Indian Independence Movement-14

TSStudies
కమ్యూనిస్ట్‌ ఉద్యమ వ్యాప్తి క్రమము:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కమ్యూనిస్ట్‌ల వైఖరి:
1939లో రెండవ ప్రపంచ యుద్ద ప్రారంభం అయినప్పుడు కమ్యూనిస్ట్‌లు దీనిని ఒక సామ్రాజ్యవాద యుద్ధమని పేర్కొని బ్రిటీష్‌ వారికి మద్దతు చేయుటకు నిరాకరించారు.
1941 జూన్‌లో జర్మనీ రష్యాపై దాడి చేయడంతో రష్యా బ్రిటన్‌తో కలిసి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంది.
ప్రపంచంలోని కమ్యూనిస్ట్‌లు బ్రిటీష్‌ వారికి లేదా సంకీర్ణ సేనలకు మద్దతు చేయాలని రష్యా పిలుపు ఇచ్చింది.
తక్షణమే ఇండియా కమ్యూనిస్ట్‌లు రెండవ ప్రపంచ యుద్దాన్ని ప్రజాయుద్ధం అని పేర్కొని బ్రిటీష్‌ వారికి మద్దతు పలికారు.
ఈ సమయంలో కమ్యూనిస్ట్‌ల అధికారిక పత్రిక అయిన ప్రజాశక్తి కమ్యూనిస్ట్‌ సిద్దాంతాలను పెద్ద ఎత్తున ఆంధ్రాలో వ్యాప్తి చేసింది
1942 జులై 23న కమ్యూనిస్ట్‌లపై నిషేదం ఎత్తివేయబడింది. (గతంలో 1934 జులై 23న కమ్యూనిస్ట్‌ పార్టీపై నిషేదం విధించబడింది)
1942 ఆగస్ట్‌ 8న క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమయినప్పుడు బ్రిటీష్‌ వారికి సహకరించకూడదని గాంధీ పిలుపు ఇచ్చాడు
కాని కమ్యూనిస్ట్‌లు క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో 'బ్రిటీష్‌ వారికి మద్దతు పలికి జాతి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కమ్యూనిస్ట్‌లు బలహీన పడుట:
1945 డిసెంబర్‌లో కేంద్ర చట్టసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది
1946లో రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కూడా కమ్యూనిస్ట్‌ పార్టీ ఘోరపరాజయం పాలైంది
క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో జాతి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనుట వలన కమ్యూనిస్ట్‌లు ఓటమి పాలయ్యారు.
1945-46 ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత కమ్యూనిస్ట్‌ పార్టీ కేంద్ర కార్యదర్శి రణధీవ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చాడు.
ఈ సాయుధ పోరాటం ప్రధానంగా మణిపూర్‌, నాగాలాంద్‌, త్రిపుర, కేరళ తెలంగాణలలో జరిగింది.  భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొన్నాయి.
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రష్యా లేదా USSR ఇండియాతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంది.
ఇండియాలోని కమ్యూనిస్ట్‌లు తమ సాయుధ పోరాటాన్ని విరమించి భారత జాతీయ కాంగ్రెస్ తో కలిసి పనిచేయవలెనని రష్యా భారత కమ్యూనిస్ట్‌లకు పిలుపు ఇచ్చింది.
దీంతో 1951 అక్టోబర్‌ 21న భారత కమ్యూనిస్ట్‌లు తమ సాయుధ పోరాటాన్ని విరమించారు.
Contribution of Ravi Narayana Reddy in the freedom movement of India in telugu,Ravi Narayana Reddy Indian social reformer,Ravi Narayana Reddy  Indian National Congress,How The Mahatma Was Influenced by Ravi Narayana Reddy in telugu,What is the contribution of Ravi Narayana Reddy towards India's freedom struggle in telugu,What was the role of Ravi Narayana Reddy in the Indian Independence Struggle in telugu,The legacy of Ravi Narayana Reddy,Ravi Narayana Reddy was the pioneer of Indian National movement,Freedom fighter Ravi Narayana Reddy1952 ఎన్నికలలో రావినారాయణ రెడ్డి  నల్గొండ నియోజకవర్గం నుండి  ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో . పార్లమెంట్‌ కు ఎన్నికయ్యాడు.
ఈ ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణలో మరియు మద్రాస్‌ రాష్ట్రంలోని ఆంధ్రాలో కమ్యూనిస్ట్‌లు అధిక సీట్లు గెలుచుకొన్నారు.
కానీ ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్‌ పార్టీ అధిక సీట్లు గెలుచుకోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది.
తెలుగు మాట్లడే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను విలీనం చేసి విశాలాంధ్రను ఏర్పాటు చేస్తే కమ్యూనిస్ట్‌ల ప్రభుత్వమే ఏర్పడుతుందని భావించిన కమ్యూనిస్ట్‌లు విశాలాంధ్ర ఉద్యమాన్ని తీవ్రం చేశారు.
1945లోనే కమ్యూనిస్ట్‌ నాయకుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర పత్రికను స్థాపించి విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించాడు.
ఇతను విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించి విశాలాంధ్ర వలన రెండు ప్రాంతాలలోని తెలుగు వారికి కలిగే ప్రయోజనాలను వివరించాడు.

కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలక:
కొందరు కమ్యూనిస్టు నాయకులు ఐఎన్‌సితో కలసి పని చేయవలెనని భావించారు. వీరిలో ప్రముఖులు రావినారాయణరెడ్డి, ఎస్‌.ఏ.డాంగే.
కానీ పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయుటను వ్యతిరేకరించారు.
1961లో బెజవాడ సమావేశంలో కమ్యూనిస్ట్‌ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
1962లో చైనా భారతదేశంపై దాడి చేసినపుడు భారతదేశంలోని కమ్యూనిస్ట్‌లు మూడు వర్గాలుగా చీలిపోయారు
1.Nationalists :-వీరు చైనా దాడిని ఖండిచారు. వీరిలో ముఖ్యులు ఎస్‌.ఎ.డాంగే, రావినారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి, చంద్రరాజేశ్వరరావ్‌, ఎ.కె.గోపాలన్‌
2. Centernationalist - వీరు చైనా దాడిని
స్వాగతించారు. వీరిలో ముఖ్యులు
వుచ్చలవల్లి, జ్యోతిబసు, హరికిషన్‌సింగ్‌ సుర్జిల్‌, రణధీవ, బనవ వున్నయ్య. చైనా దాడిని భూస్వాములపై దాడిగా వీరు పరిగణించారు.
3.Centrists:- వీరు తటస్థంగా ఉన్నారు. వీరిలో ముఖ్యులు - అజయ్‌ఘోష్‌
1964లో కమ్యూనిస్ట్‌లు కలకత్తాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారికంగా రెండుగా చీలిపోయింది
1.CPI Nationalists (రష్యా సిద్దాంతాల ప్రభావం వీరిపై ఉంటుంది.) దీని కార్యదర్శి - S. A. డాంగే
2. సిపిఎం. (చైనా సిద్దాంతాల ప్రభావం వీరిపై ఉంటుంది.) దీని కార్యదర్శి- పుచ్చలపల్లి సుందరయ్య