Chandamama Kathalu-వ్యత్యాసం

TSStudies

వ్యత్యాసం

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
చ౦ద్రాపీడుడుకాంచన నగరపు రాజు. ఆయనవద్ద ధవళముఖుడని ఒక సేవరుడుండేవాడు. ధవళముఖుడు రోజు కూడా కొలువునుంచినేరుగా ఇంటికి వచ్చేవాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనంచేసి తాంబూలం వెసుకుని, బాగా పొద్దు పోయినతర్వాతఇల్లు చేరుకునేవాడు.
ధవళముఖుడిభార్య ఒక రోజు తనభర్తనుమీరు ప్రతిరోజూ ఎక్కడోభోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు? ఎందుకు పెడతారు?” అని అదిగింది.
ధవళముఖుడుభార్యతో, “నాకు ఇద్దరు మంచిస్నేహితులున్నారు. అందులో ఒకడు కల్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్దఉన్నది ఏది కావాలన్నాఇస్తాడు. ఇకరెండో వాడు వీరబాహు అనేవాడు. అతను నాకు (ప్రాణస్నేహితుడంటే అవసరమైతేనా ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తాడు'' అన్నాడు.
తనభర్తకు అంత గొప్ప స్నేహితులున్నారనివిని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. “నాకుమీ మిత్రులను ఒకసారిచూపుతారా? అని భర్తనడిగింది.
దానికేంభాగ్యం? రేపు నా వెంటరా, ఇద్దరి ఇళ్లకూ వెళ్తివద్దాం, అన్నాడు ధవళముఖుడు.
మర్నాడుఉదయం భార్యా భర్తలిద్దరూ కల్యాణవర్మ ఇంటికి వెళ్లారు. అతడు వారిని గొప్పగాసత్కరించాడు. తన భర్త
చెప్పినదానిలోఅతిశయోక్తి లేదని ధవళ ముఖుడిభార్య తెలుసుకున్నది.

తరవాత  దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు. చదరంగం ఆడుతున్నవీరబాహుధవళముఖుడి కేసి ఒకసారి చూసి “ఏమోయ్‌, వచ్చావాకూచో ' అని తిరిగి ఆటలో నిమగ్నుడ య్యాడు.
భార్యాభర్తలుకొంచెంసేపు కూచునివెల్తివస్తాం,' అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే, మంచిది' అన్నాడు.
ధవళముఖుడితోభార్య, 'కల్యాణవర్మ కన్న వీరబాహు మికుమంచి స్నేహితుడని చెప్పారుగదా, ఇతనికన్న అతనే మనల్ని ఎంతోఆదరంగా చూశాడే?' అన్నది.
వారిద్దరిమధ్యా గల వ్యత్యాసం చూడాలంటే, రేపు నువు ఇద్దరిదగ్గరికీ వెళ్ళి,నామీద రాజుగారికి ఆగ్రహంవచ్చిందని
చెప్పు, అన్నాడు ధవళముఖుడు భార్యతో.
ఆమెమర్నాడు ముందుగా కల్యాణవర్మఇంటికి వెల్లి అతనితో, “అయ్యా, నా భర్తపై రాజుగారుఅలిగారు. మీరు మీ మిత్రుడికి సహాయపడగలరాఅని అడిగింది. కల్యాణవర్మహడలిపోయి అమ్మా! నేనువర్తకం చేస్తుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను. నీభర్త దేశం వదిలి పారిపోవడంమంచిది. అన్నాడు.
ధవళముఖుడిభార్య వీరబాహు ఇంటికి వెళ్లి  అతనితో కూడాఅదే మాట చెప్పింది. మాట వింటూనే వీరబాహు డాలూ, కత్తీ పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, “మిత్రమా నీమీద రాజుకు కోపంతెప్పించిన తుచ్చుడెవడో ' చెప్పు! వెంటనే పాపాత్ముడిని హతమార్చుతాను!” అన్నాడు ఆవేశంతో.
ధవళముఖుడునవ్వుతూ, “కూచోవోయ్‌. మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముఖుణ్ణిచేశారులే!' అన్నాడు. అతడు వెళ్ళిపోయాక, ధవళముఖుడుభార్యతో,“చూసావు గదా, నా ఇద్దరుమిత్రులలో గల వ్యత్యాసం!' అన్నాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu