ఆధారాలు:
అర్థశాస్త్రము:
దీన్ని1905లో ఆర్.శ్యామశాస్తి కనుగొన్నారు.
ఇది 15 సెక్షన్‌లు, 180 సబ్ సెక్షన్లుగా విభజించబడింది.
దీనిలో పేర్కొనబడిన అంశాలు:
ధర్మస్తేయ (పొరన్యాయస్థానం),
కంఠకశోధన్(నేర న్యాయస్థానం),
సామ దాన భేద దండోపాయం,
27 అధ్యక్షులు,
18 తీర్ధాలు,
మంత్రుల నియామకాలలో పరీక్షలు,
అవినీతి (చేప ఆక్సిజన్),
అంబులెన్స్ విధానం (వైద్యం కారకు),
నావికాదళం,
రాజు ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నాడు.
అ వ్రజల సంతోషమే రాజుకు నంతోషమని పేర్కొన్నాడు.
అ రాజుకు ఆరుగురు శత్రువులు ఉంటారని పేర్కొన్నాడు.(కామం, ధన ఆశ, అల్బ సంతోషం, అహంకారం, ఇతరులను తక్కువ అంచనా వేయుట, విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక)
ఇండికా:
దీన్ని గ్రీకు భాషలో మెగస్తనీస్ రచించాడు.
దీనిలో పేర్కొనబడిన అంశాలు
పాటలీపుత్ర పట్టణ పరిపాలన - దీని పాలన కొరకు 6 బోర్డులు ఉండేవని, ఒక్కొక్క బోర్డులో 5గురు. సభ్యులు ఉండేవారని పేర్కొన్నాడు. 6 బోర్డుల కార్యకలాపాలు
1 పరిశ్రమలు
2 జనన మరణ రిజిస్ట్రేషన్‌లు
3 వస్తు విక్రయాలు
4 విదేశీయుల సౌకర్యాలు
5 వాణిజ్యం, తూనికలు, కొలతలు
6 సుంకాలు వసూలు
అ పాటలీపుత్ర దుర్గము(జల దుర్గము)- దీనిలో 67 గేట్లు, 510 బురుజులు ఉండేవని పేర్కొన్నాడు.
అ సైన్యాన్ని 6 రకాలుగా విభజించారని పేర్కొన్నాడు. అవి
1) కాల్బలం
2) అశ్వక బలం
3) గజ బలం
4) రథ బలం
5) రవాణా
6) నావికా దళం
ముక్కులేని మనిషి, బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉండేవని పేర్కొన్నాడు.
బానిసలు, దొంగలు, అసత్యాలు చెప్పేవారు లేరని పేర్కొన్నాడు.
మహిళా అంగ రక్షకులు ఉండేవారని పేర్కొన్నాడు.
అశోకుని శాసనాలు:
దీన్ని గ్రీకు భాషలో మెగస్తనీస్ వీటిని మొట్టమొదటిసారిగా 1887లో జేమ్స్ ప్రిన్సెప్ చదివాడు.
అశోకుని శాసనాలలో అశోకుని పేరు దేవానాంప్రియ. ప్రియదస్సి (దేవునికి ఇష్టమైనవాడు) అని పేర్కొనబడినది.
అశోకుని పేరు కేవలం మస్కీ గుజ్ఞారా, నిట్టూరు శాసనాలలో పేర్కొనబడినది.
అశోకుని ధర్మం సిద్దపుర, ఎర్రగుడి (బౌస్త్రోఫెడాన్) శాసనాలలో పేర్కొనబడినది.
అశోకుడు తన శాసనాలలో
1) ప్రాకృతం (బ్రహ్మ లిపి)
2) ఖరోష్టి (ఖరోష్టి లిపి)
3) గ్రీకు (గ్రీకు లిపి)
4) అరామిక్ (అరామిక్ లిపి) భాషలను ఉపయోగించాడు
ఉత్తర భారతదేశ శాసనంలో ఖరోప్తిని వాయువ్య భారత శాసనాలలో గ్రీకు, అరామిక్‌ను మిగతా భారతదేశమంతా ప్రాకృతంను ఉపయోగించాడు
అశోకుడు సుమారు 84000 ఏకశిలా స్తంభాలను బుద్దుని అవశేషాలపై నిర్మించాడు.
ఈ స్తంభాల కొరకు ఎర్ర ఇసుక రాతిని ఉపయోగించాడు. ఈ రాతిని మధుర, చునార్ నుంచి తెప్పించాడు.
స్తూపాలు-చిహ్నాలు:
4 సింహాలు-(ప్రస్తుతం భారతదేశం యొక్క అధికార చిహ్నం)
వృషభం - శ్రావస్థి
ఏనుగు - దౌలీ /తోసలి
ఒకే సింహం-లౌర్యనందన్‌గడ్
ఎద్దు -రామ్‌పుర
చక్రం -పాటలీపుత్రం
కాందహార్ శాసనం: ఇది రెండు భాషలలో చెక్కించ బడింది (గ్రీకు, అరామిక్).
సాంచీ స్థూపం అతి పెద్దది. దీని చుట్టూ ఇటుకల నిర్మాణం ఉంది.
రుమిండి శాసనం: అశోకుడు లుంబిని ప్రాంతం నుంచి 1/8 వంతు శిస్తు వసూలు చేశాడని పేర్కొంది.
బాబ్రా శాసనం: బౌద్ధ మతంపై అశోకుని విశ్వాసం, అశోకుడు మగధరాజు, బుద్దుడు ఒక భగవంతుడు వంటి విషయాలు పేర్కొంది.
మహస్థానా: కరువు సమయంలో తీసుకునే చర్యలు
సోపారా: అశోకుని లౌకికత్వంను తెలియజేస్తుంది
ఛాలీ, జౌగద(ఒరిస్సా): అశోకుడు “అందరూ నా బిడ్డలే అని పేర్కొన్నాడు.
అలహాబాద్/రాణి శాసనం: కారువాకి, తివర గూర్చి పేర్కొనబడింది.
ఎర్రగుడి, రాజుల మందగిరి
(కర్నూలు) -శిష్యులలో ధర్మాసక్తి కలిగే విధంగా గురువులు బోధించాలి. సంబంధాలు కల్లి ఉన్నట్లు తెలుపుతున్నాడు.
ఎర్రగుడి శాసనంలో తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించ మని, సాటి మానవుల పట్ల దయ కలిగి ఉండమని, సత్యాన్నే పలకమని అశోకుడు పేర్కొన్నాడు.
సాటి మానవుల పట్లనేకాకుండా జంతువులు, ఇతర జీవుల పట్ల కూడా దయ కలిగి ఉండాలన్న నియమం, అశోకుని తెలుపుతుంది.
ఉత్తరాగ్ర శాసనం -షాబాజ్‌గిరి
దక్షిణాగ్ర శాసనం - బ్రహ్మగిరి, సిద్దపుర(కర్దాటక
తూర్చాగ్ర శాసనం -మహాస్థాన (బంగ్లాదేశ్)
పశ్చిమాగ్ర శాసనం -కాందహార్
అశోకుడు 14 ప్రధాన శిలా శాసనాలను చెక్కించాడు. వీటిలో అతి ముఖ్యమైనది 13వ శిలాశాసనం.
13వ శిలా శాసనం కళింగ యుద్ధం, అశోకుని సమకాలీన రాజుల గురించి పేర్కొన్నది. ఆంధ్రుల గూర్చి దీనిలోనే పేర్కొనబడింది.
అశోకుని 14 శిలా శాసనాల్లో పేర్కోనబడిన అంశాలు
1వ శాసనం : జంతు బలులు, విందులు వినోదాలు నిషేధించాడు.
2వ శాసనం : ప్రజా సంక్షేమ చర్యలు అయిన రోడ్లు వేయడం, చెట్లు నాటడం అస్పత్రుల నిర్మాణం
3వ శాసనం : బ్రాహ్మణులను గౌరవించుట
4వ శాసనం : అహింస విధానంతో జీవనాన్ని కొనసాగిస్తూ జీవహింస చేయకుండుట.
5వ శాసనం : బానిసలకు, యుద్ధ ఖైదీలపై మానవత దృక్పథాన్ని కలిగి ఉండుట
6వ శాసనం : సమస్త ప్రజలందరూను నా బిడ్డలు
7వ శాసనం : ఇతర మతాల పట్ల సదా గౌరవాన్ని కలిగి ఉండుట
8వ శాసనం : ధర్మ యాత్రలు చేసినట్లు ప్రజలతో మంచి సంబంధాలు కల్గి ఉన్నట్లు తెలుపుతున్నాడు
9వ శాసనం : వైదిక క్రతువులను ఖండించాడు.
10వ శాసనం : మూఢ నమ్మకాలపై విరుగుడుగా ధమ్మయాత్రల గూర్చి తెలిపాడు.
11వ శాసనం : ప్రజలలో నైతిక ప్రవర్తన గురించి తెలుపుతుంది.
12వ శాసనం : సంఘంలోని సాంఘిక అశాంతత నిర్మూలన గురించి తెలుపుతుంది.
13వ శాసనం : క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. ఇందులో ఆంధ్రుల ప్రస్తావన ఉంది.
14వ శాసనం : పరిపాలన, ధర్మం గురుంచి తెలుపుతుంది.
అశోకుడు మరియు అతని మనువడు దశరథుడు బీహార్లోని బరాబరా గుహలలో గల సుధామ గుహను ఆజ్వికా సన్యాసులకు దానం చేశారు.
ముద్రారాక్షసం:
విశాఖదత్తుడు సంస్కృతంలో రచించాడు.
చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యమును స్థాపించినది, మౌర్య సామ్రాజ్యంలోని కుట్రల గురించి దీనిలో పేర్కొనబడింది
దీపవంశం, మహావంశం -సింహళ బౌద్ధ సాహిత్య గ్రంథాలు
దివ్య వదనం -టిబెట్ బౌద్ధ సాహిత్యం. దీని ప్రకారం ఆశోకుడు తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని అధిష్టించాడు.
పరిశిష్ట పర్వన్ -హేమచంద్రుడు రచించాడు. దీనిలో చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన ఖిచిడి కథ గురించి ప్రస్తావించబడింది.