Panchatantra Stories-మిత్రభేదం 2

TSStudies

పంచతంత్రం - మిత్రభేదం 2

అన్నాతన స్వార్ధమే చూసుకుంటూ, ఎదో విధంగాపొట్టపోసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నవాడుపైకి రాలేడు. కడుపు నిండినంత మాత్రానఉత్తమ జీవితం అలవడదు. చివరకు కాకి కూడా తనముక్కుకు అందిన చెత్త తినికడుపు నింపుకుంటుంది. మిత్రులకూగురువులకూ, భృత్యులకూ, ఆపదలో ఉన్న వారికీఉపకరించని జీవితం ఏమి జీవితంఒక ఎముక దొరికితే, దానితోకడుపు నిండక పోయినాకుక్క సంతృప్తి చెందుతుంది. తోక ఆడిస్తూ, నోరు తెరిచి, వెల్లికిలాపడి తిండి కోసంప్రాధేయ పడే జంతువును చూసిమనం ఎలా హర్షించగలం? ఏనుగు అలా కాదు; అది ఆత్మాభిమానంగలది. ఎంతో బతిమాలితేనే గానిఏమీ తినదు. సింహం తన పంజాకు అందుబాటులోఉన్న నక్కను కూడా కొట్టదుఅది మదపుటేనుగును మాత్రమే చంపుతుంది. చంపటంలో కూడా ప్రకృతి ధర్మం ఉంటుంది. అలాంటప్పుడు జీవించటంలో ఇంకింతఉండవచ్చు? చిన్న గుంట త్వరగా నిండుతుంది. అలాగే హీనులు కొద్ది ఆర్జనతో తృప్తిపడతారు. మంచి చెడ్డలకూ, ఉచ్చ నీచాలకూతేడా లేకపోయినా; సంస్కారం సంపాదించినమనం విధిని ధిక్కరించకపశు ప్రవృత్తితో తృప్తి చెందినా; మానవులు మానవమృగాలుగాఉండిపోతారే తప్ప వారికీజంతువులకూ తేడా ఎమిటి?"
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
కాని, ఇందులో మన కర్తవ్యం ప్రసక్తం ఏమున్నది? కర్తవ్య నిర్వహణకు మనం సింహంకింద కొలువు చెయ్యటం లేదు గదా!” అన్నది కరటకం.
పిచ్చివాడా, ఉద్యోగాలు ఉంటాయిఊడుతాయి. కర్తవ్యం మటుకు ఎల్లప్పుడూ ఉంటుంది. అర్హులకు పదవుల అవకాశం లేకపోదు. అనర్హులే త్వరగా తమ పదవులను కోల్పోతారు. క్రియకు గౌరవాగౌరవాలు మన అర్హతను బట్టి కలుగుతాయి. రాయిని కొండ మీదికిఎక్కించటం ఎంతో కష్టం, కిందికి దొర్లించటం చాలా లేలిక. అలాగే గౌరవ మర్యాదలుసంపాదించటం శ్రమతో కూడిన పని కుక్షింభరులైన చవటలుగా ఉండిపోవటానికిఏ శ్రమ అవసరం లేదు అన్నది దమనకం
సరి, ఇంతకూ నీ ఉద్దేశం ఎమిటి? మన ఏలికఅయిన సింహాన్ని ఎమి అడుగుదామనుకుంటున్నావు? '' దానికి ఎం చెప్పాలనుకుంటున్నావు? అని కరటకం అడిగింది
మన ఏలిక దేన్నో చూసిగాని, ఏదో వినిగానిభయపడినట్టున్నది. దాని భయం చూసి, దాని భృత్యులైన మిగిలిన మృగాలూ భయపడ్డాయి. ఏలికకు ఏం చెయ్యటానికీ పాలుబోకుండాఉన్నది, అన్నది కరటకం
థైర్యంగల వారికి ప్రమాద భయంఉండదు. రాజుకు హితమైనది అడగకపోయినాచెప్పటం పౌరుడి ధర్మం. అదీ గాక రాజుగారిమన్ననలు పొందగోరే వాళ్ళు రాజుకుసన్నిహితంగా ఉండాలి. రాజుకు సన్నిహితుడైమసలేవాడు, రాజుగారి తత్వం మిగిలినవారికన్నా సులభంగా గ్రహిస్తాడుఅన్నదిదమనకం.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
సరే, నీ కంత పట్టుదలగా ఉంటేవెళ్ళుకానిజాగ్రత్తగా ఉండు సుమా. మనఇద్దరి అదృష్టమూనీ విజయం మీద ఆధారపడి ఉన్నది, అన్నది కరటకం
దమనకంతన అన్నకు నమస్కారం చేసి పింగళకం వద్దకువెళ్ళింది
పింగళకందమనకాన్ని చూసి, '“దాన్నినా దగ్గిరికి రానివ్వండి. అదినా పాత భృత్యుడికొడుకు, అని తన అనుచరులతోఅన్నది. దమనకం సింహం సన్నిధికివచ్చి, సింహానికి నమస్కరించి, సింహం అనుమతితో కూర్చున్నది
కులాసాగాఉన్నావా ఇంత కాలం నాకుఅసలు కనపడలేదెం ఇప్పుడు రావటానికి కారణమేమిటి?'' అని పింగళకం అడిగింది.
 ఎలికపిలవనంపకపోయినా, రావటం నా ధర్మమని తోచింది. నావంటి అల్పుడి వల్ల కూడాప్రయోజనం ఉంటుందితరతరాలుగాతమను కొలిచిన వాళ్ళం కావటం చేత మంచికాలంలోనూ, కష్టకాలంలోనూ మాకు తమరినిఅనుసరించటం విధాయరకం. “నన్ను ఇంత కాలం ఎందుకు చూడరాలేదు? ' అని తమరుఅడిగారు. మీ అభిమానానికి కృతజ్ఞతలుఅయినా, నన్ను తమరు తమమంత్రి వర్గంలో చేర్పారా? ఆలోచనకు రమ్మని పిలిచారా? భృత్యులలో అర్హులెవరో, అనర్హులెవరో యజమానిగ్రహించనప్పుడు అర్హులైనవారు యజమానులకుదూరంగా ఉండిపోతారుఅన్నదిదమనకం,
నక్కా, ఇంతకూ నువ్వు చెప్పదలిచిన దేమిటి? ' అన్నది పింగళకం. కాస్త చిరాగ్గా. “నక్కననినన్ను తమరు చిన్నచూపు చూడవద్దు. మేలైనపట్టు, పురుగుల నుంచి వస్తుంది. రాతి నుంచి బంగారం వస్తుందికర్రనుంచి అగ్ని వస్తుంది. దీనినిబట్టి జన్మలోఎమీ లేదు, గుణం ప్రధానంఅని తెలుస్తుంది. అందుచేత నన్ను తమరు హీనంగాచూడవద్దు. నేను విశ్వాసపాత్రుణ్ణిదూరంగాఉన్నప్పటికీ ప్రభువుల మేలు కోరెవాణ్డీ. ఇతరులలాగా స్వలాభం చూసుకునేవాణ్ణి కాను, అన్నది దమనకం
నాకుతెలియదా? ఇవాళ నీ రాకకు కారణంఎమిటో చెప్పు, ' అన్నది పింగళకం ఆత్రుతగా.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,
“'క్షమిస్తానంటేనేనొక ముఖ్య విషయం తమతోచర్చించాలి. ప్రభువులవారు నీరు తాగటానికినది వద్దకు వెళ్ళి, అంతలోనే తాగకుండాఎందుకు తిరిగి వచ్చారు?” అని దమనకంఅడిగింది మెల్లగా
తన భయం గురించి నక్కకు తెలియనివ్వటంమంచిది కాదని, "ప్రత్యేకించి కారణంఏమీ లేదు. తాగబుద్ది కాలేదు తిరిగివచ్చేశాను, అన్నది పింగళకం.
చెప్పకూడనిరహస్యమైతే పోనియ్యండిఅన్నివిషయాలూ అందరితోనూ చెప్పదగినవి కావు, అన్నది దమనకం
దమనకంబుద్ధి సూక్ష్మతలో గురి కుదిరిపింగళకం, ““మన అరణ్యంలోకి ఎదో ఒక భయంకరమైనమృగం వచ్చింది. దాని రంకే మహాభయంకరం! అలాంటి భయంకరమైన ధ్వనినినేను మునిపేప్పుడు విని ఉండలేదుఅందువల్లనేను అరణ్యాన్ని విడిచిపెట్టి పోదామనుకుంటున్నాను, అన్నది.
అదేమిటి! ఏలిన వారు ధ్వనికే భయపడుతున్నారా? మీ వంటి వారి నోటినుంచి అలాంటిమాట రావడం విడ్డూరంగా ఉందిఅదీగాకధ్వనులన్ని ప్రమాదం కలిగించవుఉరుములువింటాం. తుపాను ధ్వని వింటాంకానిఇవి మనకు కీడు చేయవు. ధైర్యశాలి దేనికీభయపడడు, విధికి కూడా జడియడుమీరు, ధైర్యంగా ఉండండి. మిరు విన్నరంకినులక్ష్యపెట్టకంది. అవునూ, మీరు రణదుందుభికథ వినలేదా? ' అన్నది దమనకం
ఏమిటాకథ?” అని పింగళం అడిగిందిదమనకంఇలా చెప్పంది:
ఆకలిగొన్న ఒక నక్క ఆహారంకోసం వెతుకుతూయుద్ధభూమికి వెళ్ళుంది. అక్కడ దానికొకభయంకరమైన ధ్వని వినవచ్చిందినక్కభయపడి, “చచ్చానురా, దేవుడా! ' అనుకునివెనక్కు తిరిగి పరిగెత్తింది. మళ్ళీ ధైర్యంకూడదీసుకుని తీరా చూస్తే ఒకచెట్టుకిందకొమ్మకు ఒక రణదుందుఖి కట్టిఉన్నదిగాలికికొమ్మలు కదిలి, దాన్ని కొట్టటం చేత భయంకరధ్వని వస్తున్నది. దాని నిండా మాంసంఉంటుంది. తినవచ్చుననుకుని ఆ నక్కదాన్ని ఒక పక్క నుంచికొరికి రంధ్రం చేసింది. s
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,

కాని దుందుభిలో కొయ్యాచర్మమూతప్ప నక్కకు ఏమి కనిపించలేదుదమనకం కథ చెప్పి, “కేవలంధ్వనులను బట్టి ఏమి నిర్ణయించరాదు,” భయపడకూడదుఅన్నది(ఇంకా ఉంది)