ఇతర తీవ్రవాద సంస్థలు:
కలకత్తా అనుశీలన సమితి
దీనిలో అత్యధికంగా మహిళలు పాల్గొన్నారు.
డాకా అనుశీలన సమితి
దీనిని స్థాపించినది పులిని బీహారీదాస్
ఇతర సంస్థలు
కమగార్ హితవర్ధక్ సభ-ఎస్.కె.బోస్
స్వదేశీ సేవక్ హోమ్-జి.డి.కుమార్
హిందూ మేళా-రాజానారయణ్, నవగోపాల్‌మిత్ర
రెండవ దశ (1919-1981) :
1919 జలియన్‌వాలాబాగ్ సంఘటన తర్వాత భారతదేశంలో విప్లవాత్మక తీవ్రవాదం తీవ్ర రూపమును దాల్చింది.
1924 - సచిన్ సన్యాల్, జోగేష్ ఛటర్జీ, రాంప్రసాద్ బిస్మిల్, సబీంద్రనాథ్ భక్షిలు కాన్పూర్ వద్ద HRAను స్థాపించారు.
1925 ఆగస్టు 9 (కాకోరికుట్ర)- HRA సభ్యులు అయిన రామ్‌ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర సహారి, రోషన్‌సింగ్, అష్ఫకుల్లాలు బ్రిటీష్ రైల్వే సొమ్మును కాకోరి ప్రాంతం (ఉత్తరప్రదేశ్) వద్ద దోచుకున్నారు. తర్వాత నలుగురూ అరెస్ట్ చేయబడి ఉరి తీయబడ్డారు.
రామ్‌ప్రసాద్ ఉరికంబంపై “బ్రిటీష్ సామ్రాజ్య పతనాన్ని నేను కోరుతున్నాను” అని పలికాడు. ఇతను మెయిన్‌పురి కుట్ర(1918)లో కూడా పాల్గొన్నాడు.
రామ్‌ప్రసాద్ బిస్మిల్ How Did America Win the Freedom అనే పుస్తకాన్ని రచించారు.
రామ్‌ప్రసాద్ బిస్మిల్ A Message to Countrymen అనే వ్యాసాన్ని రచించాడు.
ఇతని కలం పేర్లు -రామ్, బిస్మిల్, అగ్యాత్
ఇతను మైత్రివేది, శివాజీ సమితి అనే సంస్థలను స్థాపించాడు.
ఇతని ప్రాణ స్నేహితుడు అష్ఫకుల్లాఖాన్. అష్ఫకుల్లాఖాన్ కూడా ఒక కవి
ఇతని కలం పేర్లు : హస్రత్, వార్సి.
భారతదేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన ఒక నిస్వార్ధ పోరాటవీరుడు.
ఇతను భగత్‌సింగ్‌కు స్ఫూర్తినిచ్చాడు. ఉరికంబాన్ని లేదా చావుని తన భార్యగా స్వీకరించాడు.
ఇతను ఉరిశిక్ష అమలుపరిచేముందు ఇలా పలికాడు 'నేను భారతదేశాన్ని స్వేచ్భారాజ్యంగా చేయవలెనని తలచాను. ఈ ప్రయత్నం నా చావుతో ముగియదు'.
1927 డిసెంబర్ 19న రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లాఖాన్‌లను ఒకేరోజున ఒకే సమయంలో వేర్వేరు జైళ్లలో ఉరితీశారు. రాంప్రసాద్ బిస్మిల్‌ను గోరఖ్‌పూర్‌లో, అష్ఫకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్‌లో ఉరితీశారు.
1928-లాహోర్ కుట్ర: భగత్‌సింగ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్‌లు లాహోర్ ఏసీపీ శాందర్స్‌ను హత్య చేశారు.

1) ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు
2) పబ్లిక్ సేప్టీ బిల్లు
ఈ బిల్లులు కమ్యూనిస్టులను అణచివేయుటకు, స్ప్రాట్ అనే బ్రిటీష్ కమ్యూనిస్టు నాయకుడిని భారతదేశం నుండి ఇంగ్లండ్‌కు పంపుటకొరకు ప్రవేశపెట్టబడ్డాయి.
1929: జతిన్‌దాస్/జతీంద్రనాథ్ దాస్ లాహోర్ జైలు సంస్కరణల కొరకు 62 రోజులు నిరాహారదీక్ష చేసి 63వ రోజున మరణించారు.
1930: సూర్యాసేన్ చిట్టగాంగ్‌లో బ్రిటీషుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇతను 10-15 సం॥ల పిల్లలతోఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే సైనిక దళాన్ని ఏర్పాటుచేశాడు. ఈ దళంతో చిటగాంగ్‌లోని ఆయుధ కర్మాగారం, ఆఫీసర్స్ క్లబ్, టెలికమ్యూనికేషన్స్ స్థావరాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దీనినే చిట్టగాంగ్ కుట్ర అంటారు. బ్రిటీష్ వారు ఈ తిరుగుబాటును అతి దారుణంగా అణచివేసి సూర్యాసేన్‌ను ఉరి తీశారు. ఇతనికి సహకరించిన మహిళ ప్రీతీలత వడ్దేదార్.
1931 ఫిబ్రవరి 27: అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్ వద్ద ఆంగ్లేయులు చంద్రశేఖర్ ఆజాద్ తివారీను ముట్టడించుట కారణంగా ఆజాద్ తనకు తాను కాల్చుకుని మరణించాడు.
1931 మార్చి 28వ తేదీన భగత్‌సింగ్, రాజ్‌గురు. సుఖ్‌దేవ్‌లను ఉరి తీశారు.
చనిపోయేముందు వారు ముగ్గురు జైలు అధికారికి సంయుక్తంగా ఒక లేఖ రాస్తూ “అనతికాలంలోనే అంతిమ యుద్ధం ప్రారంభం కాగలదు. అది నిర్ణయాత్మకమైనది కాగలదు. ఈ పోరాటంలో మేము పాల్గొన్నందుకు గర్విస్తున్నాం” అని పలికారు.
భగత్‌సింగ్ రాసిన ఒక పుస్తకం - Why am I an Athiest
Philosophy of Bomb అనే పుస్తకాన్ని భగవతి చరన్‌వొహ్ర రచించాడు.
History of Hindu Chemistry ను PC రే రచించాడు.