కుల ఉద్యమాలు-4

TSStudies
ముస్లింలలో సంస్కరణలు :
సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌:
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcqముస్లింల సంస్కరణ కోనం పోరాటం చేసిన మొదటి వ్యక్తి - సర్‌సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌
ముస్లింల అభివృద్ధికి బ్రిటీష్‌ వారి మద్దతు అవసరం అని భావించి బ్రిటీష్‌కు మద్దతుగా ఈ క్రింది వ్యాసాన్ని ప్రచురించాడు.
“లాయల్‌ మహ్మదీయన్స్‌ ఆఫ్  ఇండియా” (అస్బబ్‌-ఇ-భగావత్‌-ఇ-హింద్‌)
ఇతని వార్తాపత్రిక - 'తహరిక్‌-ఇ-ఆఖ్లక్‌”
1857 తిరుగుబాటుకు సంబంధించి “ద కాజస్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూటిని” అనే పుస్తకాన్ని రచించాడు.
ఈ పుస్తకంలో 1857 తిరుగుబాటును “సిపాయిల తిరుగుబాటు” అని పేర్కొన్నాడు.
ముస్లింల అభివృద్ధికి విద్య అతి ముఖ్యమైనదని భావించి అలీఘడ్‌లో మహ్మదీయన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ పాఠశాలను 1875లో ఏర్పాటు చేశారు. దీని మొదటి పేరు మద్రసతుల్‌ ఉలూమ్‌ ముసల్మానన్‌-ఇ-హింద్‌.
తర్వాత ఇది కళాశాలగా మారింది.
ఆ తర్వాత 1920లో అలీఘడ్‌ విశ్వవిద్యాలయంగా మారింది. దీని మొదటి వైస్‌ చాన్సలర్‌ సుల్తాన్‌ షాజహాన్‌ బేగం.
అలీఘడ్‌లో ఇతను ప్రారంభించిన ఈ పాఠశాల విద్యను అలీఘడ్‌ ఉద్యమం అని పేర్కొంటారు.
ఇతని స్వీయ చరిత్రను రాసినవాడు -విలియం గ్రహమ్‌

మహ్మద్ ఇక్బల్:
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcqవిద్యాభివృద్ధి ద్వారా ముస్లిం లలో సంస్కరణలు తీసుకొని రావచ్చు అని భావించాడు.
“సారే జహాసె అచ్చా” అనే గీతాన్ని రచించాడు. దీనికి స్వరకల్పన చేసినది విష్ణు దిగంబర పలుష్కార్‌(శాస్త్రి)
పంజాబ్‌, కాశ్మీర్‌, సింధు, బెలూచిస్తాన్‌లను కలిపి ఒక ముస్లిం దేశం ఏర్పాటు చేయాలని మొదటిసారిగా పేర్కొన్నాడు.
“పాకిస్థాన్  అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినవాడు “రహమత్‌ అలీ” (లండన్‌ నుంచి)


అహమ్మదీయ ఉద్యమం:
స్థాపకుడు - మీర్జా గులాం అహమ్మద్‌
ఇస్లాం మత రక్షకునిగా ఆర్య సమాజం మరియు క్రైస్తవ మత ప్రచారకుల దాడుల నుంచి ఇస్లాం మతాన్ని రక్షించేందుకు ఈ ఉద్యమం ప్రారంభించాడు.
బ్రహ్మ సమాజం వలె మహ్మదీయ మతం కూడా మానవాళికి చెందిన విశ్వమానవ సూత్రాల పై ఆధారపడి ఉంది.
ఈ ఉద్యమ ఫలితంగా భారతీయ ముస్లింలలో పాశ్చాత్య ఉదార విద్యావ్యాప్తి చెందడమేగాక, మహమ్మదీయుల సేవకై అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించడం జరిగింది.

వహాబి వంశం:
మన దేశంలో వహాబి ఉద్యమ స్థాపకుడు రాయబరేలికి చెందిన ఫకీర్‌ అహమ్మద్‌ బెరిల్వీ(సయ్యద్‌ అహ్మద్‌ వాహీద్‌) అరబ్బు మత సంస్కర్త అయిన అబ్బుల్‌ వహాబీ అనుచరులే వవాబీలు.
ఇస్లాం మత సంస్మరణోద్యమంగా ప్రారంభమమై చివరకు వహాబీ ఉద్యమం వ్యవసాయిక తిరుగుబాట్లుగా, సిక్కులపై
పవిత్రయుధ్ధంగా, పంజాబు ఆక్రమణ తర్వాత బ్రిటీష్‌వారిపై యుద్ధ స్వరూపం దాల్చింది.
సయ్యద్‌ అహ్మద్‌ లక్ష్యం పంజాబు నుంచి సిక్కులను, బెంగాలు నుంచి బ్రిటీష్‌వారిని తరిమివేసి, భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పున: ప్రతిష్టాపన చేయడం

అలీగర్‌ ఉద్యమం:
స్థాపకుడు - సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ఖాన్‌
మహమ్మదీయులలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఈ ఉద్యమ ప్రధాన ఆశయం. హిందూ, ముస్లింలు భారతదేశమనే అందమైన వధువుకు రెండు నేత్రాలని వర్ణించాడు.
1875లో మహమ్మదీయ ఆంగ్ష్లో-ఓరియంటల్‌
కళాశాలను అలీగర్‌లో స్థాపించాడు. హైదరాబాద్‌ ప్రధాని సాలార్‌జంగ్‌ ప్రోత్సావాంతో ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా రూపొందింది. దీని అధ్యక్షుడు బెక్‌. 1920 నాటికి ఈ కళాశాల అలీగర్‌ విశ్వవిద్యాలయంగా రూపొందింది.
ఈ ఉద్యమ ప్రభావం వలన భారతదేశంలో ముస్లింలకు ఉర్దూ జాతీయభాష అయింది.
1871లో విలియం హంటర్‌ ఇండియన్‌ ముసల్మాన్‌ అనే పుస్తకాన్ని రచించాడు.

ఇతర ముస్లిం ఉద్యమాలు:
దేవబందో ఉద్యమం-మౌలానా హుస్సేన్‌ అహ్మద్‌
దారుల్‌ ఉలేమ మద్రాస్‌ -మౌలానా కాశీం నానాతెౌవి
జమైతుల్‌ ఉలేమ-ఇ-హింద్‌ - లియాకత్‌ ఉల్లా సాహెబ్‌
అహిరార్‌ (Ahrar) ఉద్యమం -యౌంబా మొహమ్మద్‌ అలీ, అజ్మల్‌ఖాన్‌
అహ్లే హదిస్‌ - సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్‌
ఖఖ్సర్‌ -ఇనాయతుల్లా మశ్రికి

పార్శీ సంస్కరణలు :
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcqపార్శీ లలో బహు భార్యత్వం, పరదా విధానం ఉండేవి.
మహిళలకు అస్తి హక్కు ఉండేది కాదు.
క్రీ.శ.1850లో బొంబాయిలోని పార్శీలలో మత సంస్కరణోద్యమం మొదలైంది.
1851లో రెహ్నూమాయి మజ్‌దయాన్‌ సభి అనే సంఘాన్ని స్థాపించి, జొరాస్ట్రియన్‌ మతంలోని ప్రాచీన పవిత్రతను పునరుద్ధరించాలని ఈ సమావేశం పేర్కొంది.
పార్శీలు రాస్త్‌గాఫ్తర్‌ అనే వారపత్రికను ప్రారంభించారు.
నారోజీ వుర్‌దోజీ, దాదాబాయ్‌ నౌరోజీ,  ఎస్‌. ఎస్‌.బెంగాలీలు ప్రముఖ పార్శీ సంస్కర్తలు.
మలబారీ అనే పార్శీ నాయకుడు స్త్రీలు, పిల్లలు, సామాజికాభివృద్ధి కార్యక్రమం కోసం సేవాసదన్‌ను ప్రారంభించాడు.
భారత్‌లో పార్శీలు అందరికంటే ఎక్కువగా పాశ్చాత్య సభ్యతను అలవర్చుకున్న వర్గంగా రూపొందారు.
పార్శీ సంస్కరణల కొరకు “నారోజీ పెర్డోంజి”, రహ్నమాయి మజదాయసన సభను ఏర్పాటు చేశాడు.
దాదాభాయ్‌ నౌరోజీ, రుస్తుంజీ, కామ ఈ సభలో చేరి పార్శీ సంస్కరణల కొరకు పోరాటం చేశారు.
నౌరోజీ ఫెర్హుజిఫామ్‌-ఇ-జర్నల్‌ను ప్రచురించాడు.
పాడియా, టాటా మొదలగువారు ద పార్శీ అనే పత్రిక ద్వారా సంస్కరణ కొరకు ప్రయత్నించారు.