దేవేంద్రనాథ్‌ఠాగూర్ :
బిరుదు - బ్రహ్మర్షి (ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మర్షి బిరుదు రఘుపతి వెంకటరత్నంకు కలదు)
పత్రిక - తత్త్వబోధిని
పత్రిక (దీనిలో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్‌మిశ్రాలు వ్యాసాలు రాశారు)
సంస్థ - తత్వ బోధిని సభ (1839)
రాజారామ్మోహన్‌రాయ్ యొక్క ప్రధాన శిష్యుల్లో దేవేంద్రనాథ్‌ఠాగూర్ ఒకడు.
రాజారామ్మోహన్‌రాయ్ మరణానంతరం దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ్‌నకు నేతృత్వం వహించాడు.
బెంగాల్‌లో అనేక బెంగాలీ పాఠశాలలను ఏర్పాటు చేశాడు.
కేశవచంద్రసేన్ :
వార్తాపత్రికలు - సులభ్ సమాచార్, New Dispensation
సంస్థలు - Indian Reform Association, నవవిధాన్‌సభ (New Dispensation), -సంఘత్‌సభ(Believers Association)
కేశవ్‌చంద్రసేన్ వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
పురోహితుల ఆధిపత్యంను, బాల్య వివాహములను ఖండించాడు.
బ్రహ్మసమాజ్‌లో చేరి అనేక వితంతు వివాహాలను జరిపించాడు.
బ్రహ్మసమాజంలో దేవేంద్రనాథ్ ఠాగూర్‌తో కేశవ చంద్రసేన్‌కు వివాదాలు ఏర్పడుటచే బ్రహ్మసమాజ్
రెండుగా చీలిపోయింది (1866).
1) ఆది బ్రహ్మసమాజ్ (దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో)
2) బ్రహ్మసమాజ్ ఆఫ్ ఇండియా (కేశవ చంద్రసేన్ నేతృత్వంలో)
1878లో కేశవ చంద్రసేన్ తన 13 సంవత్సరాల కూతురిని కూచ్‌బీవోర్ రాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహంలో పురోహితులను ఆహ్వానించి సంప్రదాయబద్దంగా వివాహం జరిపించాడు. దీని కారణంగా (బ్రహ్మసమాజ్ ఆఫ్ ఇండియా రెండుగా చీలిపోయింది.
1) నియో బ్రహ్మసమాజ్ (కేశవ చంద్రసేన్ నేతృత్వంలో)
2) సాధారణ (బ్రహ్మనమాజ్ (శివానంద శాస్త్రి, ఆనందమోహన్‌బోస్ నేతృత్వంలో)
అంటరానితనంను నివారించుటకు సాధారణ బ్రహ్మసమాజ్ “దాస్ ఆశ్రమంను స్థాపించినది.
కేశవ చంద్రసేన్ తర్వాత కాలంలో మహిళలకు ఉన్నత విద్య ఉండకూడదని, సమాజంలో పరదా విధానం పూర్తిగా తొలగించకూడదని పేర్కొన్నాడు.
హెన్రీ వివియన్ డిరాజియో (1809-31):
బిరుదు - భారతదేశ మొట్టమొదటి జాతీయ కవి
వార్తాపత్రిక - ఈస్ట్ ఇండియాన్, - హెస్పరెస్
ఇతను ఒక గొప్పకవి. భారతదేశంపై అనేక కవితలను రచించాడు.
బెంగాల్‌లో యువ బెంగాల్ ఉద్యమంను ప్రారంభించాడు. కొన్ని లక్షల మంది బెంగాలీలు ఈ ఉద్యమంలో చేరి బెంగాల్ సంస్కృతిని వ్యాప్తి చేశారు. సురేంద్రనాథ్ బెనర్జీ డిరాజియాను బెంగాల్ సంస్కృతిని వ్యాప్తి చేసినందుకుగాను వారిని అత్యధికంగా కొనియాడాడు.
1881లో తన హేతుబద్ధత కారణంగా బెంగాల్ హిందూ కళాశాల నుంచి తొలగించబడ్డాడు. అదే సంవత్సరంలో కలరాతో మరణించాడు.
ఇతని ముఖ్య శిష్యుడు - ఖాసీ ప్రసాద్ ఘోష్
డిరాజియో (ఫ్రెంచి విప్లవం, బ్రిటీష్ రచయితలు అయిన జే.ఎస్.మిల్, జాన్‌లాకీ మొదలగు వారియొక్క రచనలతో ప్రభావితుడైనాడు.