Chandamama Kathalu-మహారాజయోగం

TSStudies

మహారాజయోగం

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాగూర్ వంశంవారుజనరంజకంగా పరిపాలించారు వంశానికి చెందినరూపసింహుడనేవాడు కడు పేదవాడు. అతనికిధనంగాని, అస్తి కాని, చివరకుబంధువులుగాని లేరు. అతనికున్న అస్తియావత్తూ చినిగిపోయిన దుస్తులూ, రెండు గోనేనే పట్టాలూ, ఒక గొడ్డలీ.
గొడ్డలితో రూపసింహుడు రోజూ ఉదయం నుంచీమధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలుకొట్టి, వాటిని తెచ్చి మూడు రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో రెండు రూపాయలు ఖర్చుపెట్టిచాకలివాళ్ల దగ్గిర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునే వాడు. మరొక రూపాయికిగుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు. బట్టలు ధరించి గుర్రం ఎక్కి, వాయువేగంతో నగరపు వీధుల వెంటరాజరీవితో సవారి అయి వెళ్లేవాడు.
మంచియువకుడూ, అందగాడూ అయిన వ్యక్తినిచూసి అందరూ అతనెవరో రాజనుకునేవారు. విధంగా రూపసింహుడు ప్రతిరోజూ ఠాకూర్రాజ వంశ గౌరవాన్నినిలబెట్టి, చీకటిపడగానే అద్దె దుస్తులనూ గుర్రాన్నితిరిగి ఇఛ్చివేసి తన మామూలు దుస్తులుధరించి, చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలూ, శనగపప్పూకొని తిని, కాసిని మంచినీళ్లుతాగి, ఒక గోనెపట్టా నేలమీదపరుచుకుని, మరొకటి మీద కప్పుకుని నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలుఅడవికి బయలుదేరాడు.
ఒకనాడురూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా సమీపంనుంచి సువాసనతగిలింది. వెళ్లి చూసేసరికి మంచి గంధపు చెట్టుకనిపించింది.
రూపసింహుడుగొడ్డలితో మంచి గంధపు చెట్టుబెరడు కొంత చెక్కి తీసుకుని,యధాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా  నగరానికితిరిగి వచ్చాడు.
సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయి పోతుండగానగరపు కూడలిలో ఒక పరదేశి అతనికిఎదురై "నమస్కారం మహా ప్రభూ,” అన్నాడు. 'ఎవరవోయ్నీవు?” అని ఠీవిగా ప్రశ్నించాడురూపసింహుడు 
ప్రభూ, నేను వ్యాపారం చేసుకునే వాణ్ణి. తమ దేశంలో వ్యాపారంముగించుకుని పోతున్నాను, అని విన్నవించుకున్నాడు పరదేశి.
రూపసింహుడుతన జేబులోనుంచి గంధపు చెట్టు బెరడుతీసి, పరదేశికి ఇస్తూ, “ఠాకూర్రూపసింహుడి కానుకగా దీనిని సింహళరాజుకు అందజెయ్యి, నీ పని సానుకూలంఅవుతుంది!” అని  తనగుర్రాన్ని అదిలించి శరవేగంతో  వెళ్లి పోయాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళ రాజుకు అందజేశాడుగంధపు చెక్క ఎరగని సింహళ  రాజు కానుకకు ముగ్గుడై, వర్తకుడికి సమస్త సదుపాయాలూ గాక, అతనిద్వారా రూపసింహుడికి  రత్నాలుపొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు.
వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకునగరు కూడలిలో వేచి ఉండగా రూపసింహుడుగుర్రం మీద రాజదుస్తులు ధరించిగుర్రంమీద ఎక్కి వచ్చాడు. 'నమస్కారం, మహాప్రభూ,” అన్నాడు వర్తకుడు.
ఎవరునీవు? అన్నాడు రూపసింహుడు, గురం ఆపి.
మహాప్రభూ, నేను పరదేశి వ్యాపారిని తాము పంపిన కానుకసింహళరాజుకు అందజేశాను. ఆయన తమకీ పాదుకలుపంపారు, అన్నాడు వర్తకుడు.
నీవిప్పుడు దేశానికి పోతున్నావు? అని అడిగాడు రూపసింహుడు. “అరేబియా దేశం వెళుతున్నాను, అన్నాడువర్తకుడు.
అయితేఅరేబియా చక్రవర్తికి పాదుకలను మాకానుకగా బహుకరించు, నీ పని సానుకూలమవుతుంది," అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి, శరవేగంతో వెల్లిపోయాడు.
వర్తకుడుఅలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి, అమూల్యమైనకానుకను పంపిన రాజు సామాన్యుడైఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు. వాటిలో ఉత్తమోత్తమమైనవి నూరు తెప్పించి చక్రవర్తివర్తకుడికి ఇచ్చాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids

రూపసింహఠాకూర్గారికి మా సలాములు చెప్పి, నూరుగుర్రాలు మా కానుకగా వారికిఅందజెయ్యి. వారు పంపిన కానుకఆనందాన్ని కలిగించింది. అని వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు నూరు గుర్రాలనూశ్రద్ధగా వెంటబెట్టుకు వచ్చి మామూలు ప్రకారంకూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రంమీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసిఆగాడు. వర్తకుడు నూరు అరేబియా గుర్రాలనూచూసి, “మహా ప్రభూ, అరేబియాచక్రవర్తి మీకు వీటిని కానుకగాపంపారు. స్వీకరించండి!" అన్నాడు.
నీవిప్పుడు దేశం పోతున్నావు?' అనిఅడిగాడు రూపసింహుడు.“నేను తిరిగి సింహళంపోతున్నాను, అన్నాడు వర్తకుడు. “అయితే విటిని తీసుకుపోయిసింహళరాజుకు మా కానుకగా ఇవ్వు, అంటూ రూపసింహుడు వేగంగా వెళ్లిపోయాడు.
వర్తకుడునూరు అశ్వాలనూ సింహళరాజుకు సమర్పించి, "అది రూపసింహఠాకూర్కానుకఅని విన్నవించాడు.
కానుక చూడగానే సింహళ రాజు హృదయంద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవేకాక, అతని స్నేహం మరింతవిలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడనీ, అందగాడనీ, వర్తకుడివల్ల విని సింహళ రాజుతన ఎకైక పుత్రికను అతనికిచ్చిపెళ్లి చేయతలపెట్టాడు. రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులూ, ఆభరణాలూ ఇచ్చి, పెద్ద పరివారాన్ని వర్తకుడివెంట పంపాడు.
రూపసింహుడినివాసస్థానం తెలియని కారణం చేత వర్తకుడుసింహళ రాజు పంపిన పరివారాన్నినగర కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే, రూపసింహుడు గుర్రంమీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశంఅందజేశాడు. రూపసింహుడు, సందేశాన్ని తీసుకుని, 'మర్చాడు అదేచోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళిపోయాడు.
రూపసింహడుతన అరువు దుస్తులనూ, గుర్రాన్నీఇచ్చివేసి, సింహళ రాజు పంపినదుస్తులనూ అభరణాలనూ ధరించి రోజు కట్టెలమ్మగావచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికికూడలికి చేరాడు. అక్కడ వర్తకుడూ, సింహళరాజు పరివారమూ సెద్ధ్దంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళదేశానికి ప్రయాణమై వెళ్లారు.
సింహళరాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళరాజుకు కుమూరులు లేనందున, కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలంపరిపాలించాడు.