శ్రీకృష్ణదేవరాయలు (1509-30):
ఇతని బిరుదులు - యవనరాజ్య స్థాపనాచార్య , ఆంధ్రభోజ, దక్షిణాపధస్వామి, సాహిత్య సమరాంగ సార్వభౌమ, గజపతి గజకూట పాకవేన
ఇతను 1509 ఆగస్టు 8వ తేదీన సింహాసనాన్ని అధిష్టించాడు.
లూయి ఫ్రెజర్ ఈ పట్టాభిషేక ఉత్సవంలో పాల్గొన్నాడు.
ఇతను ప్రతాపరుద్ర గజపతితో అనేక యుద్దాలు చేసాడు. చివరికి ప్రతాపరుద్ర గజపతి తన పరాజయాన్ని అంగీకరించి తన కుమార్తె అన్నపూర్ణను శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేసాడు. కట్నంగా బాలకృష్ణ విగ్రహాన్ని ఇచ్చాడు. ఇది హంపిలోని కృష్ణస్వామి దేవాలయంలో ప్రతిష్టించబడింది.
శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ అదిల్‌షాను కోవెలకొండ యుద్ధంలో ఓడించాడు.
శ్రీకృష్ణదేవరాయలు గుల్చర్గాపై దాడి చేసి బరీద్ మాలిక్‌ను ఓడించి బీదర్ కోటలో బందీగా వున్న నిజమైన బహమని సుల్తాన్ మహ్మద్‌షాను రాజుని చేసి, యవ్వనరాజ్య స్థాపనాచార్య అనే బిరుదును పొందాడు.
శ్రీకృష్ణదేవరాయలు 1510 లో పోర్చుగీస్ గవర్నర్ అల్బూక్వెర్క్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకొని గుర్రాలను దిగుమతి చేసుకునేవిధంగా మరియు విజయనగర సైనికులకు ఫిరంగి దళాల్లో శిక్షణ పొందేవిధంగా చర్యలు తీసుకొన్నాడు.
ఈ ఒప్పందాన్ని కుదిర్చిన పోర్చుగీస్ అధికారి -ప్రేయర్ లూయీస్
1510లో అల్బూక్వెర్క్ గోవాను ఆక్రమించడంలో శ్రీకృష్ణదేవరాయలు సహకరించాడు.
శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారికి భట్కల్ ఓడరేవును ఇచ్చాడు.
పోర్చుగీస్ సేనాని క్రిస్టోసిరిఫోగారిదో శ్రీకృష్ణదేవరాయల ఆస్టానానికి వచ్చి సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు.
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సాహిత్యం అత్యధికంగా అభివృద్ధి చెందింది.
శ్రీకృష్ణదేవరాయలు కాలాన్ని తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం అంటారు.
ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు.
1) అల్లసాని పెద్దన(ఆంధ్రకవితా పితామహుడు) -మనుచరిత్ర
2) నంది తిమ్మన(ముక్కు తిమ్మన) -పారిజాతాపహరణం
8) దూర్జటి -శ్రీకాళహస్తీశ్వర మహత్యం
4) తెనాలి రామకృష్ణ(వికటకవి) - పాండురంగ మహత్యం, గటికాచల మహత్యం
5) అయ్యలరాజు రామభద్రుడు - రామాభ్యుదయం
6) పింగళి సూరన్న - కళాపూర్ణోదయం
7) రామరాజ భూషణుడు(భట్టుమూర్తి) -వసుచరిత్ర
8) మాదయ్యగారి మల్లన్న - రాజశేఖర చరిత్ర
శ్రీకృష్ణదేవరాయలు భువన విజయంలో సాహితీ గోష్టులను నిర్వహించేవాడు.
ఇతని గురువు - తాతాచార్యులు / వ్యాసరాయలు
శ్రీకృష్ణదేవరాయలు అనేక పుస్తకాలను రచించాడు.
1) ఆముక్తమాల్యద,విష్ణుచిత్తీయం(తెలుగులో)
2) జాంబవతీ పరిణయం(సంస్కృతంలో)
3) ఉషా పరిణయం(సంస్కృతంలో)
ఆముక్తమాల్యద తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరస్వామికి అంకితం చేయబడింది.
శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను తన కుమార్తె మోహనాంగిచే రాయించాడు.
దేవరాయలు యొక్క ఆస్థాన విద్యాంసుడు
లక్ష్మినాథుడు సంగీత సూర్యోదయం అనే గ్రంథాన్ని రచించాడు.
రాయలు యొక్క ఇద్దరు భార్యలు చిన్నమ్మదేవి, తిరుమలాదేవి శిల్పాలు తిరుమలలో చెక్కబడ్డాయి.
తిరుమలాంబిక అచ్యుతరాయలు కాలంలో వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించింది.
శ్రీకృష్ణదేవ రాయలు హంపి లో (హజారా) హజారా దేవాలయం లేదా రామచంద్రాలయం, కృష్ణస్వామి దేవాలయం, విఠలాస్వామి దేవాలయంను నిర్మించాడు.
తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం నాగలా పురం అనే పట్టణాన్ని నిర్మించాడు.
హంపిలో పద్మ మహల్ లేదా లోటస్ మహల్ ఇండో-ఇస్లామిక్ శైలిలో, ఇండో-అరబిక్ శైలిలో నిర్మించబడింది.
ఇతను విశాఖపట్టణంలోని సింహాచలం వరాహ నరసింహస్వామికి వజ్రపు హారంను సమర్పించాడు.
ఇతను మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయానికి భూమిని దానం చేశాడు.
ఈ దేవాలయం యొక్క శిఖరం ఆంధ్రప్రదేశ్‌లోనే అతి ఎత్తైన శిఖరంగా పరిగణించబడుతుంది.
ఇతను పురంధర్‌దాస్ మఠాన్ని నిర్మించాడు.
1526లో తన కుమారుడు తిరుమల దేవరాయ తన వారసుడిగా ప్రకటించబడ్డాడు. కానీ ఇతను హత్యకు గురయ్యాడు.
దీనికి శ్రీకృష్ణదేవరాయలు ప్రధాని తిమ్మరసు లేదా అప్పాజీని బాధ్యుడిని చేస్తూ కొంతమంది కుట్ర పన్ని ఇతని రెండు కళ్లు తీయించేశారు. తర్వాత అనారోగ్యానికి గురై శ్రీకృష్ణదేవరాయలు 1580లో మరణించాడు. _
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయనగరంను సందర్శించిన ముఖ్యమైన పోర్చుగీస్ యాత్రికులు బార్బోజా, డొమింగోపేస్.