విదేశాలలో విప్లవాత్మక తీవ్రవాదం :
శ్యామ్‌జీ కృష్ణవర్మ :
1905లో లండన్‌లో హోమ్ రూల్ సొసైటీని స్థాపించాడు. దీనిని ఇండియా హౌస్ అని కూడా అంటారు. దీని యొక్క జర్నల్ ఇండియన్ సోషియాలజిస్ట్.
దీనిలోని ముఖ్యమైన సభ్యులు - వి.డి.సావర్కర్, అజిత్‌సింగ్, లాలాహర్‌దయాళ్ మొదలైనవారు.
బ్రిటీషు వారి అణచివేత కారణంగా శ్యామ్‌జీ కృష్ణవర్మ ఇండియా హౌస్ ప్రధాన కేంద్రాన్ని లండన్ నుంచి పారిస్‌కు మార్చాడు.
మదన్‌లాల్ ధింగ్రా:
ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుటకు లండన్‌కు వచ్చాడు.
వి.డి.సావర్కర్ ప్రభావంతో 1909లో కర్జన్ విల్లీ(ఇండియా కౌన్సిల్ సలహాదారుడు)ను హత్య చేశాడు.
వి.డి.సావర్కర్ (వినాయక దామోదర్ సావర్కర్):
పుస్తకం. - భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం (మరాఠీ)
సంస్థలు - మిత్రమేళా లేదా అభినవ్‌భారత్ సొసైటీ, న్యూ ఇండియా అసోసియేషన్ (లండన్‌లో)
వి.డి.సావర్కర్ ఫెర్లూసన్ కళాశాలలో చదువుకున్నాడు. ఇతని గురువు తిలక్
లండన్‌లో ఇండియా హౌస్‌లో సభ్యుడిగా చేరి విప్లవాత్మక తీవ్రవాదం వ్యాప్తి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
1907 మే 10న 1857 తిరుగుబాటు యొక్క స్వర్ణోత్సవాలను జరపాలని నిర్ణయించాడు. ఈ సందర్భంగా మరాఠీ భాషలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అనే పుస్తకాన్ని రచించాడు.
1909 నాసిక్ కుట్రలో వి.డి.సావర్కర్ ప్రధాన నిందితుడిగా పేర్కొనబడి లండన్‌లో అరెస్ట్ చేయబడ్డాడు.
వివి.డి.సావర్కర్ నౌకలో భారత్‌కు పంపబడుచున్నప్పుడు ఇతను ఫ్రాన్స్ తీరం వద్ద సముద్రంలో దూకి ఫ్రాన్స్ తీరం చేరుకున్నాడు. కానీ ఫ్రెంచ్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేసి బ్రిటీష్‌కు అప్పగించారు. తర్వాత ఇతన్ని పూర్తిగా గొలుసులతో బంధించి భారత్ తీసుకువచ్చారు.
నాసిక్ కుట్రపై విచారణ జరిగి వి.డి.సావర్కర్కు యావజ్జీవ శిక్ష విధించబడింది.
1911 నుంచి 1924 మధ్యకాలంలో వి.డి.సావర్కర్ అండమాన్ జైలులో నిర్భంధించబడినాడు.
1924లో క్షమాభిక్ష కోరుతూ వి.డి.సావర్కర్ Mercy Petition పెట్టుకోవడంతో విడుదల చేయబడ్డాడు.
మహారాష్ట్రలో స్థిరపడి ఆల్ ఇండియా హిందూ మహాసభలో సభ్యుడిగా చేరాడు.
1938లో వి.డి.సావర్కర్ ఆల్ ఇండియా హిందూ మహాసభ యొక్క అధ్యక్షుడయ్యాడు.
హిందూవర్గ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నాడు. హిందూ రాష్ట్ర అనే సిద్ధాంతాన్ని పేర్కొన్నాడు.
ఇతను గాంధీ హత్య కేసులో 20వ ముద్దాయిగా విచారణ ఎదుర్కొన్నాడు. తర్వాత విడుదల చేయబడ్డాడు.
మేడమ్ బికాజీ కామా:
ఈమె దాదాబాయ్ నౌరోజీ వద్ద కార్యదర్శిగా పని చేసింది.
పారిన్ ఇండియా సొసైటీని స్థాపించింది.
వందేమాతరం అనే పత్రిక ప్రచురించింది.
1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్‌లో భారతదేశ స్వాతంత్ర్య పతాకమును ఎగురవేసింది. దీనిలోని రంగులు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు.
ఈమె తల్వార్ పత్రికను మదన్‌లాల్ డింగ్రాకు మద్ధతుగా ప్రచురించింది. తర్వాత వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ తల్వార్ అనే పత్రికకు సంపాదకీయం చేశాడు. (ఇతను సరోజినినాయుడు సోదరుడు)