సాళువ వంశం:
సాళువ వంశస్థులు తెలుగువారు
వీరు మొదట చాళుక్య రాజధాని అయిన కళ్యాణ కటకంలో ఉండేవారు.
సాళువ నరసింహరాయ:
ఇతని ఆస్థానంలోని రాజనాధ ధిండిముడు సాళువభ్యుదయంను రచించాడు.
పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం, జైమినీ భారతంను రచించాడు.
తాళ్లపాక అన్నమయ్య ఇతని సమకాలికుడు. అన్నమయ్య వెంకటేశ్వరస్వామిపై 32000 ల కీర్తనలు రచించాడు.
తిమ్మక్క సుభద్ర కళ్యాణం, 'రుక్మిణి కళ్యాణం'ను రచించింది.
ఇతను అరబ్ అశ్వకదారులను తన సైన్యంలో చేర్చుకున్నాడు.
ఇతని మరణానంతరం అతని కుమారుడు ఇమ్మడి నరసింహరాయలు విజయనగర పాలకుడయ్యాడు.
ఇమ్మడి నరసింహరాయలు కాలంలోనే 1498 మేలో వాస్కోడగామా కాలికట్ చేరుకున్నాడు.
తర్వాత కాలంలో పోర్చుగీస్ వారు విజయనగర పాలకులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు.
నరస నాయకుడు(సేనాని) ఇమ్మడి నరసింహరాయలును పెనుగొండ కోటలో బంధించాడు.
నరస నాయకుని పెద్ద కుమారుడైన వీరనరసింహరాయలు పెనుగొండ కోటలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయను హత్య చేసి, సాళువ వంశాన్ని అంతం చేసి విజయనగరంపై తుళువ వంశాన్ని స్థాపించాడు. దీన్నే 2వ ఆక్రమణ అంటారు.
తుళువ వంశం:
వీరు మైసూర్‌లోని తుళువనాడు ప్రాంతానికి చెందినవారు.
తుళువ నరస నాయకునికి ఇద్దరు భార్యలు.
1) తిప్పాంబ -కుమారుడు వీరనరసింహరాయలు
2) నాగాంబ - కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు
వీరనరసింహ(1505-09):
ఇతను పోర్చుగీసు వారితో మంచి సంబంధాలను ఏర్చ్పరుచుకున్నాడు.
పోర్చుగీసు నుండి గుర్రాలను దిగుమతి చేసుకునేవాడు.
1509 ఉమ్మత్తూరుపై దాడి చేసిన సందర్భంలో ఇతను మరణించాడు.
తెలుగు జంట కవులైన నంది మల్లయ్య, గంట సింగన్నలు “వరాహపురాణం రచించి నరస నాయకునికి అంకితం చేశారు.