Chandamama Kathalu-సంతృప్తి

TSStudies

సంతృప్తి 

ఆత్మకూరుగ్రామంలో రామకృష్ణయ్య తన కుమార్తె శాంతలాదేవినిఅదె వూళ్ళో ఉన్న బంధువుల యువకుడుకోటిరత్నానికిచ్చి పెల్లి చేశాడు. కోటిరత్నం వ్యసనపరుడు కాడు, కష్టజీవి. ఉన్నంతలో లోటూ లేకుండా సంసారంనడిపేవాడు
కొన్నాళ్ల తర్వాత కోటిరత్నం భార్యాసమేతంగా మామగారింటికి వచ్చాడు.
మామయ్యా! నేను ఊరు విడిచిమన రాజధాని విజయనగరం వెళ్లి ఎదైనా వ్యాపారం చెద్దామనిఅనుకుంటున్నాను. అన్నాడు
రామకృష్ణయ్య ఆశ్చర్యపోయి 'నీకు మన ఊళ్లో ఏం లోటు ఉన్నది? పొలంసాగు చేసుకుంటూ హాయిగానే ఉన్నావు గదా?” అని అడిగాడు
మాట నిజమే. కానినాకు ఇక్కడ జీవితం యాంత్రికంగా ఉంది చాలా విసుగు పుడుతోంది. ఎన్నాళ్లున్నా గొర్రె తోక బెత్తెడే అన్నట్లుపండే పంట భుక్తికి జరిగిపోతున్నది. చేతిలో డబ్బు ఎమీ మిగలడలేదు. అందుకే పట్నం వెళ్ళి ఎదైనాచిన్నవ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, అన్నాడు కోటిరత్నం
నీకు ఇదివరకు వ్యాపారంలో ఏం అనుభవం ఉన్నది? ఎవరి ఆపూ లేకుండానగరంలో ఏం వ్యాపారం చేస్తావు? అని అల్లుడిని ప్రశ్నించాడు రామకృష్ణయ్య
నగరంలో అందరికీ బియ్యం, అపరాలు అవసరం. పల్లెల్లో ఉండే పంట కొనినగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను. మంచి లాభాలు ఉంటాయి. విజయనగరంలో నా స్నేహితుడు గోవిందుఅన్నివిధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు, అన్నాడు కోటిరత్నం
అల్లుడి ఉత్సాహం చూసి సంతోషించిన రామకష్టయ్యపెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు. కోటిరత్నం సంతోషించాడు. తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని. ప్రోత్సృహించినందుకు శాంతలాదేవి కూడా ఆనందపడింది
సంవత్సరంగడిచింది. అల్తుడిని సంక్రాంతి పండుగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య కబురు చేశాడు. ఐతేతను వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నాననీ, మామగారినే విజయనగరం రమ్మనీ ఆహ్వానించాడు కోటిరత్నం
రామకృష్ణయ్య సంక్రాంతి పండుగకు కూతురింటికి విజయనగరం వెళ్లాడు. కోటిరత్నం పంచభక్ష్య పరమాన్నాలతో మామగారికి విందు భోజనం పెట్టిఖరీదైన దుస్తులు బహూకరించాడు. తనకు పెట్టుబడిగా యిచ్చినడబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు. రామకృష్ణయ్య సంతోషించాడు
మామగారూ, నేను వ్యావార లావాదేవిలలోతీరిక లేకుండా ఉంటాను. ముందు ముందు ఊపిరిసలపనంతగా పని ఉంటుంది. పండుగలకుమేము రాలేము. మీరే ఇక్కడకు వస్తూఉండండి.” అన్నాడు కోటిరత్సం
రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరెళ్లిపోయాడు. మరుసటి సంవత్సరంసంక్రాంతి పండుగకు. విజయనగరం వచ్చాడు. శాంతలాదేవి తండ్రిని పలకరించి కంచు పళ్లెంలో భోజనంవడ్డించింది. రామకృష్ణయ్య అసంతృప్తి  చెందాడు
అమ్మాయీ! మీ ఇంట్లో ఇంతకంటేమంచి పళ్లెం లేదా? ' అని కూతుర్ని ప్రశ్నించాడు. పర్యాయం కూడా శాంతలాదేవిఅడ్డంగా తల ఊపింది. మరుసటిసంవత్సరం తండ్రి వచ్చినప్పుడు వెండిపళ్లెంలో భోజనం వడ్డించింది
మామగారుఇప్పుడు ఏమంటాడో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంతో గమనించసాగాడు కోటిరత్నంకాని రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు
అమ్మాయీ! మీ ఇంట్లో ఇంతకంటేమంచి పళ్లెం లేదా?' అని ప్రశ్నించడంతో శాంతలాదేవిబిత్తరపోయింది
కోటిరత్నం తలపట్టుకున్నాడు. మామగారు వెండి పళ్లెంతో వడ్డించినాఎందుకు తృప్తిపడటం లెదో అతనికి అర్ధంకాలేదు. మళ్లీ సంక్రాంతి పండుగవచ్చింది. రామకృష్ణయ్య విజయనగరం వచ్చాడు అల్లుడి పిలుపు అందుకుని. శాంతలాదేవి తళ తళ మెరిసిపోతున్నబంగారు పళ్లెంలో భోజనం వడ్డించి తండ్రిప్రక్కనే కూర్చుని విసురుతూ ఉంది
కోటిరత్తం మళ్లీ దూరంగా నిలబడి ఈసారైనా మామగారు తృప్తి పడతారా లేదా అని గమనిస్తున్నాడు
అమ్మాయీ! మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్లెం లేదా?” అని కూతుర్ని యధావిధిగాప్రశ్నించాడు
శాంతలాదేవికి మతిపోయింది
అదేంటి నాన్నా! బంగారు పళ్లెం కంటే మంచిది ఎక్కడుంటుంది? ' అని ప్రశ్నించింది
ఎందుకు ఉండదమ్మా? ఉంటుంది. అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ
మామగారి ఉద్దేశం ఎమిటో అర్ధం కాకకోటిరత్నం జుట్టు పీక్కున్నాడు. బంగారు పళ్లెంలో భోజనం పెట్టినా మామగారుఎందుకు తృప్తి పడలేదు? అంతకంటే మంచి పళ్లెం ఎటువంటిలోహంతో చేస్తారు? బంగారం కంటే ఖరీదైన లోహంఎక్కడైనా ఉంటుందా? కోటి రత్నానికి ఎన్నోసందేహాలు కలిగాయి
తమకు బంగారు పనులుచేసే బ్రహ్మచారిని కలుసుకుని జరిగింది చెప్పాడు కోటిరత్నం
లోకంలో బంగారం కంటే మంచి పళ్లెంఉంటుందా?” అని అడిగాడు
బ్రహ్మచారినవ్వి, ఎందుకు ఉండదు? మహారాజులు, రాణీలు తినే పళ్లాలు నవరత్నాలతోపొదిగిసారు. నవరత్న ఖచితమైన పళ్ళాలలో వాళ్ళు భోంచేస్తారుబంగారుపళ్లెం కంటే అవి మంచివేకదా, అన్నాడు
తర్వాత సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుకి నవరత్నాలతోపొదిగిన బంగారుపళ్లెంని సిద్దం చేయించాడు కోటిరత్నం. శాంతలాదేవి తండ్రికి నవరత్నఖచితమైన బంగారుపళ్లెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్యభోజనం చేస్తూండగానే కోటిరత్నం అక్కడకు వచ్చాడు
మామగారూ! ఇంతకంటే మంచి పళ్లెం చేయించడంనా వల్లకాదు. మహారాజులు కూడా ఇటువంటి నవరత్నఖచితమైన పళ్లెంలోనే భోజనం చేస్తారు, ' అనిముందుగానే అన్నాడు కోటిరత్నం
రామకృష్ణయ్య అందుకు పెద్దగా నవ్వి, “నా ఉద్దేశం మీకుఅర్ధం కాలేదు. సంపాదనను బట్టి ఇంట్లో సౌకర్యాలుమెరుగుపడుతూ ఉంటాయి
మీరు తినే కంచంవిలువ పెరుగుతూ. ఉందంటే మీ వ్యాపారం బాగాసాగుతూ ఉందనే కదా అర్ధం. బాగా సంపాదించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలనేది నా కోరిక. అదినర్మగర్భంగా సూచించాను
వ్యాపారి ఎప్పుడూ తాను సంపాదించిన దానితోతృప్తిపడకూడదు. ఇతర వ్యాపారులతో పోటీపడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి. అందువల్ల ఎక్కువమందికి ఉపాధి చూపించిన వారవుతారు
రైతులు పల్లెలలో ధాన్యం పండిస్తే గదా బళ్లున్న వాళ్లురవాణా చేసేది. ధాన్యాన్ని బియ్యంగా దంచే కూలీలు, పెద్దవ్యాపారులు, చిన్నవ్యాపారులు అందరూ జీవిస్తారు గదా! ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటేప్రపంచం నడవదు,” అన్నాడు
కోటిరత్నానికి అంతా అర్ధమైంది. తనుపల్లెటూరు నుంచి నగరానికి వచ్చిందిభుక్తికోసమే కాదు. బాగా సంపాదించడానికి, అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికి కదా! అనుకుని తృప్తి పడ్డాడు.