భారతదేశ ఆక్రమణ-1

TSStudies

భారతదేశ ఆక్రమణ (British Conquest of India)

భారతదేశాన్ని (బ్రిటిష్ వారు వివిధ దశలలో ఆక్రమించారు). 
మొదటిగా కర్టాటక ‌ తర్వాత వరుసగా బెంగాల్‌, మైసూర్‌, మరాఠా, సింధ్‌, పంజాబ్‌, అవధ్‌లను ఆక్రమించారు.

కర్ణాటక అక్రమణ (లేదా) అంగ్లో-కర్ణాటక యుద్ధాలు:
భారతదేశంలో బ్రిటీష్‌ మరియు ఫ్రెంచి వారి మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో-కర్ణాటక యుద్ధాలు అంటారు. మొత్తం మూడు ఆంగ్లో-కర్ణాటక‌ యుద్దాలు జరిగాయి.
కర్ణాటక్‌ రాజ్యమును స్థాపించినది - సాదతుల్లాఖాన్‌
British Conquest of India,how british British Conquest of India,history of carnatic wars,causes to carnatic wars,why carnatic wars,carnatic wars history in telugu,indian history carnatic wars in telugu,carnatic wars indian history in telugu,first carnatic war history in telugu,second carnatic wars history in telugu,third carnatic war history in telugu,indian history carnatic wars study material in telugu,indian history carnatic wars notes in telugu,first carnatic war between,second carnatic war between,third carnatic war between,
ఇతని తర్వాత నవాబు -దోస్త్‌ అలీ అన్వరుద్దీన్‌ కాలంలో మొదటి, రెండవ కర్గాటక‌ యుద్దాలు జరిగాయి.

1) మొదటి ఆంగ్లో-కర్ణాటక‌ యుద్ధం (1746-48) (History of The First Carnatic War):
ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా భారతదేశంలో బ్రిటీష్‌ మరియు ఫ్రెంచి వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక‌ యుద్ధం ఆరంభమైంది.
భారతదేశంలో బ్రిటీష్‌ జనరల్‌ అయిన బార్నెట్‌ ఫ్రెంచి నౌకలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశాడు.
భారతదేశంలో ఫ్రెంచి జనరల్‌ అయిన డూప్లే మారిషస్‌లో ఉన్న బోర్జినాయిస్‌/ బోర్డేను భారత్‌కు పిలిపించి, ఇద్దరూ
కలిసి బ్రిటీషు స్థావరం అయిన మద్రాసును ఆక్రమించారు.
కానీ బోర్డినాయిస్‌ లంచం తీసుకొని మద్రాసును బ్రిటీష్‌ వారికి అప్పగించి తిరిగి మారిషస్‌కు వెళ్లిపోయాడు.
అపుడు డూప్లే కర్టాటక్‌ నవాబు అన్వరుద్దీన్‌ సహాయంతో మద్రాసును తిరిగి ఆక్రమించాడు.
దీనికంటే ముందు డూప్లే అన్వరుద్దీన్‌ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం మద్రాసును ఆక్రమించిన తర్వాత దీనిని అన్వరుద్దీన్‌ ఆధీనంలో ఉంచాలి. కానీ డూప్లే మద్రాసును అన్వరుద్దీన్‌ ఆధీనంలో ఉంచుటకు నిరాకరించాడు.
దీంతో అన్వరుద్దీన్‌ తన డిమాండ్లను పూర్తి చేయ వలసిందిగా హెచ్చరిస్తూ 10 వేల మంది సైనికులను మద్రాసు వైపుకు పంపాడు.
డూప్తే కెప్టెన్‌ పారడైజ్‌ నేతృత్వంలో 500 మంది సైనికులను కర్టాటక‌ వైపుకు పంపాడు. 
వీరిద్దరి మధ్య(1748లో) సెయింట్‌ థోమ్‌ లేదా అడయార్‌(నది) యుద్ధం జరిగింది. అన్వరుద్దీన్‌ సైనికులు ఓడించబడ్డారు.
1748లో ఆక్సిలా చాపెల్‌ (ఫ్రాన్స్‌లోని పట్టణం) ఒప్పందం ప్రకారం యూరప్‌లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైంది.
దీంతో భారతదేశంలో కూడా మొదటి ఆంగ్లో కర్టాటక యుద్ధం అంతమైంది. ఈ ఒప్పందం ప్రకారం మద్రాసు తిరిగి బ్రిటీష్‌ వారికి ఇవ్వబడినది.