Chandamama Kathalu-దుర్జనుల సఖ్యం

TSStudies

దుర్జనుల సఖ్యం

ఒకఊళ్లో ఒక సన్యాసి ఉండేవాడు. ఊరి చివర ఒక కుటీరంలోఆయన నివశిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొందరునిత్యమూ ఆయనకు పళ్లూ, ఫలహారాలూ, భోజనమూ తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు. వీటితోఆయన జీవిస్తుండేవాడు. ఒకవేళ ఎనాడైనా ఎవరూరాకపోతే రోజు సన్యాసిపస్తుండే వాడేగాని భోజనం లేదని విచారించే వాడుకాడు. సన్యాస అప్పుడప్పుడూ ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొకదానినితెచ్చి సన్యాసికిచ్చాడు. అది కూడా కుటిరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూఉండేది
సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజెయ్యాలనిఒక దొంగకు ఆలోచన కలిగింది. ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు. కుటీరంఊరిచివర ఉన్నది. దానికి పెద్ద రక్షణ ఏమీలేదు. ఆఖరుకు తలుపుకు గొళ్లెం కూడా లేదు. సన్యాసి నిద్రించేసమయంలో లోపల జొరబడి గేదెనువిప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు. అందుచేత ఒక చీకటిరాత్రి దొంగ, సన్యాసి కుటీరానికి బయలుదేరాడు
దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు. 'ఎవరవునువ్వ? నా వెంట ఎందుకువస్తున్నావు? నేనువేరే పనిమీద పోతున్నాను. నీ దారిననువు పో!” అన్నాడు దొంగ
దానికా రెలడో"మనిషి,' “నేను భూతాన్ని, ఊరిచివరికుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను. సన్యాసి ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగాఉంటున్నారు. అందుచేత వ్యాపారం బొత్తిగా అడుగంటుతోంది. ఊళ్లో అన్యాయాలూ, అకమాలూ, దౌర్జన్యాలూ మాత్రం లేకుండాపోయాయి. అందుచేత సన్యాసిని చంపిఊరిమీద మళ్లీ నా పెత్తనంసాగించుకుంటాను. నీ ప్రయాణం ఎందాకా? అని అడిగాడు
నా వృత్తి దొంగతనం. నేనూ సన్యాసి కుటీరానికేపోతున్నాను. కాని నా ఉద్దేశంసన్యాసిని చంపటం కాదు. సన్యాసికొక భక్తుడు పాడిగేదె నొకదానిని ఇచ్చాడు. దానిని దొంగిలించబోతున్నాను, అన్నాడు దొంగ
భూతమూ, దొంగాసన్యాసికి హాని చేద్దామని ఒకేచోటికిపోతున్నారు గనుక, వారికి సఖ్యం కుదిరింది. స్నేహితుల్లాగా చేతులు కలుపుకుని వారు అర్ధరాత్రి వేళసన్యాసి కుటీరం చేరారు. ఎక్కడా చడీచప్పుడూ లేదు. సన్యాసి కుటీరంలోపలనిద్రపోతున్నాడు. దొంగ తనలో తానుఈవిధంగా ఆలోచించుకున్నాడు
ముందుగా భూతం సన్యాసినిచంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్టయితేనలుగురూ వస్తారు. తరవాత నేనుగేదెను దొంగలించడం సాధ్యపడదు. అందుచేత నేనే ముందు నాపని ముగించుకోవడం మంచిది. తరువాత భూతం దాని చావుచస్తుంది. నాకేం
అదే సవుయంలో భూతంకూడా తనలో ఇలా ఆలోచించసాగింది. ' దొంగ ముందుగా గేదెనుదొంగిలించటానికి యత్నించినట్టయితే గేదె అరవవచ్చు. సన్యాసిలేస్తాడు. కేక వేస్తాడు. నలుగురూవస్తారు. అప్పుడు నేను సన్యాసిని హత్యచేయటం సాధ్యం కాదు
పైకి భూతందొంగతో విధంగా అన్నది, “తమ్ముఢూ, ముందు నేను సన్యాసినిచంపేస్తాను. తరవాత నువునిశ్చింతగా గేదెను తోలుకుపో. నిన్నడ్డే వారే ఉండరు
దానికిదొంగ "అలా కాదు అన్నా, ముందు నన్ను గుట్టు చప్పుడుకాకుండా గేదెను తోలుకుపోనీ, తరువాత నువు సన్యాసిని యధేచ్చగాచంపుదువు గాని. నాది చాలాచిన్నపని!” అన్నాడు
ఇద్దరూ వాదించుకోసాగారు. వాదన తగువుగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతుఎత్తి "నేను ముందు అంటేనేను ముందుఅని అరవసాగారు. అదిరాను రాను పెడబొబ్బల కిందికీమారింది
చివరకు దొంగ ఎలుగెత్తిఏమయ్యోయ్ సన్యాసీ, ఇదుగో భూతం వచ్చిందిచూడు, నిన్ను చంపడానికి! అని అరిచాడు. భూతంఅంతకన్నకోపంగా, 'ఇడుగోనయ్యోయ్‌, సన్యాసి దొంగ, నీ గేదెనుకాజేస్తాట్ట, అన్నది
అల్లరికి సన్యాసిమాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ల వాళ్లుకూడా కర్రలు, కత్తులూ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో కొందరు పారిపో చూస్తూన్న దొంగను పట్టుకున్నారు. ఒక భూత వైద్యుడుభూతాన్ని. అక్కడే బంధించి మారణ హోమం చేశాడు
దుర్ణనుల మధ్య సఖ్యత ఎంతోకాలం నిలవదు.