చందమామ కథలు-చెవిటి మేళం
రాత్రి భోజనాల అనంతరం తాతయ్య ఆరుబయట వెన్నెలలో పడకకుర్చీలో కూచున్నాడు. తాతయ్య చిటికెడు పొడుంతీసి పీల్చి, చెయ్యి దులుపుకుంటూ ఈ శ్లోకం చదివాడు:
తాతయ్య చుట్టూ కూచున్న పిల్లలు “ఆ శ్లోకానికి అర్ధమేమిటి తాతయ్యా,' అని అడిగారు.
“శ్లోకానికి అర్థమా? వినండి చెబుతాను.
దాని అర్థమేమిటంటే: ఇతరులు చెప్పేది సరిగా వినకుండా బదులు పలకరాదు అని! ఒకానొక చెవటివాడు అసందర్భంగా మాట్టాడినందువల్లనే గదా వాణ్ణి తన్నితగిలేశారు!' అన్నాడు తాతయ్య.
“ఆ చెవిటివాడు ఎవరు తాతయ్యా? వాడేమన్నాడు తాతయ్యా? వాణ్ణి ఎందుకు తన్ని తగిలేశారు తాతయ్యా?" అంటూ పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించారు.
“ఎందుకర్రా అన్ని ప్రశ్నలూ? ఆ కథ చెబుతాను వినండి, అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు:
వెనకటికి కాంచీపురంలో దేవశర్మా, హరిశర్మా అని ఇద్దరు స్నేహితులుండేవారు. చిన్నతనంలో ఇద్దరూ కలిసి తిరిగారు. పెద్దవారైనాక కూడా వాళ్లమధ్య స్నేహం ఉండిపోయింది.
ఇలా ఉండగా దేవశర్మ ఉన్నాడే... వాడికి కొంచెం చెవుడు ఆరంభమయింది. అది అందరికీ తెలిసిపోతుందేమో అని వాడు భయపడుతూ ఉండేవాడు.
ఒకసారి హరిశర్మకు జబ్బు చేసింది. ఎన్ని వైద్యాలు చేసినా అది తిరుగుముఖం కాలేదు, తన వ్యాధి నిమ్మళించదని హరిశర్మనిరాశ పడ్డాడు కూడా.
తన మిత్రుడైన హరిశర్మకు జబ్బుగా ఉందని దేవశర్మకు తెలియవచ్చింది. అతణ్ణి చూసి పరామర్శించి వద్దామని బయలు దేరాడు.
తనకు మరి చెవుడు గద. చాలా సేపు మాట్లాడుతూ కూచుని ప్రయోజనం లేదు. అవతలి వాళ్లు చెప్పేవి తనకు ఎలాగు వినపడవు. తనకు చెవుడని అందరికీ తెలిసిపోతుంది. అందుకని ముచ్చటగా మూడే ప్రశ్నలు వేసి, స్నేహితుణ్ణి పరామరించి వచ్చేద్దామనుకున్నాడు.
తనను చూడటానికి దేవశర్మవచ్చాడన గానే హరిశర్మ సంతోషించి కూచోమని చెయ్యిఊపాడు.
“జబ్బు ఎలా ఉంది?” అని అడిగాడు
“ఇది నయమయ్యేట్టు లేదు,” అన్నాడు హరిశర్మ
ఆ మాట దేవశర్మకు వినపడదుగా! “భగవంతుడి దయవల్ల అలాగే జరగాలి.
బెషధం ఏమిటి? అని మళ్లీ అడిగాడు దేవశర్మ,
'“మృత్యువే ఇక నాకు బెషధం,' అన్నాడు హరిశర్మ
“అదేమంచి మందు.. ఇంతకూ వైద్యుడెవడు?' అని దేవశర్మమళ్ళీ ప్రశ్నించాడు.
“ఎవడా? యమధర్మరాజు! అన్నాడు హరిశర్మవళ్లు మండి.
“అతణ్లే నమ్ముకో! చాలా గట్టివాడు!' అన్నాడు దేవశర్మ
ఇదంతా వింటున్న హరిశర్మ బంధువులు దేవశర్మ ధోరణికి మండిపడి, అతడిని పట్టుకు చావగొట్టి, వీధిలోకి గెంటారు.
“చూశారా, అవతలివాడి మాటలు వినకుండానే జవాబివ్వడం అనేది ఎంత అనర్థాన్ని కలిగిస్తుందో!” అన్నాడు తాతయ్య.