రుజువు
సుబ్బరాజుదికొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊర్లో ఒకేదుకాణం ఉండటం వలన సుబ్బరాజువ్యాపారానికి తిరుగులేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలుఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకాలేకుండా చూసుకునే వాడు.
వ్యాపారంలో తనకుతోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్భీదు ఇవ్వడం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు.
ఒక రోజు చౌకగావస్తున్నాయని రెండువేల కొబ్బరి కాయలు ఒక్కసారిగా కొనేసాడుసుబ్బరాజు. అది చూసిన సోమరాజు“నాన్నగారూ! ఇవి మంచిరోజులు కావు. ఈ నెలలో పూజలు, వ్రతాలకుముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలోఆలస్యమైతే నిల్వవలన కుళ్లిపోయేప్రమాదం ఉంది. ఇలా అయితేనష్టాల్లో కూరుకుపోతామేమో,' అని అనుమానాన్ని వ్యక్తంచేశాడు.
సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలి గాని, ఈ కొబ్బరికాయలన్నీఈ రోజే అమ్మకం చేయగలను. అందుకు ఒక చిట్కా కూడాఆలోచించి ఉంచుకున్నాను, అన్నాడు.
ఇంతలో దుకాణానికి సుగుణఅనే ఇల్లాలు వచ్చింది. “కొబ్బరికాయ ఒకటి కావాలి” అనిఅడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకు ముందేపరిచయం ఉండటంతో "ఒక్క కొబ్బరికాయ దేనికమ్మాతీసుకువెళ్తున్నావు? అని అడగాడు.
“ఇంటికి చుట్టాలు వచ్చారు. పాయసంలో కొబ్బరి కోరు వేసేందుకు,” సమాధానమిచ్చిందిసుగుణ.
నీకీవిషయం తెలియదా?...” అంటూ సాగదీశాడు సుబ్బరాజు.
“ఏ విషయం?” ఆతృతగా అడిగింది సుగుణ.
“దిష్టి కొబ్బరికాయల పూజ విషయం!” చెప్పాడుసుబ్బరాజు.
“ఏమిటా పూజ?" ఆశ్చర్యపోతూఅడిగింది సుగుణం.
“ప్రతి ఇల్హాలు ఇంటియజమానికి మూడు కొబ్బరి కాయలతోదిష్టి తీసి ఇంటి ముందుకొట్టాలి. అలా చేయకపోతే ఇంటియజమానికి ప్రమాదం,' అంటూ పూజ విషయంచెప్పాడు సుబ్బరాజు.
“ఎవరు చెప్పారు?” అడిగిందిసుగుణ.
“పొరుగూరి జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ల ఊరు వారంతాఈ పూజ చేసి సుఖంగాఉన్నారు. ఇంతవరకు నీ చెవిన పడలేదా?” అడిగాడు సుబ్బరాజు.
“నాకు తెలియదు' అమాయకంగాఅంది సుగుణ.
“గ్రహదోష పరిహారార్థం ఈ రోజే ఈపూజ చేయి. నీ కుటుంబానికిమంచిది. నీకు తెలిసినవాళ్తందరికీ ఈ వూజగురించి చెప్పు. మనం బాగుంటేనే ఊరుబాగుంటుంది,” అన్నాడు సుబ్బరాజు.
దానితో సుగుణకు ఒళ్లు జలదరించింది. భయంతోమూడు కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించివెళిపోయింది.
“ఈ పూజ గురించిపొరుగూరు జ్యోతిష్కుడు -ఎప్పుడు చెప్పాడు నాన్నా? అడిగాడు సోమరాజు.
“అదేరా చిట్కా అంటే! మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతోఅందరూ చిత్తు కావలిసిందే చూడు ఇక పెరుగుతుందికొబ్బరికాయల అమ్మకాల జోరు' నవ్వుకుంటూ గర్వంగాచెప్పాడు సుబ్బరాజు.
“మూఢ నమ్మకాలను ప్రోత్సహించడంతప్పు కదా!” అడిగాడు సోమరాజు. '
అందరికీ ఇది మూఢనమ్మక్షమైతే నాకుమాత్రం వ్యాపార రహస్యం”అంటూ సమర్ధ్థించుకున్నాడు సుబ్బరాజు.
సుబ్బరాజుఅనుకున్నట్టే సుగుణ ద్వారా ఈపూజా విషయం. ఊరంతా పాకింది. సాయంత్రంలోపేకొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన రెండువేల వరహాలను చూసి మురిసిపోయాడు.
దుకాణంమూసి తం డ్రికొడుకులిద్దరూ ఇంటికివచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సువుతి వచ్చి"కొబ్బరి కాయలు తెచ్చారా? దిష్టిపూజచేయాలి!” అంటూ ఆతృతగా అడిగింది.
“కాయలన్నిఅమ్ముడుపోయాయి. లాభం. రెండు వేలవరహాలు మాత్రం తెచ్చాను,” నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. “లాభం సంగతి దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకుపదివేలు అంటూ తాయెత్తును సుబ్బరాజుచేతికి కట్టింది సుమతి. 'ఈ తాయెత్తు ఎక్కడిది?” అడిగాడు సుబ్బరాజు.
“మీకు తెలియదా? గ్రహదోషఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదంకలుగుతుందని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికివచ్చాడు. పదివేల వరహాలు ఇచ్చి ఈ తాయెత్తుకొన్నాను. దీని వలన మీకుఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు, ' అంది సుమతి.
సుబ్బరాజుకోపంతో ఊగిపోయాడు.“తాయెత్తు ఎవరు కొనమన్నారు? అవన్నీఒట్టి మూఢనమ్మక్షాలే. తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకుతగలేశావు?' అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు.
“నాన్నగారూ! ఇందులో అమ్మ తప్పులేదు. మూఢనమ్మకాలనుఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడంకూడా అంతే తప్పు. మీరుచిట్కా పేరున లేవదీసిన పుకారురెండువేల వరహాలు లాభం తెచ్చిపెట్టింది. అదేపుకారును అవకాశంగా మలచుకుని జ్యోతిష్కుడు అమ్మదగ్గర పదివేల వరహాలు తీసుకుని తాయెత్తును అంటకట్టాడు. మీ పుకారే లేకపోతేపదివేల వరహాలు నష్టం వచ్చేది కాదు, అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు.
తను స్వార్ధం కోసంచేసిన పని తప్పని రుజువైనందుకుసిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు.