కుల ఉద్యమాలు:
19వ శతాబ్దం ఆరంభంలో అగ్ర కులాలు, నిమ్న కులాల వారి మధ్య వ్యత్యాసం అధికంగా ఉండేది.
అగ్ర కులాల అధిపత్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఇవి ప్రధానంగా
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) కేరళలో జరిగాయి.
గుజరాత్:
గుజరాత్‌లో హాలీ విధానం ఉండేది (వంశ పారంపర్యంగా బానిసత్వంలో ఉండుట).
గుజరాత్‌లో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి - కర్సన్‌దాస్ ముల్జీ
ఇతడు సత్యప్రకాష్ అనే పత్రిక ద్వారా అగ్ర కులాల అధిపత్యాన్ని వ్యతిరేకించాడు.
మహారాష్ట్ర:
మహారాష్ట్రలో అగ్ర కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి -బాలశాస్త్రి జంబేకర్
బాలశాస్తి జంబేకర్ “దర్చణ్' అను జర్నల్‌ను నడిపాడు.
మహారాష్ట్రలో కొంతమంది విద్యార్థులు నిమ్న కులాలను ఏకం చేయుటకై స్టూడెంట్ లిటరరీ సొసైటీని ఏర్పాటు చేశారు.
దీనిలో
1) మరాఠా జ్ఞాన ప్రకాశ మండలి
2) గుజరాతీ జ్ఞాన ప్రకాశ మండలి ఉన్నాయి.
తడోబా పాండురంగ తర్మడ్ పరమహంస మండలి/యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
పరమహంస మండలిలో అతి ముఖ్యమైన సభ్యులు -గోపాల హరిదేశ్ ముఖ్ (లోకహితవాది)
జ్యోతిబాపూలే :
జ్యోతిబాపూలే పూలు అమ్ముకునే మాలి అనే తెగకు చెందినవాడు.
జ్యోతిబాపూలే బిరుదు -మహాత్మ(1888లో ఇవ్వబడింది)
జ్యోతిబాపూలే నవల - గులాంగిరి (1872)
1873లో సత్యశోధక సమాజ్‌ను ఏర్పాటు చేసి వెనకబడ్డ తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేశాడు.
పూలే 1884లో "దీనబంధు సర్వజనిక్ సభ" స్థాపించాడు.
ఈయన రెండు విమర్శనాత్మక గ్రంథాలు రచించాడు.
1. సర్వజ్ఞిక్ సత్యధర్మ పుస్తక్
2. గులాంగిరి
ఇషారా అనే పుస్తకంలో నిమ్న కులాల వారి హక్కులను తెలియజేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయిపూలేతో కలిసి పూణే వద్ద వెనకబడిన వర్గాలవారి కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు.
ఈ పాఠశాల నిర్వహణకు డబ్బులు సమకూర్చినవారు - జగన్నాథ్‌శంకర్ సేఠ్, ధావ్ ధాజీ.