చందమామ కథలు-నమ్మక ద్రోహం
వత్సదేశానికి రాజధాని అయిన అమరావతీ నగరంలో, నరవాహనదత్తుడు పరిపాలన చేసే కాలంలో, వసుధరుడనే పేదవాడు బరువులు మోసి జీవిస్తూండేవాడు.
ఇటువంటి గర్భదరిద్రుడికి ఒకనాడు రాచనగరు ద్వారం సమీపంలో రత్నాలు పొదిగిన కంకణం ఒకటి దొరికింది. వసుధరుడు దానిని తన ఇంటికి తీసుకుపోయి, కంకణం నుంచి ఒక రత్నం ఉఊడగొట్టి, హిరణ్యగుప్పుడనే రత్నవర్తకుడి దగ్గిరికి పట్టుకుపోయాడు.
హిరణ్య గుప్తుడు దానిని పరీక్షించి, “రత్నం మేలుజాతిది. నువు అమ్మేటట్టయితే, లక్ష దీనారాలిచ్చి కొంటాను. అమ్మి డబ్బు పుచ్చుకుంటావా?” అని అడిగాడు హిరణ్య గుప్తుడు.
“అంత డబ్బు నేను మాత్రం ఎక్కడ దాచేది, బాబూ? మీ దగ్గరే ఉంచండి. నాకు కావలిసినప్పుడల్లా వచ్చి తీసుకుంటాను!” అన్నాడు వసుధరుడు.
తరవాత వాడు అయిదుసార్లుగా అయిదువేల దీనారాలు తీసుకుని రాజభోగుగాతింటూ, తాగుతూ మంచి బట్టలు వేసుకుని ఉల్లాసంగా తిరగసాగాడు.
అమరావతీ నగరంలోనే రత్నదత్తుడనే వర్తకుడున్నాడు. ఆయన వసుధరుడిచేత చాలా సార్లు సరుకులు మోయించుకున్నాడు. వాడు ఇటీవల తన వద్దకు రాక పోవడం రత్ప్నదత్తుడు గమనించి, ఇతర కూలీలను అడిగితే వాళ్లు “వాడిప్పుడు కూలి కెందుకు వస్తాడు బాబూ? చాలా గొప్పవాడైపోయాడు. వాడి చేతిలో లక్ష్మి తాండవం చేస్తున్నది! అని చెప్పారు.
వసుధరుడికి సిరి ఎట్లా వరించింది తెలుసుకోవాలని రత్నదత్తుడికి కోరిక కలిగింది. ఆయన వాణ్ణీ మంచిగా పిలిపించి, “ఒరే నీకు మంచిరోజులు వచ్చినట్లు విన్నాను. ఒకపూట మా యింట భోజనం చేసి వెళ్లు. మనం మనం చాలాకాలపు స్నేహితులం కదా!” అన్నాడు. వసుధరుడు దానికి ఒప్పుకున్నాడు. రత్నదత్తుడు వాడిచేత బాగా తాగించి. మంచి మాటలతో, వాడి రహస్యమంతా తెలుసుకున్నాడు. తరవాత రత్నదత్తుడు వసుధరుడిని ఇంటికి పంపేసి, రాజుగారి దగ్గిరికి వెళ్ళి అంతా చెప్పేశాడు.
“మహాప్రభూ, అంత వెల గల కంకణం తమదే అయి ఉండాలి. విచారణ చేసి న్యాయం చేయాలి” అన్నాడు రత్నదత్తుడు. ఈ మాట వినగానే నరవాహనదత్తుడికి తన కంకణం పోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కొంత కాలం క్రితం ఆయన ఊరేగింపు వెళ్లివచ్చాక చేతి కంకణం ఒకటి కనిపించలేదు. దానికోసం వెతికించమని ఉత్తరువు చేశాడు. తిరిగి దాని విషయం ఆయనకు జ్ఞాపకం రానేలేదు.
నరవాహనదత్తుడు కంకణంతో సహా వసుధరుణ్ణి ఆస్థానానికి పిలిపించాడు. కంకణం రాజుదే అని తేలింది. దానిమీద ఆయన పేరు కూడా ఉన్నది. “దీని మీద మా పేరు ఉండటం చూసి కూడా ఏమని నీ సొంతం చేసుకున్నావురా?” అని రాజు వసుధరుడిని గద్దించి అడిగాడు.
“కూలిమూటలు మోసుకునేవాణ్ని. నాకు దానిమీద ఏం రాసుందో ఎట్టాతెలుస్తుంది దొరా?” అన్నాడు వసుధరుడు.
“పోనీ, ఇది ఎవరిదని నలుగుర్ని విచారించలేకపోయావా?' అన్నాడు రాజు.
“నావంటి పేదవాడి దగ్గిర ఇంత గొప్ప నగ ఎవరన్నా చూశారంటే ముందు దొంగతనం అంటగట్టి తరవాత మాట్ట్లాడతారే?" అన్నాడు వసుధరుడు.
ఇదంతా వింటున్న వృద్ధ మంత్రి యౌగంధరాయణుడు, “వాడు నిర్లోషి, పోనివ్వండి! హిరణ్యగుప్పుడికి, రత్నంతో సహా రమ్మని కబురు పంపండి,” అన్నాడు.
కొద్ది సేపట్లోనే హిరణ్యగువ్లుడు రత్నంతో సహా వచ్చాడు. “ఏమయ్యా, ఈ కంకణం మీద మా పేరుండటం చూసి కూడా ఇందులోని రత్నాన్ని ఏమని కొన్నావు? ఈ నేరం కారణంగా నీవు దండనార్హుడివి కావా,” అన్నాడు రాజు.
“ప్రభూ, నేనీ కంకణం ఎన్నడూ చూడలేదు. వసుధరుడనే వాడు నా దగ్గిరికి వచ్చి ఈ రత్నం మాత్రం తెచ్చి అమ్మాడు. పేదవాడు కదా అని నేను అన్యాయం చేయలేదు. న్యాయమైన వెలకే దాన్ని కొన్నాను. వాడు నా దగ్గర అయిదువేల దీనారాలు మాత్రమే పుచ్చుకున్నాడు. మిగిలిన సొమ్మంతా నావద్దే ఉన్నది,” అన్నాడు హిరణ్యగుప్పుడు.
“అంత పేదవాడికి ఇంత వెలగల రత్నం ఎలా వచ్చింది? దొంగిలించాడేమోనని నీకు అనుమానం కలగలేదుటయ్యా?” అన్నాడు రాజు.
“ప్రభూ, మా వృత్తి వర్తకం చేసుకోవడం. అంతేకాని దొంగలను పట్టడం కాదు. మా ధర్మం మేము తప్పి నడిచినప్పుడు ధర్మ ప్రభువులు మమ్మల్ని చిత్తానుసారమూ దండించవచ్చు!”' అన్నాడు హిరణ్యగుప్పుడు.
“అతను నిర్జోషి. అయిదువేల దినారాలూ తిరిగి ఇప్పించి, అతన్ని పంపించేయండి!” అన్నాడు యౌగంధరాయణుడు. రాజుగారు బహుకరిస్తారని రత్న దత్తుడు ఉత్సాహంగా వచ్చాడు.
కాని అతడిని చూస్తూనే యౌగంధరాయణుడు, 'ఏమయ్యానీ ప్రవర్తన మాకేమీ నచ్చలేదు. నీవు వసుధరుడిని నమ్మించి మోసం చేశావు. కాని ఇది మొదటి తప్పు కనుక క్షమిస్తున్నాము!' అన్నాడు.
రత్నదత్తుడు యౌగంధరాయణుడి మందలింపుతో సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు.