Chandamama Kathalu-సజీవ దేవుడు

TSStudies

సజీవ దేవుడు

భర్తరాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటంచూసిన అంజలికి చిరత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, “ఎమయ్యా! పగటి కలలు కనడంకట్టిపెట్టి, పట్టణానికి వెళ్తి వారానికి సరిపడేసరుకులు తీసుకుని రా' అని చెప్పింది.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
రాము పళ్లు కొరుక్కుంటూ, చేసేదేమీలేకపట్టణానికి బయలుదేరాడు. తోటి గ్రామీణులకు మల్లేఅతడు కష్టజీవి కాదు. అడ్డదారుల్లో డబ్బుసాధించడం ఎలా అంటూ రోజంతామల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు.
పట్టణానికివెళ్లేటప్పుడు రాము ఊరి బయటనది దాటవలసి వచ్చింది. ఎటికి ఆవతల ఒడ్డునగట్టు పొడవునా దట్టంగా చెట్లు పెరిగాయి. చెట్టవరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింతచెట్టుచూశాడు. అతడి మనస్సులో పలు ఆలోచనలు రేగాయి. కొద్ది రోజుల క్రితం పట్టణంలోఒక కలప వ్యాపారి రాముతోమాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలపకావాలని, మంచి ధర చెల్లిస్తాననిచెప్పాడు. మాటలు గుర్తుకురాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది. చింతచెట్టు ఎటికి సమీపంలో గట్టుపైఉంది. అక్కడ దాన్ని నరికిముక్కలు చేసినట్లయితే, కలప గిడ్డంగికి తీసుకునిపోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు. తానుపట్టణం వెళ్లాలనే విషయం మర్చిపోయి, అతడుఅక్కడే నిలబడి పథకం పన్నాడు.
పనికోసం తన స్నేహితుడు గో్పీ సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. రాము చేసే తప్పుపనులన్నింటిలో అతడూ భాగం పంచుకునేవాడు. చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయంతీసుకోవాలని అతడు భావించాడు. రాబోయేపున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు. గోపీ ఎద్దుల బండిని, కూలీని పిలుచుకు వస్తాడు. చెట్టును కోసి ముక్కలు చేసినతర్వాత తెల్లారకముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు. కలపవ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు. పనిలో సాయపడినవారికి తలాకొంత పంచి మిగిలిన సొమ్ముతోఇంటికి వస్తాడు...
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
అలా ఆలోచిస్తూ భుజాలుఎగరేశాడు రాము. అనంతరం పట్టణం వెళ్లి కలప వ్యాపారిని కలిశాడు. తాను తెచ్చి ఇచ్చే కలపకోసం మంచిబేరం మాట్లాడుకున్నాడు. తర్వాత గోపీని, ఇతరులను సంప్రదించాడు. తను వేసిన పథకాన్నివారికి చెప్పాడు. వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు.
సమయం రానే వచ్చింది. రాముకుమనసులో ఉత్సాహం పొంగి పారలుతోంది. చింతచెట్టుపడగొట్టే శుభదినం ఈరోజే మరి. వాతావరణంకూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రానికి కారుమేఘాలు కమ్ముకున్నాయి. చీకటిపడేవేళకు మెరుపులు మెరిసాయి. త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది. రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారంచింతచెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు. చెట్టు కొట్టె కాలయ్య చెట్టువద్దే అతడిని కలుసుకుంటాడు. ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగాఅక్కడికే వచ్చి కలుస్తారు. అలాఆలోచించుకుంటూ, వర్పాన్ని లెక్కచేయకుండా రాము నదికేసి బయలుదేరాడు. నది సమీపంలో కనుచూపు మేరలో ఎవరూ కనపడలేదు. రాము పెద్దగా నిట్టూర్చాడు. ఎవరయినా తను చేస్తున్న పనిచూసి గ్రామపెద్దకు చెపితే తను పెద్ద చిక్కులోపడతాడు మరి
వర్షం రాముముఖాన్ని ఈడ్చి కొడుతోంది. మెల్లగాఅతడు నదిని దాటసాగాడు. నదిలోమోకాటిలోతు నీళ్లు పారుతున్నాయి. సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగాకాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపెంచింది. రాముఎడమవైపు తిరిగి చూశాడు. నది ఎగువ నుంచినీళ్లు తన్ను కొస్తున్నాయి
దేవుడా, అది అటవీ ప్రాంత నది. ఎగువన వర్షం పడిందంటే వెంటనేనదికి వరద ముంచుకొస్తుంది. విషయం తల్పుకోగానే రాము వణికిపోయాడు. ప్రాణంకాపాడుకోవడానికి పరుగు పెట్టాడు. నదిగట్టుకు అడుగు దూరంలో ఉండగానేరాము వరదలో చిక్కుకున్నాడు. నీళ్ళుఒక్కసారిగా ఎత్తి కుదేశాయి. రాముపెనుకేక పెట్టాడు. “దేవుడా! నన్ను కాపాడు
ఉన్నట్లుండిదూలంవంటి వస్తువుపై పోయిపడ్డాడు. దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు. అమ్మయ్య. వరద ప్రమాదంనుంచి గట్టెక్కినట్లే... కాస్సేపయ్యాక తను ఒక చెట్టును పట్టుకునిఉన్నట్లు అర్ధమయింది. వరదనీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది చెట్టే మరి. నెమ్మదిగా అతడుచెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయాడు
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
కనుచూపుమేరాఎవరూ కనపడలేదు. తన మిత్రుడు గోపీ, చెట్లు కొట్టె కాలయ్య, పనివాడు ఎక్కడా కనపడలేదు. వాళ్లు తెలివిగా ఉండి నది దాటిరాకుండా ఉండిపోయారేమో! రాత్రంతా తనుచెట్టుమీదే ఉండాలని రాము గుర్తించాడు. వేరేమార్గం లేదు. కాస్సేపయ్యాక వరదనీటిలోఒక శరీరం కొట్టుకు వస్తున్నట్టుచూశాడు. అతడొక అబ్బాయి. ఒక్కసారిగారాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు. త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూకనిపించాయి. రాము వాటిని కూడాకాపాడాడు. అబ్బాయి గొర్రెలకాపరి. నదికి సమీపంలో ఉండేఅతడి గుడిసె వరద నీటిలో కొట్టుకుపోయింది
రాము, గొరైల కాపరి, మేకలు రాత్రంతా చెట్టు మీదేఉండిపోయాయి. వరద నీరు మరికాస్తఎత్తులో వచ్చా ఉంటె చెట్టుసైతం కొట్టుకుపోయేది. కాస్పేపయ్యాక, వర్షంఆగిపోయింది. వరద కూడా తగ్గుముఖంపట్టింది. తర్వాత తెల్లారిపోయింది. రాము తానెక్కడ ఉన్నాడోగమనించాడు. ఆశ్చర్యం. తాను నరికివేయాలనుకున్న చింతచెట్టుమీదే ఉన్నాడతను. చెట్టు కొమ్మల్నే తెగనరికిడబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలనిపథకమేశాడు తను. మరి ప్రతిగా చెట్టు తనకేమిచ్చింది? భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది, ప్రాణం కాపాడింది. అతడి కను కొనుకులనుంచికన్నీళ్లు కారాయి. అతడు మెల్లగా గొణుక్కొన్నాడు
వృక్షరాజమా! నేను నీ పట్ల క్రూరంగా, నిర్థయగా ప్రవర్తించాను. నన్ను క్షమించు! సహజసిద్దంగానేతను సోమరి, స్వార్ధపరుడూనూ. కాని కాళరాత్రితను ఒక అబ్బాయిని, మేకలనుకాపాడాడు. నిజంగా అది తన జీవితంలోఎన్నడూ చేయని మంచి పని. తనవంటి క్రూరుడికి ఆశ్రయమిచ్చిన చింతచెట్టు ప్రభావంతో తను కూడా మంచిపని చేసి మనిషిగా మారాడు. ఆలోచన రాగానే రాముమనసు తేలికైంది. చింత చెట్టును కావిలించుకునిగొణిగాడు. “కృతజ్ఞతలు. ఇన్నాళ్ళూ పశువులా వ్యవహరించాను. నన్ను మనిషిగా మార్చావు!" 
ఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి. తన భార్య అంజలి, మరి కొందరు గ్రామస్తులు చెట్టువద్దకు పరుగెత్తి వస్తుండటం చూశాడు. రాము రాత్రంతా ఇంటికిరాకపోవడంతో అంజలి కలవరపడి పోయింది. కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుకుతూ వచ్చింది. అతడు క్షేమంగా ఉన్నాడనితెలియగానే ఆమెకు సంతోషం పట్టలెకుండాపోయింది. గత రాత్రి తానుచావుబతుకుల మధ్య ఎలా కొట్టుకులాడిందీరాము వివరించి చెప్పాడు. వరద ముంపునుంచి బయటపడ్డమేగొప్ప అదృష్టమని అన్నాడు. అంజలి చెప్పింది
అవునుభవానీ మాత దయవల్లే నీవుబతికి బయట పడ్డావు. మనం తల్లికి మొక్కుకుందాము.. 
వద్దు అంజలి, దేవతే నన్ను కాపాడింది, అంటూరాము చింతచెట్టు కేసి చూపించాడు. “ఇదిసజీవరూపంలోని దేవుడు. నేను బతికి బట్టకట్టడానికిఎవరికయినా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే హరితదేవుడికే చెప్పుకోవాలి. ఇకపై నేను. పచ్చనాకుచెట్లను ఎన్నటికి పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇతరులు ఎవరయినాచెట్టు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
తర్వాత అతడు చింతచెట్టు ముందుమోకరిల్లి ప్రార్ధించాడు.