ఎవరిది పాపం
అనగాఅనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడుఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడూ, దైవభక్తిపరాయణుడూ.
ఒకరోజున కౌశికుడు ఒక పండితుణ్ణి విందుకుపిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలూపెరుగూ తెచ్చే పాలమనిషిని పిలిచి, “అమ్మీ, రేపు గట్టిగా తోడుపెట్టినపెరుగు తెచ్చావంటే, మామూలుకంటి, ఎక్కువ డబ్బులిస్తాను, అని చెప్పాడు.
పాలమనిషికల్తీలేని గట్టిపెరుగు తోడుపెట్టి, ఆ ముంత భద్రంగాగంపలో పెట్టుకుని వురునాడు ఉదయం బ్రాహ్మడి ఇంటికిబయలుదేరింది. ఆమె గబగబ నడుస్తూఉండగా, గాలి విసురుకు పెరుగుముంత. మీది గుడ్డ కాస్తా తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడ పక్షిత్రాచు పాము నొకదానిని కాళ్లతోపట్టుకుని ఆకాశ మార్గాన ఎగిరిపోతూఉంది. బాధతో గిలగిలకొట్టుకుంటూన్న ఆ త్రాచుపామువిషం కక్కింది. ఆ విషం సరాసరిపాల మనిషి నెత్తిన ఉన్నపెరుగుముంతలో వచ్చిపడింది.
పాలమనిషి తిన్నగా కొశికుని ఇంటికి వెల్లి, పెరుగుముంత ఇచ్చేసి, చక్కాపోయింది. కౌశికుడు ముంత పట్టుకుపోయి భద్రపరచుకున్నాడు.
విందు సమయమయింది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్ని చాలా రుచిగా ఉండంటంచేత, సుష్టుగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆముంతలో ఉండే గట్టి పెరుగుతెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు.
ఐతే. భోజనమైన కొంచెంసేవటిలోనే పండితుడు గిలగిల తన్నుకుని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఎమిటో ఎవరికిమాత్రం ఏం తెలుసు? ఏదోఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకుని, కొశికుడు ఎంతగానో విచారించాడు.
భూలోకంలో ఇలా పండితుడు మరణించగానేనరకలోకంలో లెక్కలు వ్రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది. పండితుడిని చంపిన పాపం ఎవరికిచెందుతుంది. అనే సమస్యతో అతనుతికమకలు పడసాగాడు.
పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడుకనుక ఈ పాపం అతనిదేఅనుకున్నాడు. కాని వెంటనే ఈఅభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగుతెప్పించి, పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదాఅని ఉత్సాహంతో వడ్డించాడు.
కాని, పెరుగు ముంతలోపాము విషం కక్కిన సంగతిఅతనికేం తెలుసు? తెలిసి వుంటే వడ్డించడు కదా? బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపంఅతనికి అంటదు, అని తర్కించుకున్నాడు.
పోనీ, పెరుగు తెచ్చిన పాలమనిషిది తప్పా! ఊహు, గంపమీద గుడ్డఎగిరిపోవతం కాని, ముంతలో పామువిషం పడటం కాని ఎదీతెలియదు ఆమెకు. అందుచేత పాలమనిషికి ఈ పాపము చెందదుఅని నిశ్చయించుకున్నాడు.
ఐతే. ముంతమీదినుంచి గుడ్డతొలగకుంటే, పాము కక్కిన విషంపెరుగులో కలియటం, పండితుడు చనిపోవడం జరగదు కదా! కనుక, గుడ్డను తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు, అని మల్లీ ప్రశ్నవచ్చింది. కాదు, గాలి విచకుంటేప్రాణి. కోటి బ్రతికేది ఎట్లా? వాయుదేవుడికి వీచటం సహజగుణం. వాయుదేవుడితప్పు ఇందులో కొంచెమైనా లేదు. అని చిత్రగుప్తుడుతీర్మానించుకున్నాడు.
పోతే, విషం కక్కినపాముకి చెందుతుందా ఈ పాపం? అదీసమంజసంగా కనబడలేదు. గరుడపక్షి తనను గోళ్ళతో నొక్కిపట్టుతూఉంటే బాధ భరించలేక, ప్రాణంపోయేసమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందోదానికేం తెలుసు? విషం పోయి సరిగ్గా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా? కాబట్టిపాముని తప్పు పట్టడానికి వీలుకనిపించలేదు.
ఇక మిగిలిందల్లా గరుడపక్షే. దాని ఆహారంకోసం అది త్రాపత్రయపడి పామునుపట్టుకుంది కాని, తక్కిన గొడవంతాదానికేం తెలుసు. పైగా ముంతలోనే విషంకక్కమనిఅదేం పామును నిర్చంధించలేదే? అందుచేత గరుడపక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూసినా, ఇందులో ఎవరినీ తప్పుపట్టడానికి వీలులేకుండా ఉంది. ఈ విషయంఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమ ధర్మరాజు వద్దకుపోయి, సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకూ ఎమీ తోచక, అక్కడఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగేడు. వారూ ధర్మం నిరయించలేకపోయారు.
యముడు తిన్నగా విష్ణువు దగ్గరకు ' పోయి విన్నవించాడు. విష్ణువుకీపాలుపోయింది కాదు. సభ చేశాడు. ఎవరూ ధర్మ నిర్ధారణ' చేయలేకపోయారు. అప్పుడు యముడు '“చిత్రగుప్తుడితో ఇది తేలే విషయంకాదు. నేను మళ్లీ చెప్పేవరకూఈ పాపం ఎవరికీ చెందినట్లులెక్క రాయవద్దు, అన్నాడు.
ఇలా అని యముడుతన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒకే చెట్టుకింద విశ్రాంతితీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. ఆ చెట్టుమీద ఉన్న పక్షి దంపతులుఆ రోజున తాము గరుడినివల్ల విన్న వృత్తాంతాలు- కౌశికుడు పండితుడికి విందు చేయడం, పండితుడుచనిపోవడం, దీనిగురించి యముడుతిప్పలు పడటం చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతిఅంతా రెండవ వానికి చెప్పి“దీనికే ఇంత బ్రహ్మాండమా? నన్నడిగితేతీర్పు చెప్పేవాడిని. వస్తుపరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు పోయాడు. ఈ పాపం కౌశికుడిదే అన్నాడు.
ఆసమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులుఈ మాటలు విని, ఆబ్రాహ్మణుడిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. 'ఈ మాటలు నీవుఅన్నావా లేదా? అని యముడుబ్రాహ్మణుడిని అడిగాడు. “అన్నాను అని నిర్భయంగా చెప్పాడుబ్రాహ్మణుడు.
అప్పుడు యమధర్మరాజు రెండు కుండల పెరుగుతెప్పించాడు. ఇందులో - ఒకదానిలో రహస్యంగా విషం కలిపించి, బ్రాహ్మణుడి ముందు పెట్టించాడు. 'బ్రాహ్మడా, ఈ రెండు కుండలలోనూ దేనిలో విషం కలిసి ఉందోచెప్పు, అన్నాడు.
బ్రాహ్మణుడు తెల్లబోయాడు. ఆ రెండు కుండల్లోఏది విషం కలిసినదో, ఏది కలియనిదోతెలుసుకోవాలంటే తను ముందుగా రుచిచూచి పరీక్షించాలి. ఒకవేళ అది విషంకలిసిన పెరుగుకుండ అయితే తను మరణిస్తాడు.
అప్పుడు యముడు కోపించి, 'బ్రాహ్మడానీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టుఉండక, పరులమీద నిందలాడావు. అందుచేత, పండితుడిని చంపిన పాపం నీకేచెందుతుంది, అని చెప్పి, అతనిపేరు చిత్రగుప్తుడి లెక్కలలో వ్రాయించాడు.
ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా ఆబ్రాహ్మణుడికి అంటుకున్నది.