మోక్షగామి
వైశాలీనగరంలో శంభుడూ, నారాయణుడూ అనే ఇద్దరు స్నేహితులుఉండేవారు.“జీవితంలో మనం చేయవలసింది అంతాచేసేశాం. వాన ప్రస్థధర్మం పాటిస్తూ, కుటుంబ వ్యవహారాలలో తల దూర్చకపోయినా విపరీతపరిస్థితుల్లో కలుగజేసుకోక తప్పదు. అందుకని హిమాలయాలకు పోయి మోక్షసిద్ధి కోసంతపస్సు చేసుకుందాం, పద అని శంభుడుపదే పదే పోరసాగాడు. నారాయణుడుచాలా కాలం తాత్సారం చేసిచివరికి సన్యాసానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ దీక్ష. పుచ్చుకుని హరిద్వార్ సమీపంలోని ఓ తపోవనంలో తపస్సుప్రారంభించారు.
కొన్నేళ్ళ కఠోర తపస్సు తర్వాతభగవంతుడు శంభుడి ముందు ప్రత్యక్షమై, 'వరంకోరుకో!" అన్నాడు. “దేవా జీవితమంటినే అలసటపుట్టింది. బతికి ఉన్నంతకాలమూ తెలిసీఎవరికీ అపచారం చెయ్యలేదు. నాకు మోక్షాన్ని ప్రసాదించుస్వామీ!' అని కోరాడు శంభుడు. 'వెర్రివాడా! శక్తి, పదార్థాల సముతుల్యం కోసం విశ్వంలో జననమరణాలు సృష్టించబడ్డాయి. మోక్షమంటే గతజన్మల వాసనలూ లేకుండా, అత్మల్ని పుఠం పెట్టి తిరిగిజన్మల్ని ప్రసాదించడం జరుగుతుంది. మోక్షమంటే జన్మరాహిత్యమనే భ్రమలో చాలామంది ఉంటారు. ఇలాంటి మోక్షమే కావలిస్తే అలాగే ప్రసాదిస్తాను అన్నాడుభగవంతుడు,
“ధన్యుణ్ణి స్వామి! మీ రుణం ఎలాతీర్చుకోగలను?” అని అడిగాడు శంభుడు.
“నా రుణం తీర్పాలంటే జన్మలు తప్పవు వురి! సరే, నీస్నేహితుడు ఎమంటాడో చూద్దాం పడ. నా వెంటేరా. అతనికి నువ్వు కనబడవులే, అన్నాడు భగవంతుడు.
భగవంతుడు ఎదుట నిలబడి వరంకోరుకోమనగానే నారాయణుడు భక్తితో నమస్కరించి ప్రార్ధించాడు. ప్రభూ! యుక్తా యుక్త విచక్షణతో జీవితాలుకొనసాగించవలసిందిగా నీవు మానవులకు వాక్కునీ, జ్ఞానాన్నీ ప్రసాదించావు. అయితే ఇంద్రియ స్వభావాలతోమనసు చంచల గతిని ప్రవర్తించేకారణంగా జీవిత సాఫల్యాన్ని పాందేవీలు కాలేదు. దివ్యమైన ఆత్మానందాన్ని, కోరికలు పట్టి లాగే ఈశరీరంతో పొందలేకుండా ఉన్నాను...
భగవంతుడు మధ్యలో కలుగజేసుకుని, “మోక్షాన్ని కోరుకో!' అన్నాడు. “నీలో ఐక్యమైపోయిన తర్వాతనేను అన్న భావన లేకపోతేఆ అనందాన్ని అనుభవించే మార్గమే లేదు కదా? అందుకనినాకు మోక్షం వద్దు!”
“మరేం కావాలి? భగవంతుడునవ్వుతూ ప్రశ్నించాడు. 'నాకు మరల మరలపునర్ణన్మలనివ్వు. ఆరోగ్యకరమైన శరీరాన్ని ప్రసాదించు. చిత్తచాంచల్యానికి లొంగుబాటు కానిమనస్సు ప్రసాదించు. సత్య మార్గాన పయనిస్తూనిత్యమూ పరోపకారం చేసే సద్చుద్దిని కలిగించు. ప్రతి జన్మలోనూ నీ దివ్యనామస్మరణం చేస్తూఅలౌకికా నందం పొందేటట్టు అనుగ్రహించు. మోక్షం కోరి నీలో ఐక్యమైపోతేనేను సమాజానికి చేయగలిగింది ఏమీ ఉండదు కదా?”
“అలాగే కానివ్వు. నీ చిత్తశుద్ది నాకునచ్చింది. పలాయనవాదంతో మోక్ష సిద్ది కోరుకునేవారికంటేప్రాపంచిక విషయాలలో ములిగి తేలుతూనే, సన్మార్గాన్ని వీడకుండా, లోకకల్యాణం కోసం పాటుపడే మానవులఅవసరం నాకూ ఉంది. నీఇష్టప్రకారమే జరుగుతుంది!" అంటూ భగవంతుడు అక్కణ్బుంచిఅదృశ్యమయ్యాడు.
“ఎమంటావ'ని శంభుణ్ణి తర్వాతప్రశ్నించాడు భగవంతుడు.
"మోక్షంలోనూ ఇన్ని మెలికలున్నాయని ఇప్పుడేతెలిసింది. నారాయణ ఆలోచన బాగుంది. మీరుణం తీర్చుకోవడానికి జన్మలు తప్పవని మీరే సెలవిచ్చారు కదా, అలాగే దీవించండి! అన్నాడు శంభుడు. “తథాస్తు! అంటూ భగవంతుడు అదృశ్యమయ్యాడు.