెంకటపతి రాజు కూతురి తలప్రేమగా నిమురుతూ అన్నారు.
“దీపూ! ఇప్పటికయినా కానుకలకీబహుమతికీ తేడా తెలిసిందా! కానుకలనేవిమనకి ఇష్టమైన వారు మనమీద ప్రేమతో ఇచ్చేవి. బహుమతి మన స్వయంకృషితో మనప్రతిభకి గుర్తింపుగా మనం సంపాదించుకునేది. రెండూసంతోషం కలిగించేవే అయినా మన కష్టంలేకుండా వచ్చేవాటికంటె మనం కష్టపడి సాధించుకున్నబహుమతులకే ఎక్కువ విలువని నీకు అర్ధమయిందిగదా!
”దీపికబాగా అర్ధమయిందన్నట్టు తల ఊపడమె కాకుండాతనకి వచ్చిన బహుమతిని అలాగే అపురూపంగా గుండెకిహత్తుకుని చుట్టుప్రక్కల స్నేహితులందరికి చూపించేందుకు సంబరంగా బయటికి పరిగెత్తింది.