Indian Independence Movement-15

TSStudies
నక్సలైట్‌ ఉద్యమం (వామపక్ష తీవ్రవాదం లేదా మావోయిస్ట్‌ ఉద్యమం)
1967లో చారు మజుందార్‌, కానూసన్యాల్‌లు ఆర్థిక సాంఘిక సమానత్వాన్ని వివ్లవ పోరాటం ద్వారా సాధించుటకు పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరి గ్రామం నుండి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు.
నక్సల్‌బరి. గ్రామం నుండి ఈ ఉద్యమం ప్రారంభం అగుటచే దీనికి నక్సలైట్‌ ఉద్యమం అని పేరు వచ్చింది.
ఇదే సమయంలో శ్రీకాకుళంలోని భూస్వాములు మరియు వడ్డీ వ్యాపారులు ప్రజలను అనేక విధాలుగా పీడించేవారు.
శ్రీకాకుళంలో ఒక ఉపాధ్యాయుడు అయిన వెంపటాపు సత్యనారాయణ (సత్యం) అహింసా మార్గంలో ప్రజల తరపున భూస్వాములు మరియు వడ్డీ వ్యాపారులకు వ్యతిరేఖంగా ఉద్యమాన్ని చేపట్టాడు.
ఇదే సమయంలో చారూ మజుందార్‌, కానూసన్యాల్‌ శ్రీకాకుళంలో అనేక సార్లు పర్యటించి వర్గ శత్రు నిర్మూలన అనే సిద్దాంతాన్ని వ్యాప్తి చేశారు.  ఫలితంగా 1969లో శ్రీకాకుళంలో నక్సలైట్‌ ఉద్యమం ప్రవేశించింది
1969లో లెనిన్‌ యొక్క 99వ జయంతి సందర్భంగా కాసూసన్యాల్‌, కలకత్తాలో CPI(ML)ను స్థాపించారు.
కేవలం విప్లవ పోరాటం ద్వారా మాత్రమే ఆర్థిక, సాంఘీక సమానత్వంను సాధించవలెనని పిలుపు ఇచ్చాడు.
శ్రీకాకుళంలో నాగభూషణం పట్నాయక్‌, ఆదిభట్ల కైలాసం మొదలగువారు CPI(ML) యొక్క నక్సలైట్‌ ఉద్యమంతో ప్రభావితులైనారు.
Ts Studies,TSstudies,TS Study Circle,indian history notes in telugu,indian history study material in telugu, indian history notes in telugu pdf,TSPSC indian history notes in telugu,tspsc group 2 study material in telugu,indian national movement in telugu,india freedom struggle notes in telugu,india national movement notes in telugu,india national movement study material in telugu,Indian history in telugu UPSC,Indian independence movement in telugu,Summary of Indian National Movement in telugu,Indian independence movement notes in telugu,Indian independence movement study material in telugu,Nationalist Movements in India,The New Nationalist Movement in India,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement study material in telugu,national movement for freedom in india,freedom struggle of india notes in telugu,freedom struggle of india study material in telugu,Gloroots of India's freedom struggle notes in telugu,Role of women in India's freedom struggle,Indian Freedom Struggle 1857 to 1947,Swadeshi Movement in India,ఉత్తర కోస్తాలోని జమిందార్లపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. కాని అప్పటి హోంమంత్రి జలగం వెంగళరావ్‌ (ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి) కఠినంగా వ్యవహరించి ప్రారంభంలోనే నక్సలైట్‌ ఉద్యమాన్ని శ్రీకాకుళంలో అణచివేశాడు. (Carrot and Stick method ద్వారా)
ఆ సమయంలో కొంత మంది నక్సలైట్లు తెలంగాణలోకి ప్రవేశించారు.
తెలంగాణలో రెండు కారాణాల వల్ల నక్సలైట్లు బలపడ్డారు .
1. తెలంగాణలోని భూస్వామ్య వ్యవస్థ
2. తెలంగాణలోని దట్టమైన అడవులు
ఆంధ్రలోని నక్సలైట్లు పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ అనే పేరుతో పోరాటం చేసేవారు.
పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ పై నిషేధం విధించబడిన తర్వాత వీరు మరలా నక్సలైట్లుగానే పోరాటం కొనసాగించారు.
2004లో భారతదేశంలోని నక్సలైట్‌ నాయకులందరూ చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ సమీపంలో గల దట్టమైన అడవులలో సమావేశమై ఇక నుండి కేంద్రీకృతంగా పోరాటం చేయవలనని నిర్ణయించారు.
దీంతో నక్సలైట్లు CPI(ML) మావోయిస్ట్‌ అనే పార్టీను స్థాపించి కేంద్రీకృతంగా పోరాటం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు.

కార్మిక సంఘాలు:
1905 ప్రింటర్స్‌ యూనియన్‌-కలకత్తా (మొదట గుర్తించబడిన కార్మిక సంఘంగా పేర్కొంటుంది)
1880 ఎన్‌.ఎం.లోకండే దీనబందు అను  వారపత్రికను ప్రచురించాడు. ఇతను బొంబాయి మిల్‌హండ్‌ అసోసియేషన్‌ను స్థాపించాడు.
1918 -మద్రాస్‌ లేబర్‌ యూనియన్‌ (జి.రామాంజనేయులునాయుడు)
1920 -ఏఐటీయూసీ (ఎన్‌. ఎం. జోషి) మొదటి అధ్యక్షుడు లాలాలజపతిరాయ్‌
1920 -జంపషెడ్‌పూర్‌ లేబర్‌ అసోసియేషన్‌ (ఎస్‌. ఎన్‌. హల్దార్‌, బ్యోమ్‌కేష్‌ చక్రవర్తి)
1929 -ఆల్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఫెడరేషన్‌
1931 -రెడ్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (దేశ్‌పాండే)
1938 -హిందుస్థాన్‌ మజ్టూర్‌ సభ (వల్లభాయ్‌ పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, జె.బి.కృపలాని)
1944 -ఐఎన్‌టీయూసీ (వల్లభాయ్‌ పటేల్‌)

మీరట్‌ కుట్ర కేసు:
1929 నాటికి బ్రిటీష్‌ ప్రభుత్వం జాతీయోద్యమంపై కమ్యూనిస్టులు మరియు కార్మిక ఉద్యమ ప్రభావాన్ని నిరోధించాలనే కృతనిశ్చయానికి వచ్చింది. దీంతో  నిర్బంధంలోకి తీనుకున్న కార్మిక, కమ్యూనిస్టు  నాయకులందరిని విచారణ నిమిత్తం మీరట్‌ తీసుకొని వెళ్లారు. దీనినే చారిత్రాత్మకమైన మీరట్‌ కుట్రకేసుగా వర్ణించారు.
మీరట్‌ కుట్రకేసు కార్మికోద్యమంపై బ్రిటీష్‌ వారు పారంభించిన దాడి యొక్క తొలి దశ అని జనహర్‌లాల్‌నెహ్రూ పేర్కొన్నాడు.