సయ్యద్‌ వంశము Sayyid Dynasty

TSStudies

సయ్యద్‌ వంశము(1415-51):

ఖిజిర్‌ఖాన్‌(ఇబ్నెమాలిక్‌ సులేమాన్‌) తాను మహ్మద్‌ ప్రవక్త సంతతికి చెందినవాడినని ప్రకటించుకున్నాడు.
ఇతని బిరుదులు-రాయత్‌-ఇ-అలా, మన్సద్‌-ఇ-ఆలీ.
ఇతని తర్వాత సయ్యద్‌ వంశ పాలకులు
1) ముబారక్‌ షా(1421-34)
2) మొహ్మద్‌ షా (1434-45)
3) అల్లావుద్దీన్‌ ఆలమ్‌షా (1445-51)
ముబారక్‌ షా కాలంలో యహ్య-బిన్‌-అహ్మద్‌ సర్హింది  “తారీఖ్‌-ఇ- ముబారక్‌షాహీ” అనే పుస్తకాన్ని రచించాడు.
అల్లాఉద్దీన్‌ ఆలంషా రాజ్యాన్ని బహలుల్‌ లోడీకు త్యజించి బదౌన్‌కు వెళ్ళిపోయాడు. ఇతను1478లో మరణించాడు.


లోడీ వంశము (1451-1526):

లోడీ వంశస్థాపకుడు - బహలుల్‌ లోడీ

బహలూల్‌ లోడీ (1451-89):

Medieval Indian History in telugu,Medieval Indian History notes in telugu,Medieval Indian History study material in telugu,Medieval History in telugu,Medieval History notes in telugu,ts studies,tsstudies,ts study circle,indian history in telugu,tspsc indian history notes in telugu,tspsc study material in telugu,tspsc history notes in telugu,History of Medieval India,Islamic Invasion and Occupation of India,మధ్యయుగ భారతీయ చరిత్ర,అరబ్బుల దండయాత్ర,తురుష్కుల దండయాత్ర,మహమ్మద్‌ ఘోరీ దండయాత్ర,ముస్లిముల దండయాత్ర,founder of Sayyid Dynasty,Sayyid Dynasty founder,history of Sayyid Dynasty in telugu,Sayyid Dynasty history in telugu,founder of Lodi dynasty,Lodi dynasty founder,history of Lodi dynasty in telugu,Lodi dynasty history in telugu,list of kings of Lodi dynasty in telugu,Lodi dynasty notes in telugu,Lodi dynasty study material in telugu,Lodi dynasty indian history,indian history Lodi dynasty in telugu
ఇతను కూడా బహలూల్‌లోడీ జౌన్‌వూర్‌ను ఆక్రమించాడు (1483-84).
(జౌన్‌పూర్‌ను సిరాజ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌/ తూర్పు యొక్క కిరీటం అంటారు. దీనిని షర్కీ వంశము పాలించింది)
ఇతని కాలంలో అహ్మద్‌ యాద్‌గార్‌ 'తారిఖ్‌-ఇ-సుల్తానా ఆష్టానా' అనే పుస్తకాన్ని రచించాడు.
ఇతని తర్వాత పాలకుడు -సికిందర్‌ లోడీ

సికిందర్‌ లోడీ (1489-1517):
ఇతను లోడీ వంశంలో అతి గొప్పవాడు.
ఇతని అసలు పేరు - నిజాంఖాన్‌ లేదా నిజాంషా
ఇతను 1504లో ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. ఆగ్రాలో ఇటుకల కోటను నిర్మించాడు.
1506లో రాజధానిని ఆగ్రాకు మార్చాడు.
ఢిల్లీలో లోడీ గార్డెన్స్‌ను ఏర్పాటు చేశాడు
ఇతను ఒక గొప్పకవి.
పర్షియా భాషలో అనేక కవిత్వములను రచించాడు.
ఇతని కలం పేరు - నాంద్‌పూమే యొక్క గుల్‌రుఖ్‌ (Golrukh of Nomdephume)
ఇతని కాలంలో ఒక సంస్కృత వైద్యశాస్త్ర గ్రంథం పర్షియాలోకి అనువాదించబడింది.
అబుల్‌ ఫజల్‌ ప్రకారం ఇతనికాలంలోనే కబీర్‌ ఉండేవాడు.
ఇతను భూమి కొలతలో గజ్‌-ఇ-సికందరీ అనే విధానమును ప్రవేశపెట్టాడు.
ఫిరోజ్‌ తుగ్గక్‌ వలెనే యితడు కూడా “ఉలేమాలి ప్రభావంతో విగ్రహాలను నాశనం చేసి, వారిపై  “జిజియా”, తీర్ధయాత్ర పన్నును విధించాడు.
ఇతని తర్వాత పాలకుడు - ఇబ్రహీంఖాన్‌ లోడీ

ఇబ్రహీంఖాన్ లోడీ:
1526లో బాబర్‌ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇటబ్రహీంఖాన్‌ లోడీని ఓడించి ఢిల్లీపై మొగలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
లోడీల కాలంలో ఇక్తా పదం బదులు పరగణ, సర్కార్‌ అనే పదాలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయి.
ఈ క్రింది ఢిల్లీ సుల్తానుల తల్లులు హిందువులు.
1) ఖుస్రోఖాన్‌ (ఖిల్జీల చివరి పాలకుడు)
2) గియాజుద్దీన్‌ తుగ్లక్‌ (తుగ్లక్‌ వంశ స్థాపకుడు)
3) ఫిరోజ్‌ షా తుగ్లక్‌
4) సికందర్‌ లోడీ
ఢిల్లీ సుల్తానుల కాలంలో కవులు, చరిత్రకారులు:
ఆల్బెరూనీ : తారిక్‌-ఇ-హింద్‌ (దీనిని ఆంగ్లంలో అనువదించిన వాడు సచావో)
ఉత్భి : తారిక్‌-ఇ-యమినీ (మొహ్మద్‌ గజినీ చరిత్ర)
ఫిరదౌసి. : షానామా (గజినీ ప్రాంతం-గురించి వివరిస్తుంది)
పై ముగ్గురూ గజినీ కాలంలో ఉండేవారు.
హసన్‌ నిజామి. : తాజుల్‌ మజర్‌ (ఐబక్‌ కాలంలో ఉండేవాడు)
మిన్హాజ్‌-ఉల్‌-సిరాజ్‌ : తబాకత్‌ నజరీ (రజియా సుల్తానా గురించి, ఈ పుస్తకం నజీరుద్దీన్‌ మొహ్మద్‌కు అంకితం చేయబడింది). ఇతను ఇల్‌టుట్‌ మిష్‌ కాలంలో ఉండేవాడు
ఇబన్‌ బటుటా : ఇతను మొరాకో దేశానికి చెందినవాడు.
ఇతను 1333లో మహ్మద్‌బిన్‌ తుగ్గక్‌ ఆస్థానాన్ని సందర్శించాడు.
మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఇతన్ని ఢిల్లీ యొక్క కాజీ (న్యాయమూర్తిగా) నియమించాడు.
1342లో బటూటాను తన రాయబారిగా చైనాకు పంపాడు.
బటూటా సఫర్‌ నామా, రివ్లాద్‌ అనే పుస్తకాలు రచించాడు.
అమీర్‌ ఖుస్రో:
ఇతని అసలు పేరు - హసన్
ఇతని బిరుదు - భారతదేశ రామచిలుక
ఇతన్ని నాయక్‌ అని కూడా అంటారు
ఇతను ఏడుగురు ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నారు (బాల్బన్‌ నుండి గియాజుద్దీన్‌ వరకు).
ఇతను ఒక గొప్పకవి, చరిత్రకారుడు, సంగీతకారుడు.
ఇతని పుస్తకాలు
1) ఖజరా ఉస్‌-సదిస్‌(కైకూబాద్‌ కోరిక మేరకు రాశాడు)
2) తారిక్‌-ఇ-అలై (అల్లావుద్దీన్‌ ఖిల్జీ గురించి తెలుపుతుంది)
3) ఆపష్కీ (కిజిర్‌ఖాన్‌-దేవల్‌రాణి ప్రేమాయణం)
4) నూషిఫర్‌ (ముబారక్‌ ఖిల్టీ గురించి, భారతదేశం గొప్పతనం గురించి ఇందులో పేర్కొన్నాడు)
5) తుగ్లక్‌ నామా (ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ గురించి)
ఇతను ఇండియాలో సితార్‌, తబలాను ప్రవేశపెట్టాడు.
ఇతను అనేక రాగాలను రచించాడు
ఉదా॥ గోరా, ఐమన్‌, సారంగి
ఇండియాలో కవ్వాలీని ప్రవేశపెట్టాడు.

జియావుద్దీన్‌ బరౌనీ(ఫిరోజ్‌ తుగ్లక్‌ కాలం):
1) ఫత్వా-ఇ-జహంగరీ
2) తాజూకీ-ఇ-ఫిరోజ్‌షాహీ
షంషీ-సిరాజ్‌-ఆఫీఫ్‌ (ఫిరోజ్‌ తుగ్లక్‌ చరిత్రకారుడు):
తాజూకీ-ఇ-ఫిరోజ్‌ షాహీ
ఇసామీ: ఫుతుహస్‌ సలాతిన్‌ (బహమనీ ఆస్థానంలో) (ఇండియన్‌ షానామా అని అంటారు)
అబుబకర్‌: చాచ్‌నామ
జియానక్షబి: తూతినామ, రతిరహస్య, సుఖసప్తాసి. ఇతను కోక్‌ శాస్త్రాన్ని పర్షియాలోకి అనువదించాడు.

ఢిల్లీ సుల్తానుల కాలంలో అభివృద్ధి చెందిన కళలు:
గుమ్మటం
కమాను
దూళం
ప్రవేశ ద్వారంపై ఉన్న రాయి
ద్వంద్వ గుమ్మటం (లోడీ వంశ కాలంలో)

ఢిల్లీ సులానుల పాలన:
సుల్తాన్‌కు సహాయపడే మంత్రుల్లో ముఖ్యుడు “వజీర్‌ లేదా వకీల్‌. ఇతను ప్రధానమంత్రి. అంతేకాకుండా ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరిస్తాడు.
వలీ లేదా ముక్తి - రాష్ట్ర ప్రభుత్వాధిపతి
ఖాజీ - న్యాయాధిపతి
పరగణ/ కసా - అనేక గ్రామల కలయిక
దేశంలోని పరిశత్రమలన్నింటిలో చేనేత పరిశ్రమ ముఖ్యమైంది. చేనేత వస్త్రాల ఉత్పత్తికి గుజరాత్‌, బెంగాల్ సుప్రసిద్ధమైన కేంద్రాలు.
రాజ్యాన్ని 'తరఫ్‌లు' లేక 'రాష్ట్రాలుగా విభజించారు. ప్రతి రాష్ట్రానికి రాజప్రతినిధి(తరఫ్‌దార్‌) ఉండేవాడు.