తుగ్లక్ వంశము Tughlaq Dynasty

TSStudies

తుగ్లక్  వంశము :

గియాజుద్దీన్‌ తుగ్లక్‌ (1320-25):
ఇతను తుగ్లక్‌ వంశ స్థాపకుడు
ఇతను తుగ్గకాబాద్‌ కోటను ఢిల్లీలో నిర్మించాడు. ఈ కోటలో ఏటవాలు గోడ విధానమును ప్రవేశపెట్టాడు.
ఇతని ఆస్థానంలో అమీర్‌ ఖుస్రో ఉండేవాడు.
అమీర్‌ఖుస్రో-బాల్బన్‌ నుండి గియాజుద్దీన్‌ మధ్య కాలంలో ఉన్నాడు.
అమీర్‌ ఖుస్రో అసలు పేరు - హసన్‌
ఇతను గొప్ప కవి, చరిత్రకారుడు, సంగీతకారుడు. ఇతను భారతదేశంలో తబలా మరియు సితార్‌లను ప్రవేశపెట్టాడు. ఇతను ఖవాలీని కూడా ప్రవేశపెట్టాడు. ఇతను అనేక రాగాలను రచించాడు.
ఉదా॥ గోరా, ఐమన్‌, సనమ్‌, సారంగి
ఇతను రచించిన పుస్తకాలు
1) ఖజరా-ఉస్‌-సదైన్‌ (కైకూబాద్‌ కోరిక మేరకు)
2) తారిభ్‌-ఇ-అలై (అల్లావుద్దీన్‌ ఖిల్జీ గురించి)
3) ఆషికీ (ఖజిర్‌ఖాన్‌, దేవల్‌రాణి ప్రేమ వృత్తాంతం)
ఖజిర్‌ఖాన్‌ అల్లావుద్దీన్‌ కుమారుడు. ఇతని పేరు మీదుగానే చిత్తోర్‌కు ఖజిరాబాద్‌ అని పేరు పెట్టబడింది.
4) తుగ్గక్‌నామా (గియాజుద్దీన్‌ తుగ్లక్‌ గురించి)
5) నూసిఫర్‌ (భారతదేశ గొప్పతనం గురించి)
ఇతని బిరుదు -భారతదేశ రామచిలుక (ప్యారట్‌ ఆఫ్‌ ఇండియా)
1325లో ఢిల్లీ దగ్గర అఫ్ఘాన్‌పూర్‌ వద్ద ఒక చెక్క నిర్మాణం కూలిపోయి గియాజుద్దీన్‌ తుగ్లక్‌ మరణించాడు.

మహ్మద్‌-బిన్‌-తుగ్లక్‌ (1325-1851):

Medieval Indian History in telugu,Medieval Indian History notes in telugu,Medieval Indian History study material in telugu,Medieval History in telugu,Medieval History notes in telugu,ts studies,tsstudies,ts study circle,indian history in telugu,tspsc indian history notes in telugu,tspsc study material in telugu,tspsc history notes in telugu,History of Medieval India,Islamic Invasion and Occupation of India,మధ్యయుగ భారతీయ చరిత్ర,అరబ్బుల దండయాత్ర,తురుష్కుల దండయాత్ర,మహమ్మద్‌ ఘోరీ దండయాత్ర,ముస్లిముల దండయాత్ర,founder of Tughlaq Dynasty,Tughlaq Dynasty founder,history of Tughlaq Dynasty in telugu,Tughlaq Dynasty history in telugu,kings list of Tughlaq Dynasty in telugu,list of kings of Tughlaq Dynasty in telugu,Tughlaq Dynasty age in telugu,Feroz Shah Tughluq history,mohammad bin tughluq history in telugu,giyajuddin thugluq history in telugu,history of amir khusro Tughluq dynasty
ఇతని అసలు పేరు - జూనాఖాన్‌
ఇతని బిరుదు - ప్రిన్స్‌ ఆఫ్‌ మనియార్స్‌
ఇతను తుగ్లకాబాద్‌ కోట నిర్మాణమును పూర్తి చేశాడు.
దేవగిరి లేదా దౌలతాబాద్‌ కోటను నిర్మించాడు.
జహాపనా అనే పట్టణ నిర్మాణమును థిల్లీ దగ్గర చేపట్టాడు. (దీని నిర్మాణమును పూర్తి చేసినవాడు-ఫిరోజ్‌ షా తుగ్లక్‌)
ఇతను 5 ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. కానీ అన్నింటిలో విఫలుడైనాడు.

1) రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చుట (1827)
2) టోకెన్‌ కరెన్సీ - బంగారు నాణెములకు బదులు రాగి నాణెములు చెలామణిలోకి తెచ్చుట(1380)
3) గంగా యమునా అంతర్వేది లేదా డోబ్‌లో 50 శాతం శిస్తు వసూలు చేయుట.
4) ఖొరాసన్‌ (మధ్య ఆసియాలో ఉంది) దండయాత్రకు ప్రయత్నం చేయుట లేదా కాశ్మీర్ ‌పై దండయాత్ర చేసి చైనా రాజును ఓడించుట.
5) ఖలీఫాకు వ్యతిరేకంగా తన వైఖరి
ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సోకినపుడు మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ రెండున్నర సంవత్సరాలు కనౌజ్‌ దగ్గర స్వర్గద్వారి అనే ప్రాంతంలో విశ్రాంతి పొందాడు.
దివాన్‌-ఇ-కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసి రైతులకు సోన్‌దార్‌ అను బుణాలను ఇచ్చాడు. (భూమిని పునరుద్ధరణ చేయుట కొరకు)
ఇతని కాలంలో 1333లో మొరాకో యాత్రికుడు ఇబన్‌ బటూటా, భారతదేశాన్ని సందర్శించాడు.
మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఇబన్‌ బటూటాను తన ఢిల్లీ ఖాజీ(న్యాయమూర్తి )గా నియమించాడు.
తర్వాత ఇబన్‌బటూటాను తన రాయబారిగా మహ్మద్‌బిన్ తుగ్లక్‌ చైనాకు పంపాడు.
ఇబన్‌బటూటా - సఫర్‌నామా, రెహ్లాద్‌ అనే పుస్తకాలను రచించాడు.
ఇతను ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడు.
సతీసహగమన ఆచారాన్ని అరికట్టుటకు ప్రయత్నాలు, రాజ్యంలోని ఉన్నత వదవుల్లో హిందువులను నియమించడం మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ సహన భావం, ఉదార వైఖరులను తెలియజేస్తున్నాయి.
మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ కాలంలోనే విజయనగర(1336), బహమనీ(1347) రాజ్యాలు స్థాపించబడ్డాయి.
బదెౌని మహమ్మద్‌ బిన్‌తుగ్గక్‌ మరణాన్ని ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు. “ప్రజలు తమ రాజు నుండి, రాజు తన ప్రజల నుండి విముక్తి పొందారు”.

ఫిరోజ్‌షా తుగ్లక్‌ (1351-88):
ఇతను మొట్టమొదటిసారిగా జిజియా పన్నును బ్రాహ్మణులపై విధించాడు.
(భారతదేశంలో మొట్టమొదటి సారిగా జిజియాను ప్రవేశపెట్టిన వాడు - మహ్మద్‌ బిన్‌ ఖాసీం)
ఇతను కుతుబ్‌మినార్‌కు మరమ్మతులు చేయించాడు.
జహాపనా అనే పట్టణాన్ని నిర్మించాడు.
మీరట్‌, తోపరాల నుంచి అశోకుని శాసనాలను ఢిల్లీకి తరలించి వాటిని చదువుటకు ప్రయత్నించాడు.
ఇతను నాగర్‌కోట్‌పై దాడి చేసినపుడు జ్వాలాముఖి దేవాలయంలో 1800 సంస్కృత పద్యాలు లభ్యమైనాయి.
ఈ వద్యాలను అజీజుద్దీన్‌ పర్షియా భాషలోకి అనువదించాడు.
ఇతని ఆస్థానంలోని జియా ఉద్దీన్‌ బరౌనీ “ఫత్వా-ఇ-జహంగీర్‌” అనే పుస్తకాన్ని రచించాడు (ఢిల్లీ సుల్తాన్‌ల పరిపాలన గురించి తెలుసుకొనుటకు ఈ పుస్తకం ముఖ్యమైన ఆధారం).
బరౌనీ తారిఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహీ (తాజక్‌-ఇ-ఫిరోజ్‌షాహీ) అనే పుస్తకాన్ని కూడా రచించాడు.
పిరోజ్‌షా ఆస్థానంలోని చరిత్రకారుడు అయిన షంషీ-సిరాజ్‌ అఫిఫ్‌ కూడా తారిభ్‌-ఇ-ఫిరోజ్‌షాహీ అనే పుస్తకాన్ని రచించాడు.
ఫిరోజ్‌షా తుగ్లక్‌ ఈ క్రింది శాఖలను ఏర్పాటు చేశాడు.
1) దివాన్‌-ఇ-బందగామ్‌ : బానిసల శాఖ
2) దివాన్‌-ఇ-ఖైరాత్‌ : దానధర్మాలు (ప్రధానంగా పేద మహిళల వివాహం కొరకు)
3) దివాన్‌-ఇ-ఇస్తియాఖ్‌ : పింఛనుల శాఖ
4) మజ్లిష్‌-ఇ-కలావత్‌ : మంత్రుల శాఖ
5) దర్‌-ఉల్‌-షఫా : ఉచిత వైద్యశాల
ఇతను 80 వేల మంది బానిసలను తన సేవకు నియమించుకున్నారు.
ఇతను ఢిల్లీలో 1200 ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. అందువల్లనే ఇతనిని ఉద్యానవనాల రారాజు అంటారు.
ఫిరోజ్‌ తుగ్లక్‌ పాలనాకాలంలో భారతీయ సంప్రదాయ గ్రంథమైన “రాగ దర్చణాన్ని” పర్షియా భాషలోకి అనువదించడమైనది.
రైతుల కొరకు/ వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక కాలువలు త్రవ్వించాడు. కొన్ని కాలువలు ఇప్పటికినీ ఉపయోగంలో ఉన్నాయి.
ఉదా॥ హిస్సార్‌ నుండి యమున
ఇతను అనేక పట్టణాలు నిర్మించాడు.
ఉదా॥ జౌన్‌పూర్‌, హిస్సార్‌, ఫిరోజ్‌షా కోట్ల, ఫిరోజాబాద్‌, ఫతేబాద్‌
ఇతను కొన్ని బంగారు నాణాలను ప్రవేశపెట్టాడు.
ఉదా|| అథై, భిక్‌, షష్‌గని, హస్త్‌గని
వీరి కాలంలో అత్యధికంగా సంగీత పోషణ సాగించిన ప్రాంతీయ రాజ్యం గ్వాలియర్‌.
తుగ్లక్‌ వంశంలో చివరివాడు నజీరుద్దీన్‌ మొహమ్మద్‌.
నజీరుద్దీన్‌ మొహమ్మద్‌ కాలంలో 1398లో మంగోల్‌ దండయాత్రికుడు తైమూర్‌ ఇలాంగ్‌ భారతదేశంపై దాడి చేశాడు.
ఇలాంగ్‌ ఢిల్లీలోని సొత్తును దోచుకుని తిరిగి పయనిస్తూ ఖిజిర్‌ఖాన్‌ను తన డిప్యూటీగా నియమించాడు. (ముల్తాన్‌
వద్ద)
1414లో నజీరుద్దీన్‌ మరణానంతరం దౌలత్‌ఖాన్‌లోడీ ఢిల్లీ పాలకుడయ్యాడు. ఖిజిర్‌ఖాన్‌ దౌలత్‌ఖాన్‌ లోడీని ఓడించి ఢిల్లీపై సయ్యద్‌ వంశాన్ని స్థాపించాడు.