చందమామ కథలు-గుడ్డి దర్బారు
పూర్వం హైదరాబాదు నగరం సమీపంలో షుకురా అనే పేదవాడొకడు ఉండేవాడు. వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్ది పాటి ఉద్యోగమైనా సంపాదించి, కనీసం నెలకు "రెండు రూపాయల జీతమైనా తీసి, దానితో పొట్టపోసుకుగడుపుదామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో రెండు రూపాయల 'నెలజీతం కూడా బతుకుతెరువు మాదిరిగానే ఉండేది.
అయితే షకురా ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది. వాడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాధుడు లేనందున, అన్నీ బుట్టదాఖలయ్యాయి.
చివరకు షకురా సాహసించి ఒక పని చేశాడు.వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహరు చేయించుకున్నాడు. అది పట్టుకుని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒకచోట కూచుని, తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు. లోపలికి అర్జీలు పట్టుకు వెళ్లే వారినందరినీ పిలిచి వాళ్ల అర్జీల పైన ఆ మొహరుతో ముద్రవేసి, అర్జీకి ఒక పైస చొప్పున వసూలు చేయసాగాడు.
ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలుననుకుని అర్జీదార్లు తమ అర్జీలపై మొహరు ముద్ర వేయించుకుని ఆ తరువాతనే తమ కాగితాలను అధికార్లకు దాఖలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది. న్యాయస్థానోద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కాని ఆ ముద్ర ఎందుకు ఉన్నదీ, ఎవరు వేస్తున్నదీ, ఏ అధికారంతో వేస్తున్నదీ ఆలోచించినవారు లేరు.
ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలుననుకుని అర్జీదార్లు తమ అర్జీలపై మొహరు ముద్ర వేయించుకుని ఆ తరువాతనే తమ కాగితాలను అధికార్లకు దాఖలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది. న్యాయస్థానోద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కాని ఆ ముద్ర ఎందుకు ఉన్నదీ, ఎవరు వేస్తున్నదీ, ఏ అధికారంతో వేస్తున్నదీ ఆలోచించినవారు లేరు.
షకురా కొద్దికాలంలోనే బోలెడంత సంపాదన సంపాదించుకున్నాడు. తన రహస్యం బయటపడిపోతే నవాబు తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకున్నది. అందుకు వాడొక ఉపాయం చేశాడు. తాను వేసే ముద్రలకు ఒక పైసా వసూలు చేయడానికి బదులు రెండేసి వసూలు చేసి,అందులో ఒకటి తాను తీసుకుని, రెండవది నిలవవేసి ఉంచసాగాడు.
ఇలా పది సంవత్సరాలు గడిచినాక ఒకనాడు ఏ కారణంచేతనో షకురా కచేరీకి వెళ్లలేకపోయాడు. ఆనాడు వచ్చిన అర్జీల పైన మొహరు ముద్ర లేదు. 'వీటిపైన ముద్ర లేదు. ఇవి చెల్లవు," అన్నారు గుమాస్తాలు. ఈ వ్యవహారం పెద్ద అధికార్ల దాకా వెళ్లింది. వాళ్లు “అసలు ఈ ముద్ర ఏమిటి, దీన్ని ఎవరు వేస్తున్నారు?” అని ఆరా తీశారు.
పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది. అంధే సర్కార్-షీతల్ దర్వాజా-షకురా మెహర్. అది సర్కారు మొహరు కానేకాదు. ఈ సంగతి నవాబుదాకా వెల్లింది. షకురాను పట్టి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షకురాను తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు. ఇలా ఎప్పట్టైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు. కనక వాడు తాను పోగు చేసి ఉంచిన పైకం వెంటబెట్టుకుని నవాబు వద్దకు వెళ్ళాడు.
నవాబు వాణ్దీ, “ఎవరు నీవు? ఈ మొహరు నీదేనా? ఎవరు నీకు అధికారం ఇచ్చారు?” అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు. షకురా దాచకుండా జరిగినదంతా నవాబుకు విన్నవించి, 'తమ వంతు ఇప్పటికీ ముప్పైవేలు వసూలయింది. ఇదుగో ఆ డబ్బు!” అని చెప్పాడు.
వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి, వాడికి ఆ పనే ఒక ఉద్యోగంగా ఖాయంచేసి, మొహరులో ఉన్న అంధే సర్కారు అన్నమాటలలో సర్కారు అనేది మాత్రం ఉంచి, అంధే అనే మాట చెక్కించేశాడు.
షకురా మొహరు చాలాకాలం అవులులో ఉంది.