అచ్యుత దేవరాయలు:
ఇతని సేనాని - అలియ రామరాయ
ఇతని కాలంలో పోర్చుగీస్ యాత్రికుడైన న్యూనిజ్ విజయనగరాన్ని సందర్శించాడు.
అచ్యుత సింహాసనాన్ని అధిష్టించుటకు అలియ రామరాయతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది.
దీని ప్రకారం అచ్యుత రాజు అవ్వగా, అలియరామరాయ సేనాని అయ్యాడు.
అచ్యుత దేవరాయ తిరుపతి, శ్రీకాళహస్తిలో పట్టాభిషేకం చేసుకున్నాడు.
ఇతని తర్వాత పాలకుడు సదాశివరాయలు.
సదాశివ తుళువ వంశంలో చివరివాడు
ఇతని సేనాని కూడా అలియ రామరాయ
ఇతను అలియ రామరాయ చేతిలో ఒక కీలుబొమ్మ
అలియ రామరాయ స్వతంత్ర పాలన చేస్తూ బహమనీ రాజ్యంలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవాడు. వారిమధ్య విభేదాలు సృష్టించి “విభజించి పాలించు” అనే విధానాన్ని పాటించాడు.
ఒకసారి విజయనగర సైన్యం అహ్మద్‌నగర్‌పై దాడి చేసినపుడు అనేకమంది పౌరులు హతమార్చబడి అనేకమందిపై అనేక ఆకృత్యాలు జరపబడ్డాయి.
దీన్ని ఆగ్రహించిన బహమనీ రాజ్యాలు తమ వ్యక్తిగత వివాదాలను పక్కనపెట్టి విజయనగరంకు వ్యతిరేకంగా ఒక కూటమిలా ఏర్పడ్డాయి.
బహమనీ రాజ్యాల్లో ఒక్క బీరార్ మినహాయించి మిగతా 4 రాజ్యాలు విజయనగరంకు వ్యతిరేకంగా కూటమిలో పాల్గొన్నాయి.
అప్పటి బహమనీ రాజ్య పాలకులు
అప్పటి బహమనీ రాజ్య పాలకులు
1) గోల్కొండ - ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2) అహ్మద్‌నగర్ - హుస్సేన్ నిజాంషా
3) బీదర్ - బుల్యాద్ బరీద్ షా
4) బీజాపూర్ - ఆలీ అదిల్‌షా (అదిల్‌షా
5) బీరార్ - దర్యా ఇమాద్‌షా (ఇతను కూటమిలో పాల్గొనలేదు)
రాక్షస తంగడి/బన్నిహట్టి/తల్లికోట యుద్ధం (1565 జనవరి 28):
రాక్షస తంగడి/బన్నిహట్టి/తల్లికోట యుద్ధం (1565 జనవరి 28):
బహమనీ రాజ్యాల కూటమి విజయనగరంపై యుద్ధం ప్రకటించి తల్లికోట అనే ప్రాంతం వద్ద విజయనగరం సైన్యాన్ని ఎదుర్కొంది.
ఈ యుద్ధం అప్పుడు అలియ రామరాయ వయస్సు 90 సంవత్సరాలు.
ఈ యుద్ధంలో అలియ రామరాయ యొక్క ఇద్దరు సోదరులు తిరు మలరాయ, వెంకటాద్రి కూడా పాల్గొన్నారు.
ఈ యుద్ధం కృష్ణానది, మలివాహరి నదుల మధ్య జరిగింది.
ఈ యుద్ధంలో విజయనగరం సైన్యం ఓడించబడింది.
అహ్మద్‌నగర్ పాలకుడైన హుస్సేన్ నిజాం షా అలియ రామరాయను హతమార్చాడు. విజయనగరం పూర్తిగా ధ్వంసం చేయబడింది.
ఈ యుద్ధం గూర్చి సూయల్ తన 'ద ఫర్గాటెన్ ఎంపైర్' అనే పుస్తకంలో వివరించాడు.
ఈ యుద్దాన్ని భోగాపురం యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్దాన్ని నీలకంఠశాస్రి రాక్షస తంగడి యుద్ధమని పేర్కొన్నాడు.
ఈ యుద్దాన్ని హెచ్.కె. షేర్వాని బన్నిహట్టి యుద్ధమని పేర్కొన్నాడు.
ఈ యుద్ధంలో విజయనగర సైన్యం పరాజయం పాలవ్వడంతో తిరుమలరాయలు సదాశివరాయలను తీసుకొని పెనుగొండకు పారిపోయాడు.
1570లో తిరుమలరాయలు పెనుగొండలో ఆరవీటి వంశాన్ని స్థాపించి మరలా విజయనగర వైభవాన్ని పునరుద్ధరించుటకు ప్రయత్నించాడు.