అయ్యంకాలీ:
ఇతను 1863లో అయ్యాన్ (తండ్రి), మాల (తల్లి)లకు తిరువనంతపురం సమీపంలో గల వెంగనూరు గ్రామంలో జన్మించారు.
ఇతని భార్య పేరు చెల్లమ్మ. ఇతనికి ఏడుగురు సంతానం
బిరుదులు-ఉర్‌పిళ్ళై & మూతపిళ్ళై మహాత్మ
స్థాపనలు-
1904-స్వామికల్ బ్రహ్మ నిష్ట మఠం, వెంగనూరు
1907-సాధు జన పరిపాలన సంఘం
ఇతని గురువు అయ్యావు స్వామికల్
ఇతను తన గురువు అయిన స్వామికల్ యొక్క ఉపన్యాసాలతో ప్రభావితమయ్యాడు. స్వామికల్ కుల వ్యవస్థను ఖండించాడు. దీని ద్వారా మత మార్చడిలను తగ్గించవచ్చని భావించాడు.
ఇతను అగ్ర కులాలైన నాయర్ల యొక్క ఆంక్షలను తిరస్కరించి నాయర్ల వలె దుస్తులను ధరించాడు. ఎడ్లబండి తోలాడు, నెడుమంగడ్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు.
ఇతను ప్రధానంగా విద్యను కల్పించుటకు పోరాటం చేశాడు. ట్రావెన్‌కోర్ రాజ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పులయార్ వర్గానికి చెందిన బాలబాలికలకు ప్రవేశం కల్పించడానికి డిమాండ్ చేశాడు.
ఇతని పోరాట ఫలితంగా ట్రావెన్‌కోర్ ప్రభుత్వం కేరళలోని అవర్ణాలకు(దళితులు) ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించింది
ఊరుట్టంబలం అనే గ్రామంలో పులయార్ వర్గానికి చెందిన ఒక బాలిక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించిందని స్థానిక అగ్ర కులాల వారు ఆ పాఠశాలను దహనం చేశారు.
అయినప్పటికీ మహంకాళీ చెక్కుచెదరక అవర్ణాల విద్య కొరకు అవిశ్రాంతిగా తన పోరాటాన్ని కొనసాగించారు.
అప్పట్లో కొన్ని రహదారుల్లో అవర్ణాలు నడవడానికి కూడా వీలు లేదు. అయ్యంకాలీ దీనిని ఖండించాడు. ఫలితంగా ట్రావెన్‌కోర్ ప్రభుత్వం అన్ని రహదారులను అవర్ణాలు ఉపయోగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
అప్పట్లో నాయర్ వర్గం వారు ఎజువ తెగ వారిని 12 అడుగుల దూరం ఉంచేవారు. పులయార్ వర్గం వారిని 66 అడుగుల దూరం ఉంచేవారు. దీనినే థియాండల్ అంటారు.
అందువల్లనే స్వామి వివేకానంద వెంగనూరు ప్రాంతం గురించి తెలుసుకుని దీనిని 'మ్యాడ్ హౌస్ ఆఫ్ క్యాస్ట్' అని పేర్కొన్నారు.
వైకోమ్ సత్యాగ్రహము :
దీనిని 1924లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.పి.కేశవమీనన్, టి.కె.మాధవన్ వైకోమ్‌లోని శ్రీ పార్వతీపరమేశ్వర దేవాలయంలో ప్రారంభించారు.
ఈ ఆలయ ప్రవేశ ఉద్యమానికి భారతదేశమంతటి నుంచి మద్దతు లభ్యమైంది. భారతదేశ నలుమూలల నుంచి అనేకమంది జాతలు జాతలుగా వచ్చారు.
వీటిలో అతి ముఖ్యమైన జాతా ఆత్మగౌరవ ఉద్యమ జాతా. దీనిని ఇ.వి.రామస్వామినాయకర్ (ఫెరియార్) మధురై నుంచి వైకోమ్ వరకు చేపట్టారు.
ఇ.వి.రామస్వామి నాయకర్ తమిళనాడులో లేదా మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణుల ఆధిపత్యంను ఖండించాడు.
ఇ.వి.రామస్వామి నాయకర్ 'కుడి అరసు', 'విధుతులై' అనే పత్రికలను ప్రారంభించాడు.
1917లో త్యాగరాయశెట్టి, ముదలియార్, టి.ఎం. నాయర్‌లు జస్టిస్ పార్టీని స్థాపించారు. (బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ)
జస్టిస్ పార్టీ సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థ నుంచి పుట్టింది.
ఈ సంస్థను స్థాపించినవారు త్యాగరాయశెట్టి, టి.ఎం.నాయర్, ముదలియార్
శ్రీ గురువాయూర్ ఉద్యమం :
దీనిని 1981లో కె.కేలప్పన్ (కేరళలోని రాజకీయ ఖడ్గం)శ్రీ గురువాయూర్‌లో శ్రీకృష్ణుని దేవాలయంలో ప్రారంభించాడు.
దీనికి మద్దతుగా వచ్చిన ముఖ్యమైన జాత - సుబ్రమణ్యతింబుంబు జాత. దీనిని కాలికట్ నుంచి శ్రీ గురువాయూర్ వరకు తింబుంబు చేపట్టాడు.
ఎ.కె.గోపాలన్ :
ఇతను కేరళలో 500ల కంటే ఎక్కువ సమావేశాలలో నిమ్న కులాల వారి హక్కులను తెలియజేన్తూ ప్రసంగించాడు. ప్రతీ సమావేశంలో ఇతనిపై లాఠీచార్జీ జరిగింది.