సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం-3

TSStudies
ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ :
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
బిరుదులు - పండిత్‌, Champion of woman Reformer in India, విద్యాసాగర్‌
వార్తాపత్రిక - సోమ్‌ప్రకాష్‌ (బెంగాలీ భాషలో)
పుస్తకం - బహు వివాహ్‌ బెంగాలీ ప్రాథమిక వాచకం (దీన్ని బెంగాల్‌ పాఠశాలలో ఇప్పటికీ బోధిస్తున్నారు.)
సంస్థ - బెథూన్‌ పాఠశాల (1849లో కలకత్తాలో బాలికల విద్య కొరకు స్థాపించాడు. ఫిలిప్‌ డ్రింక్‌ వాటర్‌ సహకారంతో)
విద్యాసాగర్‌ అత్యధికంగా వితంతు పునర్వివాహం కొరకు పోరాటం చేశాడు.
ఇతని పోరాట ఫలితంగా అప్పటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టాడు.
J. P గ్రాంట్‌ ఈ చట్ట బిల్లును ప్రవేశపెట్టాడు.
1856 డిసెంబర్‌ 7న విద్యాసాగర్‌ మొట్టమొదటి అధికారిక వితంతు పునర్వివాహమును కలకత్తాలో జరిపించాడు (శ్రీచంద్‌ విద్యారత్న & కాళీమతిదేవి). 
దక్షిణ భారతదేశంలో వీరేశలింగం 1881 డిసెంబర్‌ 11న మొదటి అధికారిక వితంతు పునర్వివాహంను రాజమండ్రిలో జరిపించాడు.(గోకులపాటి శ్రీరాములు, సీతమ్మ)
బాల్య వివావాములను, బహు భార్యత్వమును ఖండించాడు.
ఇతను చిన్నప్పటి నుండి అనేక సమస్యలను ఎదుర్కొని విద్యాభ్యాసం చేశాడు.
35 పాఠశాలలకు ఇన్‌స్పెక్టర్‌గా నియమించబడ్డాడు.
ఈ 35 పాఠశాలల్లో 12 పాఠశాలలను తన సొంత ఖర్చుతో నడిపించాడు.
బెంగాల్‌ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డాడు.
వెనుకబడిన తరగతుల వారిని, మహిళలను విద్యాభ్యాసం కొరకు ఈ కళాశాలకు ఆహ్వానించాడు.

దయానంద సరస్వతి :
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
అసలు పేరు - మూల శంకర్‌
బిరుదు : స్వామి
పుస్తకాలు:
- సత్యార్థ ప్రకాష్‌(వేదాలపై దయా నంద రాసిన భాష్యం)
- వేద భూమిక
- వేద రహస్య
- వేద భాష్య
సంస్థ - ఆర్యసమాజ్‌ (1875-బొంబాయి), గో రక్షణ సంఘం (1882)
దయానంద సరస్వతి గుజరాత్‌లోని ఖతియావాడ్‌లో జన్మించినప్పటికీ తన ఉద్యమాన్ని పంజాబ్‌, లాహోర్‌లలో చేశాడు.
ఇతను చిన్నతనం నుంచి విగ్రహారాధనను ఖండించాడు. ఇతను 12-13 సం॥ల పాటు దేశసంచారం చేశాడు.
శృంగేరిలో పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించాడు.
మధురలో స్వామి విరజానంద యొక్క శిష్యుడిగా మారాడు. విరజానంద సలహా మేరకు మూలశంకర్‌ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నాడు.
హిందూ మతం ప్రచారం లేకపోవడం కారణంగా హిందూ మతంలో అనేక మూఢ విశ్వాసాలు పుట్టుకొచ్చాయని పేర్కొని శుద్ధమైన హిందూ మతంను ప్రచారం చేయుటకు 1875లో బొంబాయిలో ఆర్య సమాజంను స్థాపించాడు. తర్వాత లాహోర్‌, ఇతర ప్రాంతాలలో అనేక శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి.
హిందూ మతంను శుద్ధి చేయుటకు హిందూ మతం నుండి వేరొక మతంలో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలో చేర్చించుటకై ఆర్య సమాజంలో  శుద్ధి మరియు సంఘాట/సంఘం అనే ఉద్యమాలు ఆరంభమయ్యాయి.
వీటిని మదన్‌మోహన్‌ మాలవ్య ఉత్తరప్రదేశ్‌లో, లాలాలజపతిరాయ్‌ పంజాబ్‌, లాహోర్‌లలో వ్యాప్తి చేశారు.
దయానంద సరస్వతి మరణానంతరం విద్యాభివృద్ధి కొరకై ఆర్య సమాజ్‌ దయానంద ఆంగ్లో వేదిక్‌(DAV) అనే పాఠశాలలను స్థాపించినది.
దయానంద ఆంగ్లో వేదిక్‌ పాఠశాలలో వివాదాలు వచ్చి రెండుగా చీలిపోయింది.
1) గురుకుల పాఠశాలలు -హరిద్వార్‌లో గురుదత్త స్థాపించాడు. దీనిని అభివృద్ధి చేసినది లాలామున్నీరామ్‌. ఇతనిని స్వామి శ్రద్ధానంద అంటారు.
2) ఆధునిక పాఠశాలలు - లాహోర్‌లో లాలా  హన్సరాజ్‌ స్థాపించాడు.
దయానంద ఆర్యులు టిబెట్‌ నుంచి వచ్చారని పేర్కొన్నాడు.
పరిపాలనకు సంబంధించి 'స్వరాజ్య' అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు.
ఆంగ్లేయుల మంచి పరిపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైనది అని పేర్కొన్నాడు.
హిందీ జాతీయ భాషగా ప్రకటించబడాలని పేర్కొన్న మొట్టమొదటి వ్యక్తి దయానంద సరస్వతి.