సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం-5

TSStudies

దివ్యజ్ఞాన సమాజం(థియోసాఫికల్‌ సొసైటీ):

Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
దీనిని 1875లో హెచ్‌.పి.బ్లాపట్స్కి, హెచ్‌.ఎస్‌. ఆల్కాట్‌ లు అమెరికాలోని న్యూయార్క్‌లో స్థాపించారు.
దీనిని ప్రధానంగా మూడు ఉద్ధేశాలతో స్థాపించారు
1) విశ్వమానవ సౌభ్రాతృత్వం
2) అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం. ఈ మతాల తత్వంను తెలుసుకొనుట కొరకు వాటిని అధ్యయనం చేయాలి.
3) ప్రకృతిలో, మానవునిలోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి.
దివ్యజ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యము 'మానవసేవ'. ప్రాచీన మతాలైన హిందూ మతం, బౌద్ధ మతం, జుడాయిజం మతాల యొక్క సమ్మేళనం కొరకు ఈ సమాజం ప్రయత్నించినది.
1879లో దీని ప్రధాన కేంద్రం బొంబాయికి మార్చబడినది.
కానీ బొంబాయిలో ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ప్రధాన కేంద్రం మద్రాన్‌ దగ్గర అడయార్‌కు మార్చబడినది.
హెచ్‌.పి.బ్లాపట్స్కి మరణానంతరం కల్నల్‌ హెచ్‌.ఎస్‌. ఆల్మాట్‌ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు అయ్యాడు.
హెచ్‌.పి.బ్లాపట్స్కి యొక్క “రహస్య సిద్ధాంతం” అనే వ్యాసంను చదివిన అనిబిసెంట్‌ ప్రభావితమై 1889లో దివ్యజ్ఞాన సమాజంలో చేరినది.
1907లో అనిబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అయింది.
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
ఈమె వితంతు వివాహాలను. ప్రోత్సహించింది. 
అనిబిసెంట్‌ మద్రాస్  సంఘ సంస్కరణ సభను ఏర్పాటు చేసినది.
అనిబిసెంట్‌ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించినది.
విద్యాభివృద్ధి కొరకై బెనారస్‌ హిందూ పాఠశాలను, మదనపల్లిలో జాతీయ కళాశాలను(బి.టి. కళాశాల), ఆర్కాట్‌లో ఆర్కాట్‌ పంచమ పాఠశాలను స్టాపించినది.
అనిబిసెంట్‌ వార్తాపత్రికలు - న్యూఇండియా,  కామన్‌వీల్‌
అనిబిసెంట్‌ అసలు పేరు - అనీవుడ్‌
ఈమె ఐర్లాండ్‌కు చెందిన మహిళ
అనిబిసెంట్‌ 1914లో అఖిల భారత కాంగ్రెస్‌లో చేరింది.
1916లో ఐర్లాండ్‌ తరహాలో భారతదేశంలో హోంరూల్‌ ఉద్యమాన్ని మద్రాస్‌ నుండి ప్రారంభించింది. (దీనికంటే ముందు తిలక్‌ హోంరూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని మహారాష్ట్రలో ప్రారంభించాడు. తర్వాత తిలక్‌ యొక్క హోంరూల్‌ లీగ్‌ ఉద్యమం అనిబిసెంట్‌ యొక్క ఆల్‌ ఇండియా హోంరూల్‌ ఉద్యమంలో విలీనం అయినది)
ఆల్‌ ఇండియా హోంరూల్‌ లీగ్‌ యొక్క మొట్టమొదటి కార్యదర్శి -జార్జ్  అరుండేల్‌
1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మితవాదులు, అతివాదులు, ముస్లింలీగ్‌ విలీనం అవడంలో తిలక్‌, జిన్నాలతో పాటు అనిబిసెంట్‌ కూడా కీలకపాత్ర పోషించింది.
1917లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్‌కు అనిబిసెంట్‌ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనది.
లూసిఫేర్‌ లేదా లిజాఫేర్‌ జర్నల్‌కు ఈమె ఎడిటర్‌.
అనిబెసెంట్‌ స్థాపించిన బెనారస్‌ హిందూ పాఠశాల మదన్మోహన్  మాలవ్యచే బెనారన్‌ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చబడినది.
అనిబిసెంట్‌ యొక్కదత్తత కుమారుడు - జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతం - గురువు లేకుండా సత్యంను సాధించుట (Endevour alone in search of truth)
జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం- At the feet of the master

బంకించంద్ర ఛటర్జీ :
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
బంకించంద్ర ఛటర్జీ తన “ఆనంద్‌ మఠ్‌(1882)” ద్వారా భారతదేశ గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ పుస్తకంలోనే భారత జాతీయ గేయం “వందేమాతరం” సంస్కృతంలో రచించబడినది.
వందేమాతరంను ఆంగ్లంలోకి అనువదించినవారు - అరబిందో ఘోష్‌ (1909 కర్మయోగిన్‌ అనే గ్రంథంలో)
ఆనందమఠ్‌లో సన్యాసి తిరుగుబాటు గురించి పేర్కోనబడినది.
ఇతను 'బంగదర్శన్'” అనే జర్నల్‌ను కటక్‌ నుంచి ప్రచురించాడు. భారతదేశ సంస్కృతిని ప్రజలకు తెలియజేశాడు.

వేద సమాజ్‌:
కె.సి. సేన్‌ కృషి ఫలితంగా మద్రాస్‌లో సుబ్బరాయలుశెట్టి 1864 “వేద సమాజ్‌” అనే ఆస్తిక సభను స్థాపించారు. తర్వాత కాలంలో ఇది దక్షిణ భారత బ్రహ్మ సమాజ్‌గా మారిపోయింది.
తత్వబోదిని పత్రికను ప్రచురించింది.

ప్రార్థనా సమాజ్‌:
ప్రార్ధన సమాజ్‌, బ్రహ్మ సమాజ్‌ వల్ల ఉత్తేజితమైంది.
1867లో డా॥ ఆత్మారాం పాండురంగ నాయకత్వంలో బొంబాయిలో ఈ సమాజ్‌ ప్రారంభమైనది. కేశవచంద్రసేన్‌ ప్రోత్సాహం వల్ల ఈ సంస్థ ఉద్భవించింది.
ప్రార్ధనా సమాజ్‌ సభ్యులు ఆస్తికవాదులు
దీనిలో ముఖ్య సభ్యులు ఎం.జి.రనడే, ఆర్‌. జి.భండార్కర్‌, నారాయణ్‌ గణేష్‌ చంద్రవాడ్కర్‌, పండిత రమాబాయి సరస్వతి.
ఇది “సుబోధ” పత్రికను ప్రారంభించింది.

పండిత రమాబాయి సరస్వతి:
స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను వ్యతికేరించడానికి పుణేలో “మహిళా ఆర్య సమాజ్‌”ను స్థాపించింది.
బొంబాయిలో 'శారదా నదన్' అనే వితంతు గృహాన్ని, పాఠశాలను ప్రారంభించింది. కరువు బాధితులను ఆదుకోవడానికి “ముక్తి సదన్‌”ను ప్రారంభించింది.
రమాభాయ్‌ రనడే పూన సేవాసదన్‌ స్థాపించింది.

డి.కె.కార్వే:
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
ఈయన గొవ్ప విద్యావేత్త.
1893లో వితంతు వివాహం చేసుకున్నాడు.
1896లో “హిందూ వితంతు భవనం లేదా విధువ భవన్‌ (Hindu Widow Home)ను ప్రారంభించాడు.
1916లో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు.
సాంఘిక సంస్కరణోద్యమానికి కార్వే చేసిన విశిష్ట సేవకు ప్రభుత్వం “భారతరత్న” బిరుదుతో సత్కరించింది.

ఎం. జి.రనడే:
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq
ఇతన్ని మహారాష్ట్ర సోక్రటీస్‌ అంటారు.
ఇతను ఇండియన్‌ నేషనల్‌ సోషల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశాడు.
మహారాష్ట్రలో సాంఘికోద్యమానికి మూల పురుషుడు రనడే.
ఇతను 'సార్వజనికసభ పత్రికలో సామాజిక, ఆర్థిక సమస్యల గురించి వ్యాసాలు రాశాడు.
1887లో మద్రాసులో ముఖ్యమైన సాంఘిక సమస్యలను చర్చించడానికి, భారత జాతీయ సామాజిక సమావేశాన్ని ప్రారంభించాడు.
రనడే “పరిశుద్ధి' ఉద్యమాన్ని ప్రారంభించి ఇతర మతస్తులను చేర్చుకోవడమేగాక, నాట్యవృత్తిని, ఖర్చులతో కూడిన ఆడంబర వివాహ వేడుకలను వ్యతిరేకించాడు.
కార్వేతో కలసి రనడే “స్తీ పునర్వివాహ” ఉద్యమాన్ని నడిపాడు. ఈ ఉద్యమం మరో ఆశయం వితంతువులకు ఉపాధ్యాయినులుగా, నర్సులుగా శిక్షణ ఇచ్చి వారికి స్వయం శక్తిని కల్పించడం.

ఇతర అంశాలు :
మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మొదటి హిందూ వితంతు గ్రాడ్యుయేట్‌ -సుబ్బలక్ష్మి
మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మొదటి. మహిళా ఎమ్మెల్యే-ముత్తులక్ష్మీరెడ్డి
1910లో అలహాబాద్‌లో భారత స్త్రీ మహామండల్‌ను సరళాదేవి చౌదురాణి ఏర్పాటు చేశారు.
1893లో కలకత్తాలో మహాకాళీ పాఠశాలను గంగూబాయ్‌ ఏర్పాటు చేశారు.
దొరోతి (ఐరిష్‌ మహిళ) ఉమెన్స్‌ ఇండియా అసోసియేషన్‌ ద్వారా మహిళలకు ఓటుహక్కు డిమాండ్‌ చేశారు.