భారతదేశ ఆక్రమణ-6

TSStudies

మరాఠా ఆక్రమణ లేదా ఆంగ్లోమరాఠా యుద్దాలు(Anglo Maratha Wars):

మరాఠా రాజ్యాన్ని స్థావించినవాడు- శివాజీ (1627-80)
- శంభాజీ (1680-89) (కుమారుడు షాహూ)
- రాజారామ్‌ (1689-1700) (భార్య తారాబాయి)
- శివాజీ-8 (1700-08) (తల్లి తారాబాయి)
- షాహూ (1708-79) (తల్లి ఏసుబాయి)
- రామరాజ (1749-80)

పీష్వాలు:
బాలాజీ విశ్వనాథ్‌ (1713-20) (నానాసాహెబ్‌)
- బాజీరావు-1 (1720-40)
- బాలాజీ బాజీరావు (1740-61)
- మాధవరావు (1761-73)
- నారాయణరావు (1773-74)
- రఘోబా (రఘునాథరావు) 1774-75
- మాధవరావు-2 (1775-95)
- బాజీరావు-2 (1795-1818)

మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం(1775-82) :
గవర్నర్‌ జనరల్‌ - వారెన్‌ హేస్టింగ్‌
మాధవరావు మరణానంతరం నారాయణరావు పీష్వా అయ్యాడు
రఘునాథరావు నారాయణరావును వ్యతిరేకించి అతనిని హత్య చేసి తనకు తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు.
నారాయణరావు మరణానంతరం కొన్ని నెలలకు అతనికి 2వ మాధవరావు అనే కొడుకు జన్మించాడు.
British Conquest of India,how british British Conquest of India,British Conquest of India,history of anglo maratha war in telugu,anglo maratha wars history notes in telugu,causes to anglo maratha wars notes in telugu,anglo maratha war summary in telugu,facts of anglo maratha wars in telugu,first anglo maratha war history in telugu,second anglo maratha war history in telugu,history of third anglo maratha war in telugu,agreements of anglo maratha wars
మరాఠా మేధావులు అయిన నానా ఫాద్నిస్‌ (బాలాజీ జనార్ధన్‌), మహాధ్జి సింధియా మొదలగువారు 2వ మాధవరావును పీష్వాగా పేర్కొని రఘోబాపై యుద్ధం ప్రకటించారు.
దీనికి భయపడిన రఘోబా బ్రిటీష్‌ బొంబే ప్రభుత్వ సహాయమును ఆర్జి స్తూ సూరత్‌ అనే ఒప్పందంపై సంతకం చేశాడు. కానీ ఈ ఒప్పందం గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌కు తెలియకుండా జరగడంతో అతను దీనిని తిరస్కరించి నానాఫాద్నిస్‌తో పురంధర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. (దీని ప్రకారం బ్రిటీష్‌ రఘోబాకు సహాయం చేయదు)
బ్రిటీష్‌ బోంబే ప్రభుత్వం సూరత్‌, పురంధర్‌ ఒప్పందాలను లండన్‌కు పంపింది. బ్రిటన్‌ ప్రభుత్వం సూరత్‌ ఒప్పందాన్ని సమర్థించింది. దీంతో బ్రిటీషు బోంబే ప్రభుత్వ సైనికులు, రఘోబా సైనికులు నానా ఫాద్నిన్‌పై దాడులు ప్రారంభించారు.
కానీ నానాఫాద్నిస్‌ తెలగామ్‌ అనే యుద్ధంలో వీరిని ఓడించి బ్రిటీష్‌ చే వడగాం అనే ఒప్పందంపై సంతకం చేయించాడు.
కానీ వారెన్‌ హేస్టింగ్స్‌ 'వడగాం' ఒప్పందమును తిరస్కరించి జనరల్‌ గుడార్డ్‌ను మరాఠాపైకి పంపాడు.
1782 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే “సాల్బాయ్‌” అనే ఒప్పందంతో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది.
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు
సూరత్‌ ఒప్పందం - 1775
పురంధర్‌ = 1776
వడగాం - 1778
సాల్బాయ్‌ - 1782 (ఈ ఒప్పందం ప్రకారం సాల్‌సెట్టి బ్రిటీష్‌ వారికి ఇవ్వబడింది. ఇది బొంబాయి దగ్గర ఉంది)